పదాలతో తికమక

110 views
Skip to first unread message

Praveen Garlapati

unread,
Apr 5, 2007, 2:27:15 PM4/5/07
to telug...@googlegroups.com
ఈ మధ్య నాకు కొద్దిగా తికమక గా ఉంది కొన్ని పదాలతో.

రాసారు, చూసారు లాంటి పదాలలో మామూలు స వాడాలా లేక మెలికల శ నా ?

నేను మామూలు స వాడతాను. కొన్ని బ్లాగులలో మెలికల శ వాడటం చూసాను.

ఏది సరయినది ?

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 5, 2007, 2:58:10 PM4/5/07
to telug...@googlegroups.com
రాసినారు, రాశారు, చూసినారు, చూశారు - ఇవి సరైనవని నమ్ముతాను. ఎందుకంటే మాట్లాటప్పుడు సరిగ్గా ఇలాగే పలుకుతాం కనుక.
రాసారు, పో సారూ, చూసారు - ఇవి కృతకంగా అనిపిస్తాయి నాకు.

 

Sudhakar S

unread,
Apr 5, 2007, 3:23:59 PM4/5/07
to telug...@googlegroups.com
చూశాడు? పోశాడు? ఇవి తప్పు...
 
నాకైతే చూసారు, పోసారు అనటం తప్పులేదేమో

 
--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Tummala Sirish Kumar

unread,
Apr 5, 2007, 9:15:28 PM4/5/07
to telug...@googlegroups.com
నాకు తెలిసి..
రాసారు, చూసారు.. వీటిల్లో పలికేది శా కాదు, స్యా . బ్యాంకు లో బ్యా లాగా. కారం కంటే కారమే అక్కడ తగును. అయితే కొంత మంది వాడే సే మరింత సరైనది -రాసేరు, పోసేరు.. ఇలాగ. పప్పు నాగరాజు గారు అలా రాస్తారు.
-శిరీష్

మధు

unread,
Apr 5, 2007, 4:52:00 PM4/5/07
to తెలుగుబ్లాగు
హహ్హ...ఈ అయ్యోమయ్యం, హైదరాబాదు వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది,
నిజంగా చెప్పాలంటే, అక్కడ చాలాలంది చూశి, చేశి అని మాట్లాడుతూ ఉంటే నాకు
చిరాకు కలిగిన సన్నివేశాలు ఎన్నో...

ఇంతకీ సంగతి ఏంటంటే,

శారద ని సదా ని గమనించండి
పామరులు శారద ని షారద అని అంటుంటారు.

ఈ మాదిరిగానే తక్కినవి కూడా.. తద్విధంగా యార్నార్ గారు నమ్మినవి
సరైనవి... అవి ప్రకృతి పదాలు ఐతే, తక్కినవి వికృతులు( అంటే పామరులు
మాట్లాడేది అనమాట )
అన్నట్టు, తెలుగు బ్లాగర్లకి "ఖైదీ నంబర్లు" (విహారి గారు అన్నట్టు)
ఉంటాయి అని విన్నాను... నా నంబరెంతో కుతూహలం కొద్దీ తెలుసుకోవాలని ఉంది.
ఆమధ్య రెండు మూడు బ్లాగులు మొదలెట్టి, ఎగ్గొట్టినందుకు నిర్వహుకులకు
కోపమొచ్చిందో ఎంటో!

నా నంబర్ తెలుసుకునే అవకాశం ఉందా??


On Apr 5, 2:27 pm, Praveen Garlapati <praveengarlap...@gmail.com>
wrote:

Sudhakar S

unread,
Apr 5, 2007, 10:24:34 PM4/5/07
to telug...@googlegroups.com
"సే" అని ఎక్కువగా కోస్తాలో వాడుతారు. "స్య" అని హైదరాబాదులో మాత్రమే వాడుతారు. ఏది ఏమైనా "శ" మాత్రం లేదు.
 
చూశాను...అనటం అక్కినేని నాగేశ్వరరావు గళానికే సొంతం.
 
ఇది చూడండి...http://sodhana.blogspot.com/2005/04/blog-post_07.html (ఖచ్చితంగా 728 రోజుల క్రితం బ్లాగినది) :-)

 
On 4/6/07, మధు <sma...@gmail.com> wrote:
హహ్హ...ఈ అయ్యోమయ్యం, హైదరాబాదు వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది,
నిజంగా చెప్పాలంటే, అక్కడ చాలాలంది చూశి, చేశి అని మాట్లాడుతూ ఉంటే నాకు
చిరాకు కలిగిన సన్నివేశాలు ఎన్నో...

ఇంతకీ సంగతి ఏంటంటే,

శారద ని సదా ని గమనించండి
పామరులు శారద ని షారద అని అంటుంటారు.

ఈ మాదిరిగానే తక్కినవి కూడా.. తద్విధంగా యార్నార్ గారు నమ్మినవి
సరైనవి... అవి ప్రకృతి పదాలు ఐతే, తక్కినవి వికృతులు( అంటే పామరులు
మాట్లాడేది అనమాట )
అన్నట్టు, తెలుగు బ్లాగర్లకి "ఖైదీ నంబర్లు" (విహారి గారు అన్నట్టు)
ఉంటాయి అని విన్నాను... నా నంబరెంతో కుతూహలం కొద్దీ తెలుసుకోవాలని ఉంది.
ఆమధ్య రెండు మూడు బ్లాగులు మొదలెట్టి, ఎగ్గొట్టినందుకు నిర్వహుకులకు
కోపమొచ్చిందో ఎంటో!

నా నంబర్ తెలుసుకునే అవకాశం ఉందా??




On Apr 5, 2:27pm, Praveen Garlapati <praveengarlap...@gmail.com>

wrote:
> ఈ మధ్య నాకు కొద్దిగా తికమక గా ఉంది కొన్ని పదాలతో.
>
> రాసారు, చూసారు లాంటి పదాలలో మామూలు స వాడాలా లేక మెలికల శ నా ?
>
> నేను మామూలు స వాడతాను. కొన్ని బ్లాగులలో మెలికల శ వాడటం చూసాను.
>
> ఏది సరయినది ?


టి.యల్.యస్.భాస్కర్

unread,
Apr 6, 2007, 1:00:41 AM4/6/07
to తెలుగుబ్లాగు

అమ్మో...భాష గురుంచి చర్చ...

స, శ ఇప్పుదు వాడకం లో ఉన్నాయి.

ఒకప్పుడు "చూచితిని" అని వాడారు కూడా (అంటే "చూసాను" అని అర్థం వస్తుంది.

భాస్కర్


On Apr 6, 7:24 am, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> "సే" అని ఎక్కువగా కోస్తాలో వాడుతారు. "స్య" అని హైదరాబాదులో మాత్రమే వాడుతారు.
> ఏది ఏమైనా "శ" మాత్రం లేదు.
>
> చూశాను...అనటం అక్కినేని నాగేశ్వరరావు గళానికే సొంతం.
>

> ఇది చూడండి...http://sodhana.blogspot.com/2005/04/blog-post_07.html(ఖచ్చితంగా


> 728 రోజుల క్రితం బ్లాగినది) :-)
>
> On 4/6/07, మధు <sma...@gmail.com> wrote:
>
>
>
>
>
>
>
> > హహ్హ...ఈ అయ్యోమయ్యం, హైదరాబాదు వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది,
> > నిజంగా చెప్పాలంటే, అక్కడ చాలాలంది చూశి, చేశి అని మాట్లాడుతూ ఉంటే నాకు
> > చిరాకు కలిగిన సన్నివేశాలు ఎన్నో...
>
> > ఇంతకీ సంగతి ఏంటంటే,
>
> > శారద ని సదా ని గమనించండి
> > పామరులు శారద ని షారద అని అంటుంటారు.
>
> > ఈ మాదిరిగానే తక్కినవి కూడా.. తద్విధంగా యార్నార్ గారు నమ్మినవి
> > సరైనవి... అవి ప్రకృతి పదాలు ఐతే, తక్కినవి వికృతులు( అంటే పామరులు
> > మాట్లాడేది అనమాట )
> > అన్నట్టు, తెలుగు బ్లాగర్లకి "ఖైదీ నంబర్లు" (విహారి గారు అన్నట్టు)
> > ఉంటాయి అని విన్నాను... నా నంబరెంతో కుతూహలం కొద్దీ తెలుసుకోవాలని ఉంది.
> > ఆమధ్య రెండు మూడు బ్లాగులు మొదలెట్టి, ఎగ్గొట్టినందుకు నిర్వహుకులకు
> > కోపమొచ్చిందో ఎంటో!
>
> > నా నంబర్ తెలుసుకునే అవకాశం ఉందా??
>
> > On Apr 5, 2:27pm, Praveen Garlapati <praveengarlap...@gmail.com>
> > wrote:
> > > ఈ మధ్య నాకు కొద్దిగా తికమక గా ఉంది కొన్ని పదాలతో.
>
> > > రాసారు, చూసారు లాంటి పదాలలో మామూలు స వాడాలా లేక మెలికల శ నా ?
>
> > > నేను మామూలు స వాడతాను. కొన్ని బ్లాగులలో మెలికల శ వాడటం చూసాను.
>
> > > ఏది సరయినది ?
>
> --
> Sudhakar S | సుధాకర్

> iBlog @http://savvybytes.com


> తెలుగు :http://sodhana.blogspot.com

> photos :http://coolclicks.blogspot.com- Hide quoted text -
>
> - Show quoted text -

Kamesh

unread,
Apr 6, 2007, 3:38:30 AM4/6/07
to telug...@googlegroups.com
నా మటుకు రాసారు, చూసారు అనే ది మాత్రమే సరైనదని అనిపిస్తూంటుంది.  ఇకపోతే వేరు వేరు మాండలికాల్లో ఈ పదాలను పలికే పద్దతిలో తేడా ఉండొచ్చు. 
చూసారు - నాగేశ్వరరావు స్వరంలో చూశారు లా పలికితే
దీనినే రామారావు చూచాను, చూచారు అంటు పలుకుతూ ఉంటుంది.



On 4/6/07, టి.యల్.యస్.భాస్కర్ <tlsbh...@gmail.com> wrote:

అమ్మో...భాష గురుంచి చర్చ...

స, శ  ఇప్పుదు వాడకం లో ఉన్నాయి.

ఒకప్పుడు "చూచితిని" అని వాడారు కూడా (అంటే "చూసాను" అని అర్థం వస్తుంది.

భాస్కర్



> తెలుగు :http://sodhana.blogspot.com
> photos :http://coolclicks.blogspot.com- Hide quoted text -
>
> - Show quoted text -






--
కామేష్
అందమే ఆనందం .. ఆనందమే జీవిత మకరందం ...

http://chittellas.blogspot.com
http://kamesh.wordpress.com
నా ఆన్లైన్ రేడియో
http://kamesh.diinoweb.com/files/

మధు

unread,
Apr 6, 2007, 5:15:35 AM4/6/07
to తెలుగుబ్లాగు
మీరు చూచారు అనేది రామారావుగారి భాషగా, చూశారు అనేది నాగేశ్వరరావుగారి
భాషగా దయచేసి విడగొట్టకండి. ఎందుకంటే అన్నగారికి పౌరాణికం మీద ఉన్న
ప్రేమతో, ఆ భాషని వాడుతూ ఆనందించేవారు, గ్రాంధిక భాష ఐతే ఎవరూ
విమర్శించలేరు కూడా.

ఇక "స", "శ", "ష" గురించి చెప్పాలంటే
"శ" ని ఎప్పుడూ శారద లా పలికేట్టు, "స" ని సరదా లా పలికేట్టు, "ష" ని
షడ్రుచులు లా పలికేట్టు పలకాలి అని నేను చదువుకున్నప్పుడు చెప్పినట్టు
నాకు బాగా గుర్తు.

ఐతే, ఆయా పదాలను ఎలా పలుకుతారో మీ ఇష్టం. కాదు కష్టం అనుకుంటే, నాకేంటంట
నష్టం.

ఇది కోస్తా తెలుగో కాదో తెలీదు కానీ, నాకు తెలిసిన తెలుగు.

On Apr 6, 3:38 am, Kamesh <chitte...@gmail.com> wrote:
> నా మటుకు రాసారు, చూసారు అనే ది మాత్రమే సరైనదని అనిపిస్తూంటుంది. ఇకపోతే వేరు
> వేరు మాండలికాల్లో ఈ పదాలను పలికే పద్దతిలో తేడా ఉండొచ్చు.
> చూసారు - నాగేశ్వరరావు స్వరంలో చూశారు లా పలికితే
> దీనినే రామారావు చూచాను, చూచారు అంటు పలుకుతూ ఉంటుంది.
>

> > > iBlog @http://savvybytes.com


> > > తెలుగు :http://sodhana.blogspot.com

> > > photos :http://coolclicks.blogspot.com-Hide quoted text -


>
> > > - Show quoted text -
>
> --
> కామేష్
> అందమే ఆనందం .. ఆనందమే జీవిత మకరందం ...
>

> http://chittellas.blogspot.comhttp://kamesh.wordpress.com

Prasad Charasala

unread,
Apr 6, 2007, 8:39:47 AM4/6/07
to telug...@googlegroups.com

"రాసితిని" --> రాసాను అయిందనుకుంటా. అయితే వాడుకలో అచ్చంగా "రాసాను" లేదా "రాస్యాను" అని పలక్కుండా "cat"లో అచ్చులా పలుకుతున్నారు.
ఎక్కడో తప్ప వాడని "ఋ" "ఱ" "జ్ఞ" లకు అక్షరాలు కనుక్కున్న మన పండితులు పామరులు సదా వాడే ఈ శబ్దానికి అక్షరరూపం కనిపెట్టకపోవడం మన భాషలకు వెలితే.


--ప్రసాద్
http://blog.charasala.com

Kamesh

unread,
Apr 6, 2007, 9:19:59 AM4/6/07
to telug...@googlegroups.com
క్షమించాలి.  నా ఆలోచన ప్రకారం మాండలికం లో ఎలా పలుకబడుతోందో అని తెలియచెప్పడం కోసమే కాని, నాగేశ్వరరావు, రామారావు గార్లను విమర్శించడం కోసం కాదని గమనించ ప్రార్ధన.  ఇకపోతే స,శ,ష లను ఉపయోగించడం లో మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా.
అలాగే ప్రసాద్ గారి అభిప్రాయం కూడా ఏకీభవింపబడతగ్గదే.

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 6, 2007, 10:28:56 AM4/6/07
to telug...@googlegroups.com
"రాశాను" (మీ మీ పద్ధతుల్లో రాసాను, రాస్యాను, రాషాను) అనే పదంలో "ను" తీసేసి, "రాశా" అని పలికి, వెంటనే "శారద" అని పలికి చూడండి. నాకు మటుకు ఆ "శ", ఈ "శ" ఒకటేననిపిస్తుంది. తెలుగు వర్ణమాలలో మనకందుబాటులో ఉన్న అక్షరాలలో రా*ను, చూ*ను వంటివాటికి శ దగ్గరగా ధ్వనిస్తుంది నా ఉద్దేశంలో. ప్రసాద్‌గారన్నట్లు cat లో ని అచ్చులా ధ్వనించేవి మన లిపిలో లేవని, ఆ ధ్వనికి దగ్గరగా మనకు అందుబాటులో ఉన్న అక్షరం (హల్లు) శ ఒక్కటేనని అనిపిస్తుంది. రాశాను అన్నది నేను రాసే పద్ధతి. కాకపోతే, మాటలాడేటప్పుడు రాసినాను, రాసినాము, రాసినావా ఇట్లా పలుకుతాం రాయలసీమ పల్లెల్లో. జనబాహుళ్యం పల్లెల్లో మాట్లాడేంత స్వచ్చమైన తెలుగుభాష హైదరాబాదులోగానీ మరే ఇతర నగరంలోగానీ దొరకదనేది అందరూ అంగీరిస్తారనుకుంటాను. "రాసావా" లో ఉన్న 'సా' "సామజవర గమన" లోని చప్పిడి స. "చూషావా" లో ఉన్నది "షావుకారు"లోని కండబట్టిన (బలిసిన) ష. ఈ రెంటికీ నడుమనున్న నాజూకైన "శ"బ్దమును పలికి చూ"శా"రా? 'శా'రదమ్మ 'శాం'తించాలంటే ఇలాగే పలకాలంటాను నేను. ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉండుంటే ఈ శబ్దాలమధ్య తేడాను పలికి చూపేవాడిని. అప్పుడిక మీరు మీమీ పద్ధతులకు కట్టుబడటమో, కట్టుబాట్లు తెంచుకోని 'శా'శ్వతపరిష్కారం కనుగొనడమో జరిగేది.
 
మురారి సినిమా మీరందరూ చూసే ఉంటారు. అందులో కథానాయకుడు సరదాగా "జూదరత్న" అని సంబోధిస్తే "ల్యా, మానేశానబ్బాయ్" అంటాడా మనిషి. ఇందులోని ల్యా కూడా cat, mat, lap లలోని ల్యా. మావూరి భాషలో రాసేటప్పుడు మాటిమాటికీ నాకెదురయే సమస్య ఇది. అట్లాంటి యాస ఉన్న మాటలు నేను పెరిగిన ప్రాంతంలో కొల్లలు. కాని, వీటిని అక్షరబద్ధం చేయడం కోసం రాల్యా, పోల్యా అనాలో రాలా,పోలా అనాలో రాలే,పోలే అనాలో ... ఎలా రాస్తే ఆ మాండలికాన్ని పాఠకులకు చేరవేయగలనో నాకిప్పటికీ తికమకే.

 
--
http://yarnar.blogspot.com

త్రివిక్రమ్

unread,
Apr 6, 2007, 10:38:47 AM4/6/07
to telug...@googlegroups.com
On 4/6/07, Prasad Charasala <char...@gmail.com > wrote:

"రాసితిని" --> రాసాను అయిందనుకుంటా.

"వచ్చియున్నాడు" అనే మూలరూపం వ్యావహారికంలో "వచ్చినాడు"గా రూపాంతరం చెందిందని ఎక్కడో చదివాను. వచ్చినాడు అనే పదాన్ని ఇలా విడదీయొచ్చో లేదో నాకు తెలియదుగానీ సినారె "వచ్చాడన్నా, వచ్చిండన్నా వరాల తెలుగు మనదేనన్నా" అనడం విన్నప్పుడు దాన్నిబట్టి నాకిలా అనిపించింది (ఇది కేవలం నా ఊహ మాత్రమే. భాషాశాస్త్రం దీని గురించి ఏమంటుందో నాకు తెలియదు):

వచ్చి+న్+ఆడు = వచ్చినాడు
వచ్చి+న్+(ఆ)డు = వచ్చిండు
వచ్చి+(న్)+ఆడు = వచ్చాడు/వచ్చేడు?
 
అలాగే

రాసి+న్+ఆడు = రాసినాడు
రాసి+న్+(ఆ)డు=రాసిండు
రాసి+(న్)+ఆడు = రాశాడు ->రాసాడు/రాసేడు

ఎలా ఏర్పడినా అన్నీ ఒకేపదానికి వేర్వేరు రూపాలే. ఒక్కో కాలంలో/ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కటి కరెక్టు. నేను మాత్రం రాసేటప్పుడు "చూశాను", "చేశాను" అని రాస్తున్నాను. అది తప్పని చెప్తే సరిదిద్దుకుంటాను.
 

--
త్రివిక్రమ్
Life has no rewinds and forwards; it unfolds itself at its own pace.  

So never Miss a chance to Live today to make a Beautiful story for Tomorrow.

Murali Krishna Kunapareddy

unread,
Apr 6, 2007, 11:36:17 AM4/6/07
to telug...@googlegroups.com
ఓ రెండ్రోజుల నుండీ ఈ పోస్టును చూస్తున్నాను. శ - స లలో ఏది కరక్టో తెలియదు కానీ, నాకింకో సందేహం వచ్చింది.
 
౧) రామూను కారు రాసుకుంటూ వెళ్ళింది. కొంచెం అజాగ్రత్తగా వుంటే కారు క్రింద పడేవాడే.
౨) పత్రికలో రాము వ్రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చిందని ఎడిటర్ మెచ్చుకున్నాడు.
 
పై రెంటిలో సరైన వాక్య ప్రయోగమేది?
--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"

Kiran Kumar Chava

unread,
Apr 6, 2007, 11:47:05 AM4/6/07
to telug...@googlegroups.com
నాకు తెలిసీ రెండూ కరకట్టె

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 6, 2007, 12:24:00 PM4/6/07
to telug...@googlegroups.com
అవును రెండూ కరెష్టే. ;)

On 4/6/07, Kiran Kumar Chava <chava...@gmail.com> wrote:
> నాకు తెలిసీ రెండూ కరకట్టె
>
> >
>


--
http://yarnar.blogspot.com

త్రివిక్రమ్

unread,
Apr 6, 2007, 12:33:15 PM4/6/07
to telug...@googlegroups.com
అవును, రెండూ కరకట్టే!
 
writing ను తెలుగులో వ్రాత అనే వ్రాయాలి, పలకాలి. (నేను అలాగే వ్రాసేవాడిని.) ఐతే పలికేటప్పుడు రాత అంటామే గానీ ఎప్పుడూ వ్రాత అనం కాబట్టి ఇప్పుడు రాత అనే రాస్తున్నాను.(ఇంగ్లీషులోని తలతిక్క స్పెల్లింగుల్లా కాకుండా తెలుగులో వీలైనంతవరకు ఎలా పలుకుతామో అలాగే రాద్దామనే ఉద్దేశంతో).

ఇక రాసుకెళ్ళడంలోని మొదటి అక్షరం నిర్ద్వంద్వంగా రాయే. రాసుకెళ్ళేవాడు రాలుగాయే!

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 6, 2007, 12:46:52 PM4/6/07
to telug...@googlegroups.com
ఆ రాలుగాయి రాలేలోగా చేసే గాయాలెన్నో, తీసే ప్రాణాలెన్నో. (తొక్కలో కవిత) 
-- రానారె
http://yarnar.blogspot.com

Praveen Garlapati

unread,
Apr 6, 2007, 1:17:31 PM4/6/07
to telug...@googlegroups.com
ఆహా... నేనడిగిన ప్రశ్నకు ముక్తాయింపు రాలేదు మరి. "నా ఇష్టమొచ్చినట్టు" రా*/సె/*య్యనా మరయితే. :)


Ramanadha Reddy Yarrapu Reddy wrote:
> ఆ రాలుగాయి రాలేలోగా చేసే గాయాలెన్నో, తీసే ప్రాణాలెన్నో. (తొక్కలో కవిత)
>

> On 4/6/07, *త్రివిక్రమ్* <g.tri...@gmail.com

> <mailto:g.tri...@gmail.com>> wrote:
>
> అవును, రెండూ కరకట్టే!
>

> writing ను తెలుగులో *వ్రా*త అనే *వ్రా*యాలి, పలకాలి. (నేను అలాగే *వ్రా*సేవాడిని.) ఐతే


> పలికేటప్పుడు రాత అంటామే గానీ ఎప్పుడూ వ్రాత అనం కాబట్టి ఇప్పుడు రాత అనే
> రాస్తున్నాను.(ఇంగ్లీషులోని తలతిక్క స్పెల్లింగుల్లా కాకుండా తెలుగులో వీలైనంతవరకు ఎలా
> పలుకుతామో అలాగే రాద్దామనే ఉద్దేశంతో).
>

> ఇక *రా*సుకెళ్ళడంలోని మొదటి అక్షరం నిర్ద్వంద్వంగా *రా*యే. రాసుకెళ్ళేవాడు *రా*లుగాయే!
>

Prasad Charasala

unread,
Apr 6, 2007, 2:23:59 PM4/6/07
to telug...@googlegroups.com

ఎలానూ రాయలేవు రానారె. ఇప్పుడు మనకు ఒక ఆధారం దొరికిందిగా ఇంకేం మ్నం "సీమ" భాష తయారు చేసుకుందామా? :)
నేను "సామజవరగమనా" ఎప్పుడు విన్నా అది నాకు "తామజవరగమనా"లా వినిపించేది. అలానే పాడుకుంటుంటే మా ఆవిడ "ఛ అది తప్పు 'రామజవరగమనా' అని పాడాలి" అంది. హమ్మయ్య అయితే అది "సామజవరగమనా" అన్నమాట.

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 6, 2007, 3:34:36 PM4/6/07
to telug...@googlegroups.com

చిన్న సవరణ - త్రివిక్రమ్: "వచ్చాడన్నా, వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటేనన్నా" అని చదివినట్టు గుర్తు. కదూ?

Sriram

unread,
Apr 6, 2007, 3:43:20 PM4/6/07
to తెలుగుబ్లాగు
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81&searchhws=yes&display=utf8&table=brown

బ్రౌను నిఘంటువు ప్రకారం వ్రాసి అనేదే సరి ఐన పదం. అందుచేత రాసి,రాసాడు
అని వాడుకోవచ్చు అనుకుంటా. రాశి అనకూడదు.

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 6, 2007, 3:51:53 PM4/6/07
to telug...@googlegroups.com
హహ్హహ్హ!! భాషా ప్రయుక్తరాష్ట్రాలు వచ్చేసినాయ్. ఇక మాండలిక ప్రత్యేక ఉపరాష్ట్రాలకోసం ఉద్యమించొచ్చు. అప్పుడు కనీసం నాలుగు రాష్ట్రాలు తయారుచేయొచ్చు రాయలసీమ నుండి. దీన్నింతటితో వదిలేస్తే, ప్రసాదుగారూ, సామజము అంటే ఏనుగు. సామజ వర గమన - అంటే ఏనుగులాంటి నెమ్మదైన గంభీరమైన నడక గలవాడా/గలదానా అని అర్థం. ఏనుగును సామజమని ఎందుకంటారో, దాని వ్యుత్పత్తి ఏమిటో ఇలాంటి మాటలు మనం సాహిత్యం గుంపులో మాట్లాడాలేమో.

On 4/6/07, Prasad Charasala <char...@gmail.com> wrote:



--
http://yarnar.blogspot.com

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 6, 2007, 3:56:23 PM4/6/07
to telug...@googlegroups.com
వ్రాసి, రాసి సరే. ఇవి నిర్వివాదాలు. ఎటొచ్చీ రాశాను రాశాడు అనే దగ్గరే ఏకాభిప్రాయం లేదు. ఉండనవసరం లేదేమో!
రాసాడు అని రాస్తే, రాసింది రాసినట్టుగా పలికితే చప్పగా ఉంటుంది, రాశాడు అని పలకడం వింటుంటాం.
"రాశాడు" ఏ రకంగా తప్పో నన్ను ఒప్పించే వివరణకోసం చూస్తున్నాను. 

 
--
http://yarnar.blogspot.com

Tummala Sirish Kumar

unread,
Apr 7, 2007, 7:04:53 AM4/7/07
to telug...@googlegroups.com
bank ను తెలుగులో రాసేటపుడు ఉచ్చారణకు తగ్గ అక్షరం లేదు గాబట్టి  అతి దగ్గరగా ఉండేందుకు బ్యా అని వాడతాం. అలాగే స్యా కూడా, అంతేగానీ ఖచ్చితంగా ఉచ్చారణ అదే అని కాదు నా ఉద్దేశ్యం.

(అసలు "రాసాను" తెలుగు పదమే అయినప్పటికీ ఉచ్చారణకు తగ్గ అక్షరం లేకపోవడమేమిటీ అని ఆలోచిస్తే.. ఈ తీగలోనే పెద్దలు రాసినట్లు, రాసినాను, రాసియున్నాను.. వగైరా పదాలు, వాడుకలో నలిగి ఇలా రాసా, రాసాను అని అయి ఉండాలి అని అనిపిస్తోంది)

ఇకపోతే "రాసాను" అనే క్రియకు ఇతర రూపాలు చూస్తే రాసి, రాస్తూ, రాస్తాను, రాసేస్తాను.. ఈ పదాల్లో ఏ అక్షరం వస్తుందనే విషయంలో 'మెలికేమీ' లేదు.
కానీ "రాసాను" అనేమాట ఉచ్చారణకు తగ్గ అక్షరం లేదు కాబట్టి అతి దగ్గరి అక్షరాన్ని రాస్తున్నాం. కారం దగ్గరిదని కొందరంటున్నారు, కారమని కొందరు.

ఏది దగ్గర అనేదాన్ని పక్కన పెడితే, "రాసాను", "శారద" ల ఉచ్చారణ ఒకే రకంగా లేవు. అక్కినేని ఉచ్చారణలో "రాసాను", "శారద" ఒకేలా ఉంటాయనుకుంటాను. ఆ ప్రత్యేకత ఉంది గనుకే అక్కినేని ఉచ్చారణ గురించిన ప్రసక్తి వచ్చిందీ చర్చలో. ఆయన ఉచ్చారణ ప్రకారమయితే "రాసాను" తప్పు, "రాశాను" సరైనది.

చర్చ చాలా బాగుంది. "రాశిన" దాన్ని "చూశిన" కొద్దీ "రాసినదే" సరైనదని అనిపిస్తోంది.
-శిరీష్
Reply all
Reply to author
Forward
0 new messages