౧. ఏ రచయితైనా ఎందుకు ఇటువంటి పత్రికలకి తను రాతలు పంపవలసిన అవసరం? ఎలాగు
బ్లాగులొచ్చేక ప్రచురణ చాలా తేలిక అయిపోయింది కదా? మన గురించి, మన బ్లాగు
గురించి ఇతరులకి (పాఠకులకి) తెలియ చెప్పడానికి ఒకవేళ ఈ పత్రికలు ఉపయోగ
పడతాయి అనుకొంటే, కూడలి, తేనెగూడు ఆ పని ఇంకా బాగా చేస్తున్నాయి కదా?
ఎలాగు, ఈ పత్రికలు చదివే వాళ్ళందరూ, కూడలి కూడా చుస్తారు - అందువల్ల,
ప్రత్యేకమైన పబ్లిసిటీ ఈ పత్రికల్లో మన రచనలు ప్రచురించటం వల్ల రాదు.
౨. ఒకవేళ పది మందికీ పనికొచ్చే రీసెర్చ్ క్వాలిటీ సరుకు మనదగ్గరుంటే,
వాటిని పదికాలాల పాటు పదిల పరచటానికి వికీపీడియా ఉంది. వికీపీడియాలో మనం
కూర ముక్కలు తరిగి పడెస్తే, పదిమందీ తలో చెయ్యీ వేసి, దాంతో పప్పు
చేసెస్తారు. ఆ వెసులుబాటు కూడా ఈ పత్రికలులో రచనలకి లేదు. ఇవి వికీపీడియా
అంత శాశ్వతం కావు కూడా కదా?
౩. ఈ పత్రికలన్ని ఉచిత పత్రికలు కాబట్టి, పారితోషికాలు కూడా ఇవ్వలేవు.
౪. పోనీ, ఈ పత్రికలు, మనం పంపే రచనలని, సానబెట్టి, వాటిని ఎడిట్ చేసి,
మెరుగులు దిద్ది ప్రచురిస్తున్నాయా అంటే, నాకైతే అలా అనిపించటం లేదు.
౫. పోని, పాఠకులకేమైనా ఈ పత్రికల్లో రచనలు చదవటం వల్ల ప్రత్యేకమైన
ప్రయోజనాలున్నాయా అంటే, అవి కూడా నాకేం కనిపించడం లేదు. బ్లాగులైతే, ఆ
బ్లాగరితో ముఖాముఖి సంప్రతించొచ్చు కదా?
ఏ రకంగా ఆలోచించినా, ఈ పత్రికల ప్రయోజనం ఏమిటో నాకు తెలిసిరావటం లేదు.
ఏదో ఒక ప్రజా ప్రయోజనం లేకపోతే, అవి కలకాలం ఎలా బతికి బట్ట గలవు?
వాటికేమీ ప్రయోజనం లేదని నేనడంలేదు, నాకు తెలియట్లేదంతే.
ఈ తెలుగు బ్లాగు ప్రపంచాన్ని సృష్టించిన విశ్వామిత్రులూ, నడిపిస్తూన్న
అతిరథ, మహారథులనీ ఈ విషయంలో నాకింత జ్ఞాన భిక్ష పెట్టమని సవినయంగా మనవి.
-- నాగరాజు పప్పు
http://salabanjhikalu.blogspot.com
మీ సందేహాలూ, ప్రశ్నలూ అర్థవంతాలే. నిజమే బ్లాగులొచ్చాక ప్రచురణ నల్లేరు మీద బండి నడక అయిపోయింది. ప్రతి రచయితా తన విశిష్ట రచనలను పాటకులు తమ బ్లాగుల్లోనే చదవాలనుకుంటారు. ఇక వాటికి కూడలి, తేనెగూడు లాంటివి కావాల్సిన ప్రచారాన్ని ఇస్తున్నాయి.
కాకపోతే నాకు కనిపిస్తున్న ఒక లాభమేమంటే ఆ పత్రిక నిర్వహిస్తున్న వారి అభిరుచిని బట్టి (ఇదీ ఓ బ్లాగు లాగానే) అందులో కథనాలను చదవడానికి కొందరికి అభిలాష వుండొచ్చు. అయితే ఇది వ్యక్తిగత బ్లాగులకూ వర్తిస్తుందనుకోండి.
--ప్రసాద్
http://blog.charasala.com
కులగజ్జా?!!!
నాకెక్కడా అలా అనిపించలేదే!!!
వికిపీడియా వ్యాసాలకు పత్రిక వ్యాసాలు భిన్నము..ఉదాహరణకి నేను పొద్దులో
సొమాలియా పై రాసిన వ్యాసం వికిపీడియాలో పెట్టలేను..ఎందుకంటే అందులో చాలా
మటుకు నా అనుభవాలు, నా భావాలు.
అలా పత్రికలు మరిన్ని రావాలి..అందులో 90% శాతం చతికిలపడతాయి..బలమైనవి
నిలిచి ఆదరణ పొందుతాయి..
On Feb 17, 9:18 am, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
wrote:
పొద్దు గురించి కాదు నేనన్నది
On Feb 17, 9:18am, "jyothi valaboju" < jyothivalab...@gmail.com>
--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.
ఇకపోతే నా అభిప్రాయం ఏంటంటే...
ఈ పత్రికల్లోనే కాక ఈ-పత్రికలన్నిటిలో రాసేవారు అందరూ బ్లాగర్లు
అయిఉండకపోవచ్చు. అందులో కొందరికి బ్లాగే ఓపికా, సమయము లేకపోవచ్చు.
అంతేకాక లబ్ధప్రతిష్టులైన కొందరు రచయితలు కూడా వారి రచనలను ఈ-పత్రికలకు
పంపితే వాటిని వీరు ప్రచురించి మనకు ఎంతో మేతను అందజేస్తున్నారు
(ఉదా.గొల్లపూడి మారుతీరావు, వేమూరి వెంకటేశ్వరరావు...వగైరా). కావాలంటే
సుజనరంజని, ఈ-మాట చూడండి. ఇక పొద్దు ఇప్పుడిప్పుడే పొడుస్తోంది.
మున్ముందు ఎంత పేరు తెచ్చుకోనుందో మనం ఊహించలేం కదా. అన్నిటికన్నా Peer-
Review అన్న సూత్రం పత్రికలకు వర్తిస్తుంది. అన్ని సైంటిఫిక్ జర్నల్లను
ఒకే గాట కట్టలేనట్టే... ఈ-పత్రికల్లో కూడా వాటి వాటి విలువను బట్టి
పాఠకులు ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది. కానీ ఇది పాఠకులు నిర్ణయించుకోవాలి
కానీ అసలు పత్రికలే ఒద్దనకూడదు కదా!
ఇక్కడ బ్లాగు/వికీ/పత్రిక వేరు వేరు. అన్నీ వాటికవే సాటి! ...ఒకటి కూని
రాగం/మరొకటి బృందగానం/ఇంకొకటి పాట కచేరి!
On Feb 16, 11:38 am, "Ramanadha Reddy Yarrapu Reddy"
<iamramuh...@gmail.com> wrote:
> దాటలేక కాదులే రామయతండ్రీ
> మమ్ము దయజూడగ వచ్చావు రామయతండ్రీ
> రామయతండ్రి ఓ రామయతండ్రీ
> మా నోములన్ని పండినాయి రామయతండ్రీ
> మా సామివంటె నువ్వేలే రామయతండ్రీ
>
> మీ సందేహం చూసి పాటలోని పై చరరణం గుర్తొచ్చింది.
> ఇదే ప్రశ్న మా తెలుగు టీచర్ అడిగితే నా సమాధానం ఇలా వుంటుంది:
>
> ౧. ఏ రచయితైనా ఎందుకు ఇటువంటి పత్రికలకి తను రాతలు పంపవలసిన అవసరం? ఎలాగు
> బ్లాగులొచ్చేక ప్రచురణ చాలా తేలిక అయిపోయింది కదా? మన గురించి, మన బ్లాగు
> గురించి ఇతరులకి (పాఠకులకి) తెలియ చెప్పడానికి ఒకవేళ ఈ పత్రికలు ఉపయోగ
> పడతాయి అనుకొంటే, కూడలి, తేనెగూడు ఆ పని ఇంకా బాగా చేస్తున్నాయి కదా?
> ఎలాగు, ఈ పత్రికలు చదివే వాళ్ళందరూ, కూడలి కూడా చుస్తారు - అందువల్ల,
> ప్రత్యేకమైన పబ్లిసిటీ ఈ పత్రికల్లో మన రచనలు ప్రచురించటం వల్ల రాదు.
> *జవాబు:* పత్రిక అనేది కొన్ని ప్రమాణాలకు తగ్గకుండా నడుస్తుంటుంది - నిర్వాహకుల
> అభిరుచిని బట్టి. పత్రిక విజ్ఞులైన వారి సలహాలను కళ్లకద్దుకుంటుంది. పత్రిక
> కేవలం ఒక వ్యక్తి మనోగతం కాదు. కొందరి సమిష్టి ఆలోచనలకు సమైక్య సుందరరూపం.
> (కొంచెం ఎక్కువైందా? కేవలం నాభావాన్ని మాత్రమే గ్రహించండి. వర్ణనను
> పట్టించుకోకండి.) నిజమే కదా - చాలా రకాల విషయాలను సమ పాళ్లలో వుంచి,
> ఆలోచనలను ఐక్యంచేసి, అందంగా అందించే పని పత్రికలోనే జరుగుతుంది. ఎవరైనా ఆ
> పత్రిక చూసి మంచి ప్రయత్నం అనుకొని, దానికి మెరుగులు పెట్టిపోషిస్తే ఇంకా
> బాగుంటుందని 'ఫీల్'అయి, సలహాలివ్వడానికి వెనుకాడే అవకాశం తక్కువ. పత్రిక
> సమిష్టి పుత్రిక కనుక సలహాలను సూచనలను పరిగణించి మరింత హుందాగా తీర్చే ప్రయత్నం
> జరుగుతుందనే నమ్మకం వలన. అదే బ్లాగయితే ఉచిత సలహాలిస్తే 'తూ కౌన్ బే'
> అంటుందేమో/అంటాడేమో అని భయంతో మనకెందుకులే అనిపిస్తుంది. బ్లాగులో నా బ్లాగులో
> నాకు తెలిసింది మాత్రమే నేను రాస్తూపోగలను. అందరూ దాన్ని చూసి పొగిడితే
> సంతోషిస్తాను. నాకు విసుగొస్తే అపేస్తాను. పత్రిక అంత సులువుగా ఆగిపోదు. మంచి
> ప్రమాణాలతో నడిచే పత్రికకు మంచి ప్రమాణాలున్న పాఠకులుంటారు.
> విజ్ఞులుంటారు. మంచి విమర్శలొస్తాయ్. పత్రికలో రచనలు చేయడం
> 'పాపు'లరైపోవడానికేనా? పాపులర్ కావచ్చు కానీ దానితోపాటు ఈ సజ్జనసాంగత్యం,
> విమర్శలు, వాదాలు వ్యక్తిగా మనల్ని మనం నిరంతరం మెరుగుపరచుకొనే ప్రక్రియకు
> పత్రిక ఒక వేదిక.
>
> ౨. ఒకవేళ పది మందికీ పనికొచ్చే రీసెర్చ్ క్వాలిటీ సరుకు మనదగ్గరుంటే,
> వాటిని పదికాలాల పాటు పదిల పరచటానికి వికీపీడియా ఉంది. వికీపీడియాలో మనం
> కూర ముక్కలు తరిగి పడెస్తే, పదిమందీ తలో చెయ్యీ వేసి, దాంతో పప్పు
> చేసెస్తారు. ఆ వెసులుబాటు కూడా ఈ పత్రికలులో రచనలకి లేదు. ఇవి వికీపీడియా
> అంత శాశ్వతం కావు కూడా కదా?
> *జవాబు:* ఒక వ్యాసానికి చదివించే గుణం వుండటం ఎంత ముఖ్యమో
> తెలియనిదికాదు. దానికి ఎలా అబ్బుతుందీ గుణం? అందులో కొంత హాస్యం, కొంత
> సస్పెన్సు, కొంత అద్భుతరసం లాంటి బెల్లమూ ఉప్పూ కారమూ పులుపూ ఆద్యంతమూ పూస్తే
> వదలకుండా చదవబుధ్దవుతుంది. వికీపీడియా విషయానికి పెద్దపీటవేస్తుందేకానీ అందులో
> నవరసాలు అనవసరం అంటుంది. దాని కొరతలు దానికీ వున్నాయి. ఏదైనా తెలియకపోతే,
> అది తెలుసుకొనాలనిపిస్తే శ్రద్ధగా వికీపీడియా చదువుకోవచ్చు. చదివించడం,
> నేర్పించడం పత్రికలకే సాధ్యం.
>
> ౩. ఈ పత్రికలన్ని ఉచిత పత్రికలు కాబట్టి, పారితోషికాలు కూడా ఇవ్వలేవు.
> *జవాబు:* ఔను మీరు ఉదహరించిన పత్రికలన్నీ 'ఉచిత' పత్రికలే. వాటిలో కొన్ని
> సముచిత పత్రికలు. అవి సమున్నతాలవడానికి ప్రయత్నిస్తున్న పత్రికలు. పారితోషికం
> ఇవ్వలేవనడం సబబుకాదు. ఎందుకంటే అవి పారితోషికాలు ఇస్తున్నాయి. పైకమే
> పారితోషికమా?
>
> ౪. పోనీ, ఈ పత్రికలు, మనం పంపే రచనలని, సానబెట్టి, వాటిని ఎడిట్ చేసి,
> మెరుగులు దిద్ది ప్రచురిస్తున్నాయా అంటే, నాకైతే అలా అనిపించటం లేదు.
> *జవాబు:* సానబెట్టడం, ఎడిటింగ్ జరుగుతున్నాయి. కొన్ని పత్రికల నిర్వాహకులు ఈ
> విషయంలో ఇంకా ప్రాథమిక విద్యార్థులు. వాళ్లకు ఇది ప్రవృత్తి. వాళ్లకు భృతి
> కల్పించే వృత్తులు వేరే వున్నాయి. వారి ప్రవృత్తితో ఏకీభవనించే అనుభవజ్ఞుల
> సాంగత్యాన్ని ఈ పత్రికలవారు స్వాగతిస్తారు.
>
> ౫. పోని, పాఠకులకేమైనా ఈ పత్రికల్లో రచనలు చదవటం వల్ల ప్రత్యేకమైన
> ప్రయోజనాలున్నాయా అంటే, అవి కూడా నాకేం కనిపించడం లేదు. బ్లాగులైతే, ఆ
> బ్లాగరితో ముఖాముఖి సంప్రతించొచ్చు కదా?
> *జవాబు:* ప్రయోజనాలు లేకేం.కొత్త విషయాలు తెలియడం, మంచి మనసును మంచిగానే వుంచే
> వ్యాసాలు చదవడం, ఆత్మావలోకనం కలిగించే రచనలుచేయడం, వాటిని చదవడం ఇవన్నీ
> ప్రయోజనాలే కదా!
>
> నేను 'మహర్షి విశ్వామిత్ర'నూ కాను, 'మహారథి'నీ కాను, 'స్టూడెంట్ నంబర్.1'నీ
> కాను.
>
> నేను మామూలు ...
>
> read more »
నామటుక్కు నాకు పొద్దు లో వచ్చిన నా వ్యాసం (నేనెందుకు బ్లాగుతున్నాను)
నా బ్లాగులన్నిటికన్నా ఎక్కువ సంతృప్తిని, సంతోషాన్నీ ఇచ్చింది. పొద్దు
సంపాదకులు ఉదారంగా అనుమతించినప్పటికీ ఆవ్యాసాన్ని నా బ్లాగులో
పెట్టడానికి మనసొప్పలేదు. ఎందుకంటే ఆ వ్యాసాన్ని పొద్దు గురించే వీలైనంత
శ్రద్ధగా వ్రాయడానికి ప్రయత్నించా. అదే బ్లాగులో వ్రాయడానికైతే ఏదో
వ్రాసిపడేసేవాడిని.
అయితే, నేనీ ప్రశ్నలు ఒక బ్లాగర్ గానో, ఇప్పుడిప్పుడే నడకలు
నేర్చుకొంటున్న రచయితగానో అడగలేదు. నేను కంప్యూటింగ్ సైంటిస్టుగా,
టెక్నోక్రాట్ గా, ఇంటర్నెట్-ఎకానమి ఎనలిస్ట్ గా అడుగుతున్నాను. వెబ్-౨.౦
రోజులు గతించి వెబ్-౩.౦ వచ్చేసింది. శ్రీశ్రీ అన్న జగన్నాధ రథచక్రాలు
భూమార్గం పట్టేసాయి - భూకంపాలు కూడా ఇప్పటికే చాలా వచ్చేయి, ఇంకా
వస్తాయి. ఈ బ్లాగింగ్, సోషల్-కంప్యూటింగ్, సిమాంటిక్-వెబ్ అన్ని కలగలపి
ఇప్పటి అంచనాల ప్రకారం మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ట్.
మధ్య తరగతి ఆంద్రుల్లా కాకుండా ముందు చూపున్న అమెరికన్లలా ఒక సారి
ఆలోచించండి. మీరంతా ఇప్పడున్న వర్తమాన పరిస్తితిని మాత్రమే చూస్తున్నారు.
ఇంకో మూడు సంవత్సరాలలో తెలుగు బ్లాగులు లక్ష దాటేయనుకోండి, ఆ తర్వాత పది
లక్షలు దాటటానికి మూడు నెలలు పడుతుంది. అప్పుడు కూడలి, తేనెగూడు
ఏమవుతాయి? వాటిని నడపడానికి పార్ట్-టైమ్ పని సరిపోతుందా? మీకు పెద్ద
పెద్ద డాటాసెంటర్లు కావాలి, సాఫ్ట్-వేర్ ప్రోగారమర్లు కవాలి, ఎడిటోరియల్
స్టాఫ్ కావాలి, కంటెంట్ ఎక్సెపర్టులు ఇంకా చాలా చాలా. ఎక్కడనుంచి వస్తాయి
ఇవన్నీ?
ఒకవేళ పదిలక్షల బ్లాగులు కాని కూడల్లో ఉంటే - పాఠకుడికి ఇప్పటి కూడలి
ఇంటర్-ఫేస్ వల్ల ఏ ఉపయోగమూ ఉండదు కదా? (ఇక్కడ ఇంటర్-ఫేస్ అంటే యూసర్-
ఇంటర్-ఫేస్ అని నా ఉద్హెశ్యం కాదు. సిమాంటిక్ ఇంటర్-ఫేస్).
ఇంక వెబ్-జన్ల గురించి.. ఈ రోజు ఎమ్.ఐ.టి టెక్నాలజీ రివ్యూలో మీ వ్యాసం
కాని, మీ బ్లాగ్ కాని ప్రచురితమైతే, ఆ వెంటనే మీరు ఒక గంట ఉపన్యాసనానికి
మూడువేల డాలర్లు అడగొచ్చు, ముక్కుపిండి వసూలు చెయ్యచ్చు. అలాగే పేరున్న
మిగతా పత్రికలుకూడా. అవన్నీ, పార్ట్-టైమ్ పత్రికలు కావు. వాటిని
నడపడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? నా ఇంగ్లీష్ బ్లాగ్
మెదలెట్టేకా, కొన్ని పేపర్లు ప్రచురించేకా - నా కన్సల్టింగ్ రేటు - రెండు
రెట్ల కన్న ఎక్కువే అయ్యింది. ఇది స్వానుభవం.
తెలుగులో మన అదృష్ట వసాత్తూ - ఇప్పుడు ముందుంది నడిపిస్తున్న వాళ్ళందరూ
సత్తా ఉన్న వాళ్ళే - ఈ మాట, కౌమది పత్రికల ఇప్పుడు మార్కెట్ట్ లో
వస్తున్న వారపత్రికలకంటే ఎంత మెరుగ్గ ఉన్నాయో రెండూ చదివిన వాళ్ళకి ఎరుకే
గదా? కాబట్టి ఈ పత్రికలు ఎమ్.ఐ.టి టెక్నాలజి రివ్యూ అంత ఎత్తుకి ఎందుకు
ఎదగ కూడదు?
అలాగే, కూడలి, తేనెగూడు -- తెలుగు కంప్యూటింగ్ ప్రపంచానికి ఓ యాహూ,
గూగుల్ ఎందుకు కాకుడదు?
అలా కావాలంటే, ఇప్పటి నుంచి మీరు ప్రణాలికలు సిద్దం చేసుకోవాలి కదా?
కా.రా.రా మేష్టారు, తన కథానిలయాన్నంతా డిజిటైజ్ చెయ్యాలనుకొంటున్నారు. ఆ
పని, కూడలో, తేనెగూడో ఎందుకు చెయ్యకూడదూ? ఇప్పుడు గూగుల్ చేస్తున్న పని
అదే కదా - ఆక్స్-ఫర్డ్ గ్రంధాలయన్నాంతా డిజిటైజ్ చెసే ప్రయత్నంలో ఉన్నాది
గూగుల్.
ఒకసారి భవిష్యత్తులోకి, కూడలినీ-ఈమాటని కలిపి ఒకే సంస్తగా చూడండి, ఒక పది
లక్షల తెలుగు బ్లాగులని చూడండి - మీకేం కనిపిస్తోంది? నాకైతే మీ అందరి
ముందు ఒక మహదావకాశం కనిపిస్తోంది.
ఇక కులగజ్జి గురించి: ఈ ప్రపంచంలో ఎంత ఉందో, ఎమి ఉందో అదంతా ఇంటర్నెట్టు
లోనూ ఉంది. అన్నిటికీ స్తానం ఉంది. మనకి నచ్చిందే ఈ ప్రపంచంలో ఉండాలంటే,
మనం ఒక్కరిమే మిగులుతాము. మనం ఎదగ దలచుకొంటే, అన్నిటినీ సమదృష్టితో
చూడాలనుకొంటాను. ఎవరో కులగజ్జిని గురించి రాస్తే కూడలికేం? కులగజ్జి ఒక
విభజన పెట్టి, అందులో ఆ వార్తలన్నీ వేస్తే సరి. కులగజ్జి గురించి కూడా
తెలుసుకొందాం - తప్పేముంది?
ఇక, బ్లాగర్లు, పారితోషకాల గురించి: అంత తేలికగా కొట్టి పడెయ్యకండి. మీరు
బ్లాగు మొదలెట్టేకా మీకేమర్దమయ్యింది? మీదగ్గరా చెప్పటానికేదో ఉందని, అది
చెప్పటం మీకు తెలుసని, మీరు చెప్పేదాని మీద పదిమందికీ ఆశక్తి ఉందని. ఈ
బ్లాగు సౌకర్యం లేకపోతే అది సాధ్యమయ్యేదా? సామాన్యుడు సామ్రాట్టు అవ్వడం
అంటే ఇదే. మీరు కూడా ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎదగొచ్చు. మీరు ఈ పాటికే
అన్ని ఫ్రీ-లన్సింగ్ సైట్లు ఇంగ్లీషులో ఉన్నాయో చూడండి. తమ రచనా ప్రతిభ
ధ్వారా - చాలా మంది, చక్కగా ఏ పల్లెటూర్లోనో కూచొని జీవనోపాధిని
కలిగించుకోగలగుతున్నారు. ఏమండీ - మీ రచనల ద్వారా - మీరు ఓ చీరో-రవికో,
కూరో-నారో, పలుగో-పారో కొనుక్కోగలిగితే - ఏం చేదా? ఇప్పుడు మీకున్న
ఉత్సాహానికి, శక్తికి - సామర్ద్యం, క్రమశిక్షణా, ప్రణాలికా కూడా తోడైతే -
అదే సౌధమో, సామ్రాజ్యమో కూడా కావచ్చు.
మీరంతా ఒకరికొకరు తెలుసు, కలసి పనిచేస్తున్నారు, యువశక్తి, ఉధ్యమ
స్పూర్తి కూడా ఉన్నాయి. కాస్తా ముందు చూపు, కొంచెం గుండె ధైర్యం కూడా
తోడైతే - ఇప్పుడు మీరు తలపెట్టిన కార్యం ఒక మహాశక్తిగా ఎదగ గలదు. మీలో
చాలామంది టెక్నోక్రాట్లు కూడాను. ఇంకేం అన్నీ కలిసేయి. ఏ వెంచర్ ఫండిగో
సంపాదించండి. ఒక మూడేళ్లలో ఆ జగన్నాధ రథచక్రాల సవ్వడి ప్రతి తెలుగువాడి
గుండెల్లోనూ వినిపిస్తుంది.
ఒక్క సంగతి - the definition of business has completely changed after
the emergence of service oriented economy. Instead of looking at
business as a bad word, and profit as another word for large scale
cheating - one has to change one's outlook. మీరు అందిస్తున్న సేవకి
విలువేమైనా ఉందా? మీ ఘర్మ జలానికి విలువ గట్టే షరాబిప్పుడు మీరే. అది
మరచి పోకండి. అందుకే, ఈ ఇంటర్నెట్ట్ విప్లవం నిజంగానే మానవాళికి మరో
ప్రస్థానం.
నాయనా - నీ కవితల్లాగనే, నీ వ్యాసాలు అర్ధం కావు, నీ ప్రశ్నలు వాటికి నీ
జవాబులూ అంతకన్నా అర్ధం కావు? మా బుర్రలు తినడానికి ఎక్కడినుంచి
అవతరించేవయ్యా మగడా అంటారా? మరేం చెయ్యమంటారు - ఇదంతా చెప్పడానికి ఓ ఐదు
గంటలు పడుతుంది. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు, మీకు వినాలనుంటే -
అర్ధమయ్యెలా చెప్పగలను.
తప్పులుంటే మన్నించ గలరు.
-- నాగరాజు.
--
V. Rami Reddy
PhD Student
LGPD, IBDM, Case 907
Faculté des sciences de Luminy
13288 Marseille Cedex 9
France
vat...@ibdm.univ-mrs.fr
reddy...@yahoo.com,
People say,"I was born intelligent,education ruined me!"
But I say,"I was born a fool,education just made matters worse!!"
<a href="http://www.plosbiology.org"><img
src="http://www.plos.org/images/pbio_234x60.png" alt="PLoS Biology -
www.plosbiology.org" width="234" height="60" border="0"></a>
ప్రశ్న అడిగి నేను పారిపోలేదండోయ్. ఇక్కడే ఉన్నాను. అందరూ
అదరగొడుతున్నారు - ధన్యవాదాలు. రానారే - తిన్నావు కదయ్యా. సి,బ్.రావు
గారు స్టాటిస్టిక్స్ కూడా చూపించి అభిప్రాయాలకి, వాస్తవాలకి మధ్య తేడాలు
కూడా చూపించేరు -- ఆయనకి కూడా చాలా ధన్యవాదాలు.
ఇంక వెబ్-జన్ల గురించి.. ఈ రోజు ఎమ్.ఐ.టి టెక్నాలజీ రివ్యూలో మీ వ్యాసం
కాని, మీ బ్లాగ్ కాని ప్రచురితమైతే, ఆ వెంటనే మీరు ఒక గంట ఉపన్యాసనానికి
మూడువేల డాలర్లు అడగొచ్చు, ముక్కుపిండి వసూలు చెయ్యచ్చు. అలాగే పేరున్న
మిగతా పత్రికలుకూడా. అవన్నీ, పార్ట్-టైమ్ పత్రికలు కావు. వాటిని
నడపడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? నా ఇంగ్లీష్ బ్లాగ్
మెదలెట్టేకా, కొన్ని పేపర్లు ప్రచురించేకా - నా కన్సల్టింగ్ రేటు - రెండు
రెట్ల కన్న ఎక్కువే అయ్యింది. ఇది స్వానుభవం.
తెలుగులో మన అదృష్ట వసాత్తూ - ఇప్పుడు ముందుంది నడిపిస్తున్న వాళ్ళందరూ
సత్తా ఉన్న వాళ్ళే - ఈ మాట, కౌమది పత్రికల ఇప్పుడు మార్కెట్ట్ లో
వస్తున్న వారపత్రికలకంటే ఎంత మెరుగ్గ ఉన్నాయో రెండూ చదివిన వాళ్ళకి ఎరుకే
గదా? కాబట్టి ఈ పత్రికలు ఎమ్.ఐ.టి టెక్నాలజి రివ్యూ అంత ఎత్తుకి ఎందుకు
ఎదగ కూడదు?
అలాగే, కూడలి, తేనెగూడు -- తెలుగు కంప్యూటింగ్ ప్రపంచానికి ఓ యాహూ,
గూగుల్ ఎందుకు కాకుడదు?
అలా కావాలంటే, ఇప్పటి నుంచి మీరు ప్రణాలికలు సిద్దం చేసుకోవాలి కదా?
కా.రా.రా మేష్టారు, తన కథానిలయాన్నంతా డిజిటైజ్ చెయ్యాలనుకొంటున్నారు. ఆ
పని, కూడలో, తేనెగూడో ఎందుకు చెయ్యకూడదూ? ఇప్పుడు గూగుల్ చేస్తున్న పని
అదే కదా - ఆక్స్-ఫర్డ్ గ్రంధాలయన్నాంతా డిజిటైజ్ చెసే ప్రయత్నంలో ఉన్నాది
గూగుల్.
ఒకసారి భవిష్యత్తులోకి, కూడలినీ-ఈమాటని కలిపి ఒకే సంస్తగా చూడండి, ఒక పది
లక్షల తెలుగు బ్లాగులని చూడండి - మీకేం కనిపిస్తోంది? నాకైతే మీ అందరి
ముందు ఒక మహదావకాశం కనిపిస్తోంది.
కూడలి ని ఏ విధంగా మలచాలి అన్నది. దానిని commercial వయిపు తీసుకు వెళ్ళాలా లేక ఉచితంగా ఉంచాలా.
(నేను తప్పుగా అర్థం చేసుకునుంటే క్షమించాలి). ఈ decision ఎవరు తీసుకోవాలి ?
కొన్ని నాకు తోచిన పాయింట్లు:
ఉచితం అన్నది రుచించినట్టుగా జనాలకి డబ్బు కట్టమంటే రుచించదు. అలాంటప్పుడు ఎన్నో వెబ్ సైట్ లకి
ఎదురయిన దుస్థితే కూడలి కి కూడా వచ్చే ప్రమాదం ఉంది. మొదటికే మోసం రావచ్చు.
ఇప్పుడు రాసే వారందరిలో ఎక్కువగా సరదాకి రాసేవారే. ఎదో మనకి తెలిసింది నలుగురితో పంచుకోవాలనే
సదుద్దేశంతో. మరి దీనిని ఒక business opportunity గా పరిగణిస్తే ఎంత మంది full time గా పని
చేస్తారు అన్నది అనుమానాస్పదమే. మీరన్నట్టు ఇంట్లో కూర్చుని సంపాదించవచ్చు అన్నది అందరికీ వర్తించదు
కదా. మరి వెరయిటీ అనే spice లేకుండా ఎలా సాగుద్ది ?
మరి కొద్ది మంది జనాలకు మాత్రమే కూడలి లో స్థానం ఇచ్చి వాటి content ను చదవండి అన్నారా అదీ బోల్తా కొడుద్ది.
commercial చేసిన వెంటనే జనాలు ROI ఆశిస్తారు. మరి మంచి content ని పట్టి తేవాలి కదా ? దానికి
మరి వేరే వెబ్ సైట్ లనుంచి copy/paste అంటారా. originality ఉంది కాబట్టే కూడలి లాంటివి అందరికీ
నచ్చుతాయి అని నా అభిప్రాయం. వేరే దగ్గర నుంచి చూపిస్తే గనక దానికి ఆ విలువ ఉండదు.
బ్లాగులు పేరిగే కొద్దీ కూడలి మనలేదు అంటారా ? వికీ పీడియా లాంటివి మనట్లేదుటండీ. అలాగే కూడలి కూడ
adapt అవుద్ది.
నా అభిప్రాయం ఒక్క బ్లాగుల aggregation తో మాత్రమే commercialize చెయ్యడం సాధ్యం కాదు.
అదనంగా services ఉండాలి.
కానీ ఆ అలోచన ఉండి ఆ ప్రకారం అలోచిస్తే కష్టమేమీ కాదు. కానీ మళ్ళీ అదే దానిని ఎటు తీసుకెళ్ళాలి అనేదే ?
కానీ కూడలి ని మలచడానికి కాకుండా విడిగా అలోచిస్తే ఈ localization లో, translation లో,
aggregation లో ఒక business opportunity ఉండవచ్చు.
నాది business పరంగా చాలా immature అలోచనలే. కానీ చెప్పాలనిపించింది.
On Feb 21, 12:10 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
<iamramuh...@gmail.com> wrote:
> కా.రా.రా మేషారు అంటే ఎవరండీ?
>
> On 2/21/07, Ramanadha Reddy Yarrapu Reddy <iamramuh...@gmail.com> wrote:
>
>
>
>
>
> > తిన్నానా ... తినే ఉంటాను (స్వగతం).
>
> > నారగాజుగారూ,
>
> > ఇదే సలహా నా తమ్ముడు కూడా ఇచ్చాడు. మీరు చూసినంత ముందుకు కాకపోయినా, వాడూ
> > కొంత ముందుచూపుతోనే 'ఇంత బాగా రాస్తున్నారు, దీన్ని మీరు ఆదాయమార్గంగా
> > మార్చుకోవచ్చుకదా' అని.
> > అప్పడు నేనన్నాను - 'నిజమే గో.నా., మేమిప్పుడు మా
> > ఇష్టమొచ్చినప్పుడు మాకిష్టంవచ్చింది మాకోసమన్నట్టుగా రాస్తున్నాం. వ్యాపారంగా
> > మారితే రాయడం అనే ఈ సరదా కాస్తా బాధ్యత అవుతుంది కదా. అలా అయినపుడు మనసుకు
> > ఇప్పుడున్నంత సృజన ఉంటుందా? ఎవరికోసమో ఫలానా సమయంలోపు రాయాలనే తలంపే భారంగా
> > ఉందే' అని.
> > మీ మీదున్నంత గురి (గురుభావం లాంటిదనుకోండి) వాడిమీద నాకు
> > లేదు. ఎందుకంటే మా గో.నా. రాయడు, ఇక, రాసిందానిమీద సంపాదన మాట సరేసరి.
> > కానీ మీరలాకాదుకదా, మీరైనా సరే 'నీకు ఇంతిస్తాం, నాలుగురోజుల్లోగా ఫలానా
> > విషయంమీద ఒక మీడియంసైజు కవిత రాసి'మ్మంటే రాయగలగా?
> > ఇంకో ధర్మ సందేహం గురూజీ, 'రానారే - తిన్నావు కదయ్యా' అంటే ఏమిటండీ?
>
> > -- రానారె
> >http://yarnar.blogspot.com
>
> ...
>
> read more »- Hide quoted text -
>
> - Show quoted text -
ఫ్రవీణ్ గారి అభిప్రాయం తొ నేను పూర్తీగా ఏకిభవిస్తాను. ఇక్కద వ్రాసే వారందరు ఫ్రిలాన్సర్సే అన్నది నా అభిప్రాయం. అంతా ఏదొ సరదా కొద్ది వ్రాసేవారే. మనకొ కొత్త విషయం తెలిస్తెనో, మనమేదైన ఊరు వెళ్ళి వస్తేనో, ఆ విషయన్ని మనమిత్రులకి, ఇరుగు పొరుగు వారికి చెప్పి పడే ఆనందాన్ని, బ్లాగటం ద్వారా పొందుతున్నాము. అంతేగాని, ప్రోఫెషనల్ రచయతల్లా, సిరియస్ గా, ఈ వెబ్-జైన్లు గురించి గొడవేమిటంది మద్యలో?
On Feb 21, 10:10 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"

మన బ్లాగ్సమాజానికి ఇలాంటి 'దీర్ఘదర్శి' అవసరం ఎంతైనా ఉంది...కానీ
బ్లాగులను వ్యాపారాత్మకంగా చూడటానికి నా మనసొప్పడం లేదు. ఒక కూడలి, ఒక
తేనెగూడు భవిష్యత్తులో ఆ వైపు అడుగేస్తే ఏమో గానీ...నా మటుకు నేను నా
బ్లాగులో ఈ 'గూగుల్' య్యాడ్ లు ఉంచుకోకూడదని 'ఘా'ట్టి నిర్ణయం
తీసుకొన్నాను. దేశికాచారి గారి 'పోతన' కూర్పుతో రాస్తున్న నా బ్లాగుకు
"బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్..."అన్న పోతన మాటలే ఆదర్శం!
ఇది ఎవర్నీ నొప్పించడానికి రాయలేదు. నా భావాలను తెలియజేసానంతే!