సినిమాలతో పదనిసలు
తప్పనిసరైతే తప్ప forwarded mails మన గుంపుకు పంపటం ఇష్టం ఉండదు. (దానికి కారణం ఈ గుంపుని మిగతా యాహూ గుంపులకంటే భిన్నంగా చూడాలని-ఆనంద్ సినిమాలో రూప ఆనంద్‌తో కారులో ప్రయణిస్తూ అంటుందే -నిన్ను ఎప్పుడూ ఎక్కువగా , ఉన్నతంగా, ఒక మెట్టు ఎక్కువుగా చూడాలని అర్ధమొచ్చేలా కుడి చెయ్యి ఎత్తుగా పెడుతూ అంటుంది 'అక్కడుండాలి నువ్వు ' గుర్తుందా?) . ఐతే స్రుజనాత్మకమైన రచనలకు, బుర్రకు పనిచెప్పే , లోక జ్ఞానం పెంచే ప్రశ్నలంటే ఇష్టమే. మన గుంపుకు స్రుజనాత్మకంగా జ్యొతి పంపే ప్రశ్నలు కూడ ఇష్టమే . .సరే, ఆట కంటే ఉపొద్ఘాతం ఎక్కువ య్యే ప్రమాదం కనిపిస్తొంది.
ఈ పదనిసలో నేనొ చిత్రం పేరు చెపుతా. మీరు ఆ చిత్రానికి మూల కథ రచయిత పేరు , ఆ కథ లేక పుస్తకం పేరు చెప్పాలి. తరువాత మీరు మరో ప్రశ్న వెయ్యండి.
ఉదాహరణకు
చిత్రం పేరు మూల కథ రచయిత
బాటసారి బడదీది శరత్
నా మొదటి ప్రశ్న ఏకవీర చిత్రం మూల కథ, రచయిత పేరు చెప్పండి.
ఇప్పుడు మీరు సమాధానం, మరో ప్రశ్న రాసి ఈ టపాకే జత చెయ్యండి.
గమనిక: తెలుగు చిత్రాల మూలకథలు అనే పేరుతో ఒక వ్యాసం తెలుగు వికిపిడియకు , పంపబడుతుంది. ఈ ఆటలో అందరూ చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి.
--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/
ఇటువంటివి ఆర్కుట్లో అయితే మంచి రెస్పాన్సు వస్తుంది
మనము ఎంతమందిమి? తిప్పి తిప్పి కొడితే మూడు నుర్ల్
కానీ అక్కడయితే మూడు వేలమంది ఉంటారు
http://flickr.com/photos/chavakiran
naa sOdi
"వెన్నెల్లో ఆడపిల్ల" - యండమూరి వీరేంద్రనాథ్
జంబలకిడి పంబ కు ఆధారం?
(క్లూ .. చతురలో వచ్చిన ఒక నవల)
నా ప్రశ్న
సినిమా పేరు - శంకుతీర్ధం
మూలకధ - రచయిత(త్రి) ?