కొత్త టపా: e - తెలుగు సమావేశం April 2007

1 view
Skip to first unread message

cbrao

unread,
Apr 15, 2007, 8:25:55 AM4/15/07
to telug...@googlegroups.com

ఈ నెల సమావేశ విశేషాలే కాకుండా  feminism తొక్కుతున్న కొత్త పుంతలు, మన తెలుగు తాళ పత్ర గ్రంధాలను digitalisation చేస్తున్న శ్రీ జయధీర్ తిరుమలరావు గురించిన పరిచయ వ్యాసం చదవండి.

http://deeptidhaara.blogspot.com/2007/04/e-april-2007.html#links

రవి వైజాసత్య

unread,
Apr 15, 2007, 3:11:30 PM4/15/07
to తెలుగుబ్లాగు
లేఖిని ఆపేస్తే మాక్ వినియోగదారులైన నాలాంటి వారి గతేం కాను?
ఈ-తెలుగు సంఘాన్ని నామోదు చేయకూడాదని నిర్ణయించారనుకున్న్నాను?

Prasad Charasala

unread,
Apr 16, 2007, 8:28:52 AM4/16/07
to telug...@googlegroups.com

లేఖినిని ఆపేయడమా? ఎవరామాటన్నది?
ఎటువంటి సఫ్ట్‌వేరూ install చేయలేని ఫెడరల్ గవర్నమెంటులో పనిచేస్తున్న నాలాంటి వారి గతేం కాను. లేదా ఏదో చుట్టాలింటికో, తెలుగు రాని/కాని వారింటికో వెళితే అక్కడ ఏదైనా తెలుగులో రాయాలంటే ఎలా? లేదు స్థానికంగా ఓ లైబ్రరీకి వెళతాను అక్కడ inscriptలూ అవీ వుండవు అప్పుడూ నాకు తెలుగులో రాయాలనిపిస్తుంది. ఏంచేయాలి లేఖిని లేకపోతే!!!

వీవెన్ కు కష్టమయితే దాన్ని నిర్వహించడానికి నేను రెడీ.

--ప్రసాద్
http://blog.charasala.com

jyothi valaboju

unread,
Apr 16, 2007, 8:33:43 AM4/16/07
to telug...@googlegroups.com
వీవెన్‍గారు ,,
 
లేఖిని ఎందుకు మూసేస్తున్నారు.మేమొప్పుకోము అంతే. మేము మా బ్లాగులను కూడా మూసేయాలా? ఇది వందలాది తెలుగు అభిమానుల అభిప్రాయం. నిర్ణయం మార్చుకోండి. (కోవాలి అంతే.) లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మరి . కాచుకుంటారా?

Tummala Sirish Kumar

unread,
Apr 16, 2007, 8:39:19 AM4/16/07
to telug...@googlegroups.com
కంప్యూటర్లో తెలుగు రాసేందుకు లేఖిని పలక లాంటిది. పుస్తకాలు ఎన్నున్నా, పలక పలకే! అది మూసేస్తే అక్షరాలు నేర్చుకునేవారి చేతుల్లోంచి పలక లాగేసుకున్నట్లే! లేఖినిని మూసేస్తారంటే నేన్నమ్మను, జోకై ఉంటుంది!
-శిరీష్

Prasad Charasala

unread,
Apr 16, 2007, 8:42:00 AM4/16/07
to telug...@googlegroups.com

ఇది ఏప్రిల్ 1 కూడా కాదే నమ్మలేకపోవడానికి!

Veeven (వీవెన్)

unread,
Apr 16, 2007, 9:01:29 AM4/16/07
to telug...@googlegroups.com
కొన్ని సార్లు మనం ఆకాశం అంచులదాకా వెళ్ళిపోయి ఆలోచిస్తుంటాం.
అలాంటప్పుడు వచ్చిందే లేఖినిని మూసేసే ఆలోచనకూడా. జనాలను inscript కి
మరల్చడానికి నేను ఆలోచిస్తున్న ఉపాయాల్లో ఇదొకటి. అంతేగానీ నిజంగా
మూసేయాలని కాదు. అలా అనుకున్నవాటినన్నీ అనుకున్నట్టుగా అమలు చేసేస్తామా
ఏమిటీ. రావుగారూ... మీతో జాగ్రత్తగా ఉండాలి.

Sudhakar S

unread,
Apr 16, 2007, 9:17:15 AM4/16/07
to telug...@googlegroups.com
జగదేక వీరుడు అతిలోక సుందరి డైలాగ్ గుర్తుకొచ్చింది. :-)

--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Prasad Charasala

unread,
Apr 16, 2007, 9:49:04 AM4/16/07
to telug...@googlegroups.com

హమ్మయ్య! లేఖినిని మూసేయాలనే కల గూడా కనకండి :)

గత వారం నాతో పనిచేసే ఓ మరాఠా అబ్బాయి వచ్చాడు నీవు తెలుగులో ఎలా రాస్తావు నేను మరాఠాలో రాయాలంటే ఎలా అని. అన్నింటా వెతికి చూశా "లేఖిని"లాంటి సదుపాయం ఇతర భాషలకు లేదు. మాలా పని చేస్తున్న చోట్ల దేన్నీ install చేసుకోనివ్వరు. చివరికి inscript వాడాలన్నా లభ్యం కాదు. మరి నేను తెలుగు రాయగలుగుతున్నా కానీ ఆయన మరఠాలో రాయలేకున్నాడు. లేఖినిలోనే అలా ఇతర భాషలకూ సదుపాయం కలిపిస్తే ఎలా వుంటుందని మీతో ఆలోచించాలనుకున్నా!

ఏమంటారు? కొద్దిగా కష్టపడితే మిగతా భాషలకు కూడా లేఖిని ఉపయోగపడొచ్చు కదా!

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 16, 2007, 10:07:35 AM4/16/07
to telug...@googlegroups.com
మరాఠీ అబ్బాయికి బరహా పనిచేస్తుందేమో కదా?
--
http://yarnar.blogspot.com

Veeven (వీవెన్)

unread,
Apr 16, 2007, 10:15:37 AM4/16/07
to telug...@googlegroups.com
On 4/16/07, Prasad Charasala <char...@gmail.com> wrote:
> హమ్మయ్య! లేఖినిని మూసేయాలనే కల గూడా కనకండి :)
కనలేను. మా ఆవిడ కూడా లేఖిని వాడుతుంది మరి.

>
> గత వారం నాతో పనిచేసే ఓ మరాఠా అబ్బాయి వచ్చాడు నీవు తెలుగులో ఎలా రాస్తావు నేను
> మరాఠాలో రాయాలంటే ఎలా అని. అన్నింటా వెతికి చూశా "లేఖిని"లాంటి సదుపాయం ఇతర
> భాషలకు లేదు. మాలా పని చేస్తున్న చోట్ల దేన్నీ install చేసుకోనివ్వరు. చివరికి
> inscript వాడాలన్నా లభ్యం కాదు. మరి నేను తెలుగు రాయగలుగుతున్నా కానీ ఆయన
> మరఠాలో రాయలేకున్నాడు. లేఖినిలోనే అలా ఇతర భాషలకూ సదుపాయం కలిపిస్తే ఎలా
> వుంటుందని మీతో ఆలోచించాలనుకున్నా!
>
> ఏమంటారు? కొద్దిగా కష్టపడితే మిగతా భాషలకు కూడా లేఖిని ఉపయోగపడొచ్చు కదా!
చాలా పరికరాలున్నాయి. మళ్ళీ నేను ఒళ్ళు కదల్చడమెందుకు.

ఉదాహరణకు ఇది చూడండి: Any Indian language, any layout (RTS, inscript):
http://entrans.sourceforge.net/demo/scripts/

Prasad Charasala

unread,
Apr 16, 2007, 10:22:33 AM4/16/07
to telug...@googlegroups.com

రానారె, బరహాను install చేయాలి కదా!

వీవెన్, మీరిచ్చిన లింకు బానే వుంది. థ్యాంక్స్!

Praveen Garlapati

unread,
Apr 16, 2007, 10:25:43 AM4/16/07
to telug...@googlegroups.com
Ramanadha Reddy Yarrapu Reddy wrote:
> మరాఠీ అబ్బాయికి బరహా పనిచేస్తుందేమో కదా?
ఇది చూడలేదా ?
*మాలా పని చేస్తున్న చోట్ల దేన్నీ install **చేసుకోనివ్వరు.
**
*

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 16, 2007, 11:32:44 AM4/16/07
to telug...@googlegroups.com
ప్రవీణ్, ప్రసాద్ గారు, థాంక్యూ.
బరహా కూడా లేఖిని లాంటిదనుకున్నాను, నేనెప్పుడూ వాడలేదు.
మొదట లేఖిని , ఇప్పుడు Inscript వాడటం నేర్చుకున్నాను.
ఈ సందర్భంగా వీవెన్‌కు కృతజ్ఞతలు మరియు అభినందనలు.

 

jyothi valaboju

unread,
Apr 16, 2007, 11:48:24 AM4/16/07
to telug...@googlegroups.com
లేఖిని లాంటిది ఇంకోటి ఉంది.
 
 
 
 

రాకేశ్ ఆచంట

unread,
Apr 16, 2007, 2:56:45 PM4/16/07
to తెలుగుబ్లాగు
నేను ఎప్పుడు Inscript చేస్తా. 'సంత' (3 అక్షరాలు) ను 'saMta' (5
అక్షరాలు)అని వ్రాయడం ఇష్టంలేక.
తెలుగు stickers కొనుక్కోగలిగితే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఏ వేలు
క్రింద ఏముందో బట్టి వచ్చేసింది.
ఆంధ్ర ప్రదేశంలో ఉన్నవారు stickers కొనరక్కోవచ్చు. :)

ఐనా నేను లేఖిని మూసివేయడానికి వ్యతిరేకమే.
లేఖిని కొత్త బ్లాగర్లను ఆకర్షిచడంలో చాలా విజయవంతమైంది.
అలానే ఏ ఇంటర్నెట్ కెఫె కో వెళ్ళినప్పుడూ ఉపయోగ పడుతుంది.

కాని లేఖిని వాడేవారందరిని inscript కి మార్చేయాలి.
దానికి ఒక ప్రత్యేక ఆసక్తి కూటమి ఒకటి తయారు చేసి (special interest
group/ lobby) ,
అన్ని లాబీల లాగే, ఎవరూ నిరూపించలేని కొన్ని గణాంకాలు అల్లేసి
చెప్పాలి. :)

గణాంకమంటే గుర్తుకు వచ్చింది.
"మీకు తెలుసా RTS కంటే inscript లో అదే వ్యాసం వ్రాయడానికి 45.6789%
తక్కువ key strokes సరిపోతాయని. " :)

గణాంకాలు పట్టనివారికి
మొన్నే ఊళ్లో బావి దగ్గర విన్నా :)
"inscript వాడితే మీ జీవితంలో కష్టాలన్ని తీరిపోతాయి"
"మీ కంప్యూటర్ చాలా వేగంగా నడుస్తుంది"

వీవేన్ గారు,

false alarms ఇస్తే జనాలు alternatives వెతికేసుకుంటారు. మన user base
తగ్గి పోయే ప్రమాదం కూడా ఉంది.

- రాకేశ్
http://andam.blogspot.com/

On Apr 16, 10:48 am, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
wrote:

Tummala Sirish Kumar

unread,
Apr 16, 2007, 3:06:29 PM4/16/07
to telug...@googlegroups.com
రాకేశ్ గారూ, ఈ ఇన్‌స్క్రిప్టు గురించి వీవెన్ ఎప్పటినుండో చెబుతున్నారు, 'వాడండి, బాగుంటుంది, చకచకా అయిపోతుందీ' అని. ఇన్‌స్క్రిప్టు "నేర్చుకోవడమనే" అంశం అడ్డొస్తోంది. మీ గణాంకాలు, బావిగట్టు కబుర్లు బావున్నాయి. కొన్నాళ్ళు దీన్నీ ప్రయత్నించి చూస్తే ఎలా ఉంటుందో..!!.
-శిరీష్

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 16, 2007, 3:51:16 PM4/16/07
to telug...@googlegroups.com
పనిలోను, ఇంటిదగ్గర మాత్రమే inscript వాడేవారు అలా configure చేసుకోవడమే మంచిది. నాకిది ఎలా అబ్బిందంటే "ఆంధ్రమహాభారతం" అనే గూగుల్ గుంపులో (భారతాన్ని యూనీకోడ్ తెలుగులో రాసే ప్రోజెక్టు) జోరుగా ఒక్కొక్కరం ఒకసారి ముప్పై పద్యాలు/గద్యాలు రాసేవాళ్లం (స్తున్నాం!?). నాకు లేఖినిలో అయితే అరగంట సరిపోయేది. PDF చూసి లేఖినిలో రాయడానికి Alt+Tab కొట్టడం, పై పెట్టెలో రాసింది సరిగా ఉందో లేదో కిందిపెట్టెలో చూసుకోవడం, కాపీ + పేస్టు, చిన్న పొరబాటు జరిగితే అంతవరకూ రాసిందంతా పోవడం (auto save లేదుగనక), ఒక చిన్న పదానికి తలవెంట్రుకలన్ని key strokes కొట్టాల్సిరావడం లాంటి సమస్యలుండేవి. అప్పుడు inscript మొదలెట్టాను. కొత్తలో ఒకో key వెతుక్కొని రాయాల్సివచ్చేది. key mapping వెతకాల్సివచ్చినపుడు ఇక్కడికో, తెవికీకో వెళ్లి చూడాల్సొచ్చేది. 30 పద్యాలకు ఒక రోజుపట్టింది. పట్టు వదలకుండా బ్లాగుల్లో కామెంట్లు కూడా ఓపికగా inscriptలో రాసేవాణ్ణి. లేఖినికి అలవాటుపడిపోవడంతో ఒక బ్లాగుపోస్టు రాయాలంటే ఏడుపొచ్చినంత పనయ్యేది. అది ప్రసవవేదన అంటారే అలాంటి దశ. అలవాటు పడ్డాక ఇంగ్లీషులో రాసినంత వేగంగా రాసిపడేయొచ్చు. కాబట్టి చదువరిగారు, తప్పకుండా ప్రయత్నించండి. స్టిక్కర్లు కూడా దొరుకుతాయంటున్నారు రాకేశ్. ఇంకేముంది! మరింత సులభం.

 
-- రానారె
http://yarnar.blogspot.com

శ్రీనివాస

unread,
Apr 16, 2007, 4:50:54 PM4/16/07
to తెలుగుబ్లాగు
ఇప్పటి వరకు నేనూ ఇన్‌స్క్రిప్త్ ఉపయోగించలేదు. దానికి కారణం దాని
గురించి ఆలోచించకపోవడమే! ఇంత మంది నెజ్జనులు చెబుతున్నారు కాబట్టి ఓసారి
చూడాల్సిందే. ఎవరన్నా దీనిని ఎలా ఉపయోగీంచాలో బ్లాగులో రాయొచ్చుకదా? లేదా
http://wiki.etelugu.org లో రాస్తే మరీ మంచిది.

@వీవెన్ ఎలాగూ లేఖిని RTS కోడ్ ఉంది కదా; ఇన్‌స్క్రిప్ట్‌ని అధ్యయనం చేసి
cross convertion ( Inscript -> RTS -> Unicode ) కోసం కోడ్ జత చేస్తే
సరిపోతుందేమో! ఇది ఊహ మాత్రమే.
- శ్రీనివాసరాజు దాట్ల

On Apr 17, 12:51 am, "Ramanadha Reddy Yarrapu Reddy"


<iamramuh...@gmail.com> wrote:
> పనిలోను, ఇంటిదగ్గర మాత్రమే inscript వాడేవారు అలా configure చేసుకోవడమే
> మంచిది. నాకిది ఎలా అబ్బిందంటే "ఆంధ్రమహాభారతం" అనే గూగుల్ గుంపులో (భారతాన్ని
> యూనీకోడ్ తెలుగులో రాసే ప్రోజెక్టు) జోరుగా ఒక్కొక్కరం ఒకసారి ముప్పై
> పద్యాలు/గద్యాలు రాసేవాళ్లం (స్తున్నాం!?). నాకు లేఖినిలో అయితే అరగంట
> సరిపోయేది. PDF చూసి లేఖినిలో రాయడానికి Alt+Tab కొట్టడం, పై పెట్టెలో రాసింది
> సరిగా ఉందో లేదో కిందిపెట్టెలో చూసుకోవడం, కాపీ + పేస్టు, చిన్న పొరబాటు
> జరిగితే అంతవరకూ రాసిందంతా పోవడం (auto save లేదుగనక), ఒక చిన్న పదానికి
> తలవెంట్రుకలన్ని key strokes కొట్టాల్సిరావడం లాంటి సమస్యలుండేవి. అప్పుడు
> inscript మొదలెట్టాను. కొత్తలో ఒకో key వెతుక్కొని రాయాల్సివచ్చేది. key
> mapping వెతకాల్సివచ్చినపుడు

> ఇక్కడికో<http://www.microsoft.com/globaldev/keyboards/kbdintel.htm>,


> తెవికీకో వెళ్లి చూడాల్సొచ్చేది. 30 పద్యాలకు ఒక రోజుపట్టింది. పట్టు వదలకుండా
> బ్లాగుల్లో కామెంట్లు కూడా ఓపికగా inscriptలో రాసేవాణ్ణి. లేఖినికి
> అలవాటుపడిపోవడంతో ఒక బ్లాగుపోస్టు రాయాలంటే ఏడుపొచ్చినంత పనయ్యేది. అది
> ప్రసవవేదన అంటారే అలాంటి దశ. అలవాటు పడ్డాక ఇంగ్లీషులో రాసినంత వేగంగా
> రాసిపడేయొచ్చు. కాబట్టి చదువరిగారు, తప్పకుండా ప్రయత్నించండి. స్టిక్కర్లు
> కూడా దొరుకుతాయంటున్నారు రాకేశ్. ఇంకేముంది! మరింత సులభం.
>

> On 4/16/07, Tummala Sirish Kumar <sirishtumm...@gmail.com> wrote:
>
>
>
>
>
>
>
> > రాకేశ్ గారూ, ఈ ఇన్‌స్క్రిప్టు గురించి వీవెన్ ఎప్పటినుండో చెబుతున్నారు,
> > 'వాడండి, బాగుంటుంది, చకచకా అయిపోతుందీ' అని. ఇన్‌స్క్రిప్టు "నేర్చుకోవడమనే"
> > అంశం అడ్డొస్తోంది. మీ గణాంకాలు, బావిగట్టు కబుర్లు బావున్నాయి. కొన్నాళ్ళు
> > దీన్నీ ప్రయత్నించి చూస్తే ఎలా ఉంటుందో..!!.
> > -శిరీష్
>

> -- రానారెhttp://yarnar.blogspot.com- Hide quoted text -
>
> - Show quoted text -

రాకేశ్ ఆచంట

unread,
Apr 16, 2007, 11:00:26 PM4/16/07
to తెలుగుబ్లాగు
ఏంటి సంగతి. ఇన్ స్క్రిప్ట్ లో వ్రాయాలంట

వికీపీడియా లింకు ఉందిగా.. చిన్నప్పుడు నేను అదే చూసేవాడిని
http://te.wikipedia.org/wiki/వికీపీడియా:విండోసు_XP
లేక పోతె వెంకటరమణగారి లింకు ఉందిగా...
http://telugublog.blogspot.com/2006/03/xp.html

"@వీవెన్ ఎలాగూ లేఖిని RTS కోడ్ ఉంది కదా; ఇన్‌స్క్రిప్ట్‌ని అధ్యయనం
చేసి
cross convertion ( Inscript -> RTS -> Unicode ) కోసం కోడ్ జత చేస్తే
సరిపోతుందేమో! ఇది ఊహ మాత్రమే. "

మీరనేది నాకు అర్థం కాలేదు. Inscript అంటే నేరుగా Unicode
వచ్చేస్తుందండి.

- రాకేశ్

On Apr 16, 3:50 pm, "శ్రీనివాస" <srinivasaraju.da...@gmail.com> wrote:
> ఇప్పటి వరకు నేనూ ఇన్‌స్క్రిప్త్ ఉపయోగించలేదు. దానికి కారణం దాని
> గురించి ఆలోచించకపోవడమే! ఇంత మంది నెజ్జనులు చెబుతున్నారు కాబట్టి ఓసారి

> చూడాల్సిందే. ఎవరన్నా దీనిని ఎలా ఉపయోగీంచాలో బ్లాగులో రాయొచ్చుకదా? లేదాhttp://wiki.etelugu.orgలో రాస్తే మరీ మంచిది.

> > -- రానారెhttp://yarnar.blogspot.com-Hide quoted text -

Praveen Garlapati

unread,
Apr 17, 2007, 1:15:42 AM4/17/07
to telug...@googlegroups.com

> "@వీవెన్ ఎలాగూ లేఖిని RTS కోడ్ ఉంది కదా; ఇన్‌స్క్రిప్ట్‌ని అధ్యయనం
> చేసి
> cross convertion ( Inscript -> RTS -> Unicode ) కోసం కోడ్ జత చేస్తే
> సరిపోతుందేమో! ఇది ఊహ మాత్రమే. "
> మీరనేది నాకు అర్థం కాలేదు. Inscript అంటే నేరుగా Unicode
> వచ్చేస్తుందండి.
అవును.

కానీ దాట్ల గారు చెప్పేది ఇన్‌స్క్రిప్ట్ నుండి RTS కి మాపింగ్ చెయ్యమని, అప్పుడు లేఖిని ద్వారా ఇన్‌స్క్రిప్ట్
లో టైప్ చెయ్యచ్చు. అది RTS కి, ఆపయిన తెలుగు యూనికోడ్ కి ట్రాన్స్లేట్ అవుతుంది. మంచి ఆలోచనే.

సత్యసాయి కొవ్వలి

unread,
Apr 17, 2007, 8:09:07 AM4/17/07
to తెలుగుబ్లాగు
inscript వల్ల - pc మే రఖ్నే మే ఆసానీ, ఇస్తమాల్ కర్నేమే ఆసానీ ...
Reply all
Reply to author
Forward
0 new messages