బాల్యవివాహాలు

17 views
Skip to first unread message

Ajit kumar

unread,
Mar 4, 2007, 11:20:56 AM3/4/07
to telug...@googlegroups.com
మితృలకు నమస్కారం,
    తెలుగులో ఉత్తరాలు రాసుకొనే / చదువుకొనే అవకాశం కలగడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది.ఇటీవలి కాలంలో బాల్యవివాహాలను నిరోధిస్తూ దాడులు జరుపుచున్న దృశ్యాలు
టివీలో చూసాను. నా దృష్టిలొ బాల బాలికలకు 8 సంవత్సరాల లోపుగానే వివాహం చేయడం మంచిది. నేటి సమాజంలోని అనేక రుగ్మతలకు అది సరైన పరిష్కారాని చూపుతుందని నా అభిప్రాయం. 
బాల్యవివాహాలు చేయడం అంటే మన సంస్కృతిని పునరుద్ధరించుకోవదమే

తుమ్మల శిరీష్ కుమార్

unread,
Mar 4, 2007, 12:14:41 PM3/4/07
to telug...@googlegroups.com
పిల్లలకు పెళ్ళిళ్ళా? మళ్ళీ వెనక్కా? ఈ గుంపులో వాతావరణం కాస్త ముసురు పట్టి, చురుకు తగ్గింది అని ఈ మధ్య జాబులొచ్చాయి. చిన్నపాటి అలజడి సృష్టించి గుంపును తిరిగి ఉత్తేజితం చెయ్యాలనే ప్రయత్నం కాదు గదా, ఇది!?
-శిరీష్

cbrao

unread,
Mar 4, 2007, 1:23:07 PM3/4/07
to telug...@googlegroups.com
 సతీ సహగమనం కూడా పునరుద్ధరించాలి.  ఇంకా కన్యా శుల్కం కూడా వస్తే ఈ వరకట్న సమస్య కు మంచి పరిష్కారం దొరకగలదు. మనుస్మృతి ని  కఠినముగా ఆచరించటానికి  కొన్ని కొత్త శాసనాలు కూడా తీసుకు రావాలి. ఆడవాళ్ళకు చాకలి పద్దులు రాసేంత వచ్చాక చదువు ఆపివేయాలి. రాజా రామమోహన్రాయ్, వీరేశలింగం  గురించిన పాఠాలు మన పిల్లల పుస్తకాలనుంచి తొలగించాలి. తాలిబన్లు, భారతీయులు భాయ్ భాయ్ అనే నినాదాలకు ప్రాచుర్యం కలిపించాలి. అంతే కాక విధవలకు ఉచిత క్షౌర సౌకర్యము కూడా ప్రభుత్వము వారే కలిపించాలి.ఇవన్నీ సక్రమంగా అమలు చేసినప్పుడే మన సంస్కృతిని పునరుద్ధరించు కున్న వాళ్ళమవుతామని నా అభిప్రాయం.  

సత్యసాయి కొవ్వలి

unread,
Mar 5, 2007, 2:26:54 AM3/5/07
to telugublog
నేను నా హడావిడిలో పడిపోయి పిల్లల పెళ్ళివయస్సు దాటబెట్టేసి మన
సంస్కృతికి ఘోర అపరాధం చేసాను. ప్రాయశ్చిత్తమేదైనా ఉందోలేదో?

కొవ్వలి

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 5, 2007, 3:19:02 AM3/5/07
to telugublog
చర్చ ప్రక్కదోవ పట్టినట్లుంది.(అయినా ఇలాంటి చర్చకి ఇది సరైన
వేదికేనా ?)కులవ్యవస్థతో సహా ఏ ఆచారమూ చెడ్డదీ కాదు. మంచిదీ కాదు.
మంచిచెడ్డలు మనుషుల్ని బట్టి వారి అవసరాల్ని బట్టి వారి దేశ కాల
పరిస్థితుల్ని బట్టి ఉంటాయి.తర్కానికి నిలబడని వాటిని సమాజమే కాలక్రమంలో
వదిలించుకుంటుంది. పాత ఆచారాలు పోతాయి. కొత్త ఆచారాలు రంగప్రవేశం
చేస్తాయి.

jyothi valaboju

unread,
Mar 5, 2007, 3:20:54 AM3/5/07
to telug...@googlegroups.com
 
పక్క దారి ఎదీ లేదండి. అందరూ సరదాగా చెప్తున్నారు అంతే.

Prasad Charasala

unread,
Mar 5, 2007, 9:25:22 AM3/5/07
to telug...@googlegroups.com
బాల్య వివాహాలకూ, బాల విధవధలకే నా వోటూ!
బాల్య వివాహాల వల్ల లాభాలు.
1)ఆడపిల్ల తండ్రి ఆడపిల్లను త్వరగా వదిలించుకోవచ్చు. చదువు, సంద్యా లాంటి బాదర బందీ నుంచీ తప్పించుకోవచ్చు.
2)పిల్లవాడి తండ్రికి వరకట్నమేదో ముందే వచ్చేస్తుంది. యుక్త వయస్సు వచ్చేవరకు ఆగడమంటే ముందే వస్తున్న నిధిని కాలదన్నుకోవడమే!
3)ఇంకా ఏమున్నాయబ్బా!
--ప్రసాద్
http://blog.charasala.com

bhaskar

unread,
Mar 5, 2007, 11:03:30 AM3/5/07
to telugublog
అయ్యా!!
మంచి చర్చ లేవనెత్తారు.

On Mar 4, 11:20 am, "Ajit kumar" <vak...@gmail.com> wrote:
> మితృలకు నమస్కారం,
>     తెలుగులో ఉత్తరాలు రాసుకొనే / చదువుకొనే అవకాశం కలగడం నాకు ఎంతో సంతోషం
> కలిగిస్తుంది.ఇటీవలి కాలంలో బాల్యవివాహాలను నిరోధిస్తూ దాడులు జరుపుచున్న
> దృశ్యాలు
> టివీలో చూసాను. నా దృష్టిలొ బాల బాలికలకు 8 సంవత్సరాల లోపుగానే వివాహం చేయడం
> మంచిది.

యెలా మంచిది?

> నేటి సమాజంలోని అనేక రుగ్మతలకు అది సరైన పరిష్కారాని చూపుతుందని నా
> అభిప్రాయం.

బాల్య వివాహాలు సామాజిక ఋగ్మతలకి యెలా పరిష్కారం చూపగలదు?


> బాల్యవివాహాలు చేయడం అంటే మన సంస్కృతిని పునరుద్ధరించుకోవదమే

ఇంకొంత స్పష్టంగా రాస్తే బాగుంటుంది.

-భాస్కర్

jyothi valaboju

unread,
Mar 5, 2007, 11:11:07 AM3/5/07
to telug...@googlegroups.com
ప్రసాద్‌గారు  మీకూ ఆడపిల్ల మగపిల్లాడు ఉన్నారు.ఎటువైపు లాభమో ఆలోచించండి.కోడలిని తొందరగా తెచ్చుకుంటే ఖర్చు పెరుగుతుంది మరి.

Sudhakar S

unread,
Mar 5, 2007, 1:01:01 PM3/5/07
to telug...@googlegroups.com
అసలు ఈ చర్చ అంతా అయోమయంగా వుంది. నిజమా లేదా కామెడీనో అర్ధం కావటం లేదు. ప్రభుత్వం మన గుంపును అతివాద గుంపు క్రింద జమ చెయ్యదు గదా? :-)
 
-సుధాకర్

 
On 3/5/07, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:
ప్రసాద్‌గారు  మీకూ ఆడపిల్ల మగపిల్లాడు ఉన్నారు.ఎటువైపు లాభమో ఆలోచించండి.కోడలిని తొందరగా తెచ్చుకుంటే ఖర్చు పెరుగుతుంది మరి.





--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Prasad Charasala

unread,
Mar 5, 2007, 1:29:10 PM3/5/07
to telug...@googlegroups.com
బ్లాగరుల గుంపున్నాక అతివాదులూ, మితవాదులూ, మధ్యేవాదులూ అందరూ వుంటారు సుమా!

శ్రీనివాస

unread,
Mar 5, 2007, 1:38:41 PM3/5/07
to telugublog
అజిత్ కుమార్ గారూ, మీ ఆలోచనా పుత్రికని ఏదో ఓ బ్లాగుకి కట్టబెట్టేసి ఆ
దంపతుల చిరునామా (అంటే బ్లాగు url) ఇక్కడ పోస్ట్ చేస్తే మీ గుండెల మీద
కుంపటి చల్లరిపోవచ్చేమో ప్రయత్నించండి :-)

-శ్రీనివాసరాజు దాట్ల

cbrao

unread,
Mar 5, 2007, 2:14:50 PM3/5/07
to telug...@googlegroups.com
గంభీరంగా ఉన్న గుంపును అజిత్ కుమార్ చక్కగా నవ్వించ గలిగారు. మిగతా చర్చ అంతా జ్యొతి గారు చెప్పినట్లు just for kidding. Take it light,easy and enjoy.  అజిత్- నవ్వులు పువ్వులయ్యె మీ బ్లాగు కోసం ఎదురు చూస్తాము. 

On 3/6/07, శ్రీనివాస <srinivasa...@gmail.com> wrote:
అజిత్ కుమార్ గారూ, మీ ఆలోచనా పుత్రికని ఏదో ఓ బ్లాగుకి కట్టబెట్టేసి ఆ
దంపతుల చిరునామా (అంటే బ్లాగు  url) ఇక్కడ పోస్ట్ చేస్తే మీ గుండెల మీద
కుంపటి చల్లరిపోవచ్చేమో ప్రయత్నించండి :-)

-శ్రీనివాసరాజు దాట్ల

Ajit kumar

unread,
Mar 6, 2007, 1:32:49 PM3/6/07
to telug...@googlegroups.com
బాల్యవివాహాల గురించి నేను హాస్యానికో, కాలక్షేపానికో చెప్పలేదు.
దయచేసి మానవ అవసరాలు పరిశీలించండి.
ఉదాహరణకు మన ఆహార అవసరాల క్రమాన్ని గమనించండి.
శాస్త్రీయ దృష్టితో పరిశీలించినప్పుడు తల్లిపాలు ఓ సంవత్సరంపాటు
ఆతర్వాత క్రమేపీ ఘనాహారం జోడిస్తాం. అంతేగాని 18 సం!! వచ్చేదాకా తల్లిపాలే/పోతపాలే కొనసాగించలేం . పాలతో 18 సం!! వచ్చేదాకా బ్రతకవచ్చేమో ఊహించండి . బహుశా బలహీనంగా వుంటాం. నేడు అన్ని రకాల ఆహారపదార్ధాలు అందుబాటులోవున్నా ఆర్ధికస్థితి సరిగాలేనివారు పౌష్టికాహారం తీసుకుంటున్నామోలేదో తెలీని స్థితిలో తక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారు , ఎక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారు , కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని గిట్టవంటూ నిషేధించుకునేవారు  ఇలా అనేకరకాలుగా వుంటున్నారు .ఒక్కవిషయం గమనించండి . పౌస్టికాహారం లేకున్నా బ్రతుకు బండిని లాగుతునావారెందరో నేడున్నారు.
                    అలాగే వస్త్రాల అండ తగినంత లేకున్నా 18 సం!! వయసు వచ్చే వరకు ఆగి, ఆతర్వాత అప్పుడే బట్టలు చరించుదామా వద్దా అంటూ ఆలోచిస్తున్నామా? లేదు.బట్టలు ధరించాల్సినంత తప్పని స్తితి లేని పసివారికి కూడా భారి స్థాయి  లో చక్కని దుస్తులతో అలంకరిస్తున్నాం.
   శాస్త్రీయ దృష్టితో చూస్తే 18 సం!! నిండిన వారికి పుట్టుకొచ్చే క్రొత్త అవసరాలు అంటూ ఏమీ వుండవు. అమ్మాయి కనలేదని ,ఆరోగ్య సమస్యలు వస్తాయని , నీళ్ళలొ చేపకు జలుబు చేస్తుందేమో, అన్నట్లు ఏవేవో అశాస్త్రీయ భయాలకు లోనవుతారు. ఆవయసులో వాళ్ళేం చేసుకుంటారు? ఓ 30, 35 సం!! వచ్చిన తరువాత ఐతే ... అని అనుకుంటాం. వాళ్ళేంచేసుకుంటారొ అది వారి యిష్టం. వారికి ఆవయసునుండే ఆపొసిట్ సెక్స్ తోడు కల్పించలేకపోవడం మన లోపం. నిజానికి 20 సం!! దాటిన తర్వాత తల్లులయ్యే వారిలో ఎక్కువమందికి కనీసం సిజేరియన్ చేయాల్సివస్తుంది.                   
                            మన పూర్వీకులు "ఈ"విషయమై బాగా ఆలోచించే దేవాలయలపై అది తెలియజేసారు. నాటి పరిస్థితులు వేరు. నాడు విధవలైనవారికి పునర్వివాహావకాసాలు లేకుండుట, సమానవయస్కులకు వివాహం జరపకపోవడం వంటి లోపాలవల్ల నాడది ఖండనార్హమైనది. నేటి నాగరీక ధోరణులకు 'ఇది" చెంపపెట్టు కాగలదు. కళ పేరుతో నేడు చెలామణీ అవుతున్న వ్యభిచారాధారిత పరిశ్రమలైన సినిమా,టీవీ లకు, మద్యపానది క్లబ్బుల వ్యాపారములకు ఆటంకము కలుగవచ్చు.పాపం కదా! మరి లోకం మారితే యవరేంచేయగలరు?          

 

sudhakar valluri

unread,
Mar 7, 2007, 12:02:23 PM3/7/07
to telug...@googlegroups.com
మీ వాదం ఆసక్తికరంగా ఉన్నా, నేటి నాగరిక సభ్యసమాజం హర్షించదు . మరేదైనా మంచి విషయంతో వాదోపవాదాలకు సమాయుత్తమవటం మంచిది. ఏమంటారు మిత్రులారా? 
--
Sudhakar    
vskar08gmail.com

cbrao

unread,
Mar 7, 2007, 10:56:58 PM3/7/07
to telug...@googlegroups.com

అవును. ఈ సమస్య పై ఇక్కడ చాల కాలం గడిపాము. ఈ చర్చను అజిత్ తన బ్లాగులో కొన సాగించాలి. బ్లాగు విషయంలో సాంకేతిక సహాయం కోసం అజిత్ ఇక్కడకు జాబు రాయవచ్చు. 

Ajit kumar

unread,
Mar 8, 2007, 3:51:02 AM3/8/07
to telug...@googlegroups.com
Sir,
       It is not possible to enter in to my blog which i criated before.It is saying the user name is not found.Lakhini also not working .Is there any another site to type the Telugu text?

 

Veeven (వీవెన్)

unread,
Mar 8, 2007, 4:04:12 AM3/8/07
to telug...@googlegroups.com
On 3/8/07, Ajit kumar <vak...@gmail.com> wrote:
> Sir,
> It is not possible to enter in to my blog which i criated before.It
కొత్త బ్లాగు మొదలెట్టండి.

> is saying the user name is not found.Lakhini also not working .Is there any
lekhini.org పనిచేస్తుంది. మీరే టైములో చూసారు?

> another site to type the Telugu text?
మీరు quillpad.com ని కూడా వాడవచ్చు.

Ajit kumar

unread,
Mar 8, 2007, 4:34:13 AM3/8/07
to telug...@googlegroups.com

Sir,
      See the attachment photo of lekhini in html script mode.
 
lekhini.png

Veeven (వీవెన్)

unread,
Mar 8, 2007, 5:02:10 AM3/8/07
to telug...@googlegroups.com
On 3/8/07, Ajit kumar <vak...@gmail.com> wrote:
>
> Sir,
> See the attachment photo of lekhini in html script mode.
For me it is opening fine in IE6. Is yours IE7? Did you try in Firefox?

ఇంకెవరైనా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారా?


>
> On 3/8/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> >
> > On 3/8/07, Ajit kumar <vak...@gmail.com> wrote:
> > > Sir,
> > > It is not possible to enter in to my blog which i criated
> before.It
> > కొత్త బ్లాగు మొదలెట్టండి.
> > > is saying the user name is not found.Lakhini also not working .Is there
> any
> > lekhini.org పనిచేస్తుంది. మీరే టైములో చూసారు?
> > > another site to type the Telugu text?
> > మీరు quillpad.com ని కూడా వాడవచ్చు.
> >
> > > >
> >
>
>


--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

venkata ramana

unread,
Mar 8, 2007, 5:16:22 AM3/8/07
to telug...@googlegroups.com
On 3/8/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
On 3/8/07, Ajit kumar <vak...@gmail.com> wrote:
>
> Sir,
>       See the attachment photo of lekhini in html script mode.
For me it is opening fine in IE6. Is yours IE7? Did you try in Firefox?

ఇంకెవరైనా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారా?
 
నా IE7 లో బాగానే కనిపిస్తోంది. అజిత్‌గారు, మీ బ్రౌజరును refresh చేసి చూశారా?

--
రమణ
http://uvramana.wordpress.com

cbrao

unread,
Mar 8, 2007, 6:44:55 AM3/8/07
to telug...@googlegroups.com
Lekhini is working in Firefox.

Prasad Charasala

unread,
Mar 8, 2007, 7:50:41 AM3/8/07
to telug...@googlegroups.com

నాకెప్పుడూ ఇలాంటి సమస్య రాలేదే? మరి మీరు ఈ బాల్య వివాహాల మీద తెలుగును దేనిని వుపయోగించి రాశారు?
దాన్నే కొత్త బ్లాగు సృష్టించి రాయండి.

తుమ్మల శిరీష్ కుమార్

unread,
Mar 8, 2007, 8:00:55 AM3/8/07
to telug...@googlegroups.com
బహుశా అజిత్ గారి బ్లాగు బ్లాగుస్పాటులోది అయి ఉంటుంది. ఈమధ్య బ్లాగుస్పాటు వాడు అప్‌గ్రేడు చేసాడు కదా, అంచేత ఆయన పాత ఐడీ పని చెయ్యడంలేదేమో! తన గూగుల్ ఐడీతో లాగిన్ అవమంటోందేమో!
ఇక తెలుగు కనపడకపోయే విషయం.. తెలుగు పట్టీలోనూ, విండో టైటిలు దగ్గరా ఉన్న డబ్బాలు చూస్తుంటే అజిత్ గారు కంప్యూటరుకు తెలుగు అంతగా నేర్పినట్లు లేరు.
ఇక బ్రౌజరు ఖాళీ పేజీ చూపెట్టి, ఏదో ఒక లింకు చూపించి తెల్లమొహం వెయ్యడం చూస్తే.. సమస్య తెలుగుది, లేఖినిదీ కాదేమో ననిపిస్తోంది. ఏదేమైనా విషయజ్ఞులు వివరించాల్సిందే!

-శిరీష్

venkata ramana

unread,
Mar 8, 2007, 8:14:40 AM3/8/07
to telug...@googlegroups.com
అజిత్‌గారు,
మీరు http://telugublog.blogspot.com/2006/03/xp.html లోని మొదటి మూడు సోపానాలు పాటించినట్లయితే, మీ తెలుగు పట్టీలో కూడా తెలుగు బాగా కనిపిస్తుంది. ఈలంకెలోని అన్ని సోపానాలు పాటించినట్లయితే లేఖిని లేదా మరే ఇతర వెబ్సైట్లు వాడనవసరంలేకుండానే తెలుగులో టైపుచేసుకోవచ్చు.
 
-రమణ
 
--
రమణ
http://uvramana.wordpress.com
Reply all
Reply to author
Forward
0 new messages