వికీపీడియా వ్యాసాల విషయంలో భారతీయ భాషలన్నిటిలోకీ తెలుగు ముందున్న సంగతి మనకు తెలిసిందే! సాఫ్టువేరు అప్లికేషన్ల స్థానికీకరణల విషయంలో కూడా భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు ముందంజలో ఉన్నట్టుగా అనేక చోట్ల చూస్తూ ఉంటాం. మనం ఆ స్థాయికి చేరేందుకుగాను శ్రమపడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుదాం.
స్థానికీకరణ అనుకోగానే వీవెన్ గుర్తుకు రావడం సహజం. వికీపీడియా సాఫ్టువేరు స్థానికీకరణలో కూడా వీవెన్ చాలా కృష్జి చేసారు.
ఇక్కడ చూడండి.
మనందరం కూడా ఈ పనుల్లో చురుగ్గా పాలుపంచుకోవాల్సి ఉంది. అందరం తలో చెయ్యీ వేస్తే అలాంటివి పూర్తి చెయ్యడం పెద్ద లెక్కలోని విషయం కాదు. ప్రయత్నిద్దాం రండి !
-చదువరి
--
http://chaduvari.blogspot.com