బ్లాగు మిత్రులకు నమస్కారం
చాలా రోజులనుండి మనం మన తెలుగుబ్లాగు పోస్టులలో ఇన్స్క్రిప్ట్ నేర్చుకోవడం గురించి చాలా చర్చలు జరిగాయి. ఈరోజే నేను చూసిన ఒక కంప్యూటర్ ఆట గురించి మీకు తెలియచేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది పూర్తిగా ఉచితం. దీని పేరు Tux Typing. ఇంతవరకు నేను ఇది ఇంగ్లీషు కోసంమాత్రమే అని అనుకున్నాను. కాని ఈరోజు ఎందుకో దాన్నిలోని ఆప్షన్లు చూస్తుంటే భారతీయభాషలలో కూడా ఇన్స్క్రిప్ట్ కీబోర్డు సాయంతో ఈ ఆటను ఆడవచ్చని చూసాను. తెలుగు లో కూడా ఆటలు ఉన్నాయి. ఇలాంటి ఆటలు ఆడుతే త్వరగా తెలుగు టంకణం వంటబడుతుంది. ఉత్సాహవంతులైన మన ప్రోగ్రామింగ్ మిత్రులు దీనిని ఇంకా బాగా అభివృద్ధి చెయ్యడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆంగ్లభాషలో కుంజీ పటలం (గాభరా పడవద్దు key board కు ఇది హిందీ) నేర్చుకోవడం కోసం ఒక పాఠం ఇచ్చారు. దానితో asdfjkl; వరుస నేర్చుకోవచ్చు. మిగతావి ఎలా తయారు చేసుకోవాలో చెప్పారు. దానిప్రకారం నేను రెండురోజులుగా asdfgf ;lkjhj మరియు qwertr poiuyu వరుసలకు పాఠాలు తయారు చేసాను. దీనివల్ల తెలిసినదేమిటంటే తెలుగుకు కూడా ఇటువంటి పాఠాలు తయారుచేసుకోవచ్చని.
ఇంక మరి ఆలస్యం ఎందుకు. త్వరగా జాలం నుండి దీనిని దింపుకోండి.
మీ వేణుగోపాల్
(కీ బోర్డు కి అక్షరపేటిక అని వాడుతున్నాను నేను.)
గిరి
ఇంకో దురదృష్టం ఏమిటంటే, మొన్న నేను హైదరాబాదులో ఎంత తిరిగినా తెలుగు
కీబోర్డు స్టిక్కర్లు దొరకలేదు.
ఉరుదూ కీబోర్డు వుందంట ఓ కాడ. కానీ తెలుగు లేదంట.
ఇంటర్నెట్ లో స్టిక్కర్లు దొరుకుతున్నాయిగానీ, మరీ 12 డాలర్లు.
ఎవరైనా ఈ స్టిక్కర్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలిగితే బాగుంటుంది.
http://www.datacal.com/telugu-overlays.htm
రాకేశ్వరా
On Sep 27, 9:52 pm, రాకేశ్వర రావు <rakesh...@gmail.com> wrote:
> నేను బొత్తాల పట్టి అనువాడుతున్నాను. :) తలో కీబోర్డు తలో కీబోర్డు పేరు
> అన్నట్టుంది మన పని!!
> ఆ Tux కి లంకె కూడా ఇక్కడే ఇచ్చేస్తే బాగుండేది.
>
> ఇంకో దురదృష్టం ఏమిటంటే, మొన్న నేను హైదరాబాదులో ఎంత తిరిగినా తెలుగు
> కీబోర్డు స్టిక్కర్లు దొరకలేదు.
> ఉరుదూ కీబోర్డు వుందంట ఓ కాడ. కానీ తెలుగు లేదంట.
>
> ఇంటర్నెట్ లో స్టిక్కర్లు దొరుకుతున్నాయిగానీ, మరీ 12 డాలర్లు.
> ఎవరైనా ఈ స్టిక్కర్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలిగితే బాగుంటుంది.http://www.datacal.com/telugu-overlays.htm
అర్జున గారూ
మీ ప్రయత్నం చాలా బాగుంది. వీలయితే ఆంగ్లభాషకు ఒకరంగు తెలుగు అక్షరాలకు వేరొకరంగు వాడండి.
అలాగే ౠ ౄ ఌౡ (అలు అలూలు) మరియు ZWNJ (Zero width non joiner)మరియు JWJ (Zero width joiner?) కూడా ఎలా టైపుచెయ్యాలో చెపితే బాగుంటుంది.
ఇంత క్రితం ఒక సైటులో pdf లో మీటకం యొక్క చిత్రం దొరికింది. వారు కూడా పైన చెప్పినవి కావాలంటే ఎలా టైపుచేసుకోవాలో వ్రాస్తే ఇంకా బాగుంటుంది.
దీన్ని A4 ఆకారంలో దొరికే స్టికర్ పేపరు మీద ప్రింటు చేసుకుని కీబోర్డు మీద అతికించు కోవచ్చు.
దువ్వూరి వేణుగోపాల్
నేను iLeap కొన్నప్పుడు (1999 లో అనుకుంటా) C-DAC వాడు దానితో పాటు ఇన్స్క్రిప్ట్ స్టిక్కర్లు కూడా ఇచ్చాడు (తెలుగో హిందీయో గుర్తులేదు). అలాగే నాకు ఇన్స్క్రిప్ట్ కీబోర్డు వచ్చింది.
వేణుగోపాల్
అర్జున గారూ
మీ ప్రయత్నం చాలా బాగుంది. వీలయితే ఆంగ్లభాషకు ఒకరంగు తెలుగు అక్షరాలకు వేరొకరంగు వాడండి.
అలాగే ౠ ౄ ఌౡ (అలు అలూలు) మరియు ZWNJ (Zero width non joiner)మరియు JWJ (Zero width joiner?) కూడా ఎలా టైపుచెయ్యాలో చెపితే బాగుంటుంది.
ఇంత క్రితం ఒక సైటులో pdf లో మీటకం యొక్క చిత్రం దొరికింది. వారు కూడా పైన చెప్పినవి కావాలంటే ఎలా టైపుచేసుకోవాలో వ్రాస్తే ఇంకా బాగుంటుంది.
దీన్ని A4 ఆకారంలో దొరికే స్టికర్ పేపరు మీద ప్రింటు చేసుకుని కీబోర్డు మీద అతికించు కోవచ్చు.