ఇది అరికట్టటం ఎలా?

15 views
Skip to first unread message

Malini

unread,
Apr 18, 2007, 12:58:06 AM4/18/07
to తెలుగుబ్లాగు
Haste decision by Mr.Maganti or was it thoughtful decision about
copyright of his content. What ever it is - I donot agree with it.

May he become my enemy by saying this, but I am inclined to say that
it's a not a wise decision. Some team members responded saying that
creative commons is one way to stop the copyright violation and what I
gathered from most other answers is copy is not a crime, but not
giving proper credit is a crime. I would take a stand on the first
part of creative commons licenses, but not on the second suggestion of
proper credit. Proper credit is like

దొంగతనం చేసాము కానీ - నేను ఒప్పుకుంటున్నాను కదా ఫలానా వారింట్లోనుంచి
దొంగతనం చేసాను, కాబట్టి దొంగతనం అనేది తప్పు కాదు అని అన్నట్టుగా ఉంది.
తీరిగ్గా కూర్చుని కొంచెం ఆలోచించిన తరువాత భలే బుడుగు గారు
చెప్పినదానిలో చాలా మటుకు తప్పు లేదు అని అనిపించింది.సుబ్రహ్మణ్యంగారో
ఎవరో అన్నారు నన్నయ, తిక్కన కాపీరైట్లు పెట్టుకున్నారా అని - కానీ ఆ
కాలంలో మనుషులకి కొన్ని మానవతా విలువలు ఉన్నాయండి - దొంగతనాలు అసలు
ఉండేవి కాదు, పైగా దొంగతనం మహా పాపం అని భావించే రోజుల్లో పుట్టారు ఆ
మహానుభావులు.అందుకే వారు మాణిక్యాలుగా మిగిలిపోయారు. ఈ కాలంలో దొంగతనం
చేయకపోతే పాపంగా భావించేవాళ్ళు కోకొల్లలు. అదే జనావళికి సమ్మతం అని
బలవంతంగా రుద్దే ప్రయత్నం కూడా చేస్తుంటారు కొంతమంది. అది చాల తప్పు
అండి.కానీ మొన్న నేను ఆవెశంలో ఆ సమయానికి నచ్చింది అని సుబ్రహ్మణ్యం గారి
అదే టపాకి సమాధనం రాసాను. అది ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాను.

ఇది కలియుగం కాబట్టి ఇలాగే ఉంటుంది అని ఒక పెద్దాయన ఎవడో జోకాడు. ఆయన
మొహం మీద ఉమ్మేయాలనిపించింది. పెద్దవాడిగా ఉండి పిల్లలకు నీతి
చెప్పకపోగా , ఫర్వాలేదులే నీ దొంగతనం నువ్వు చెయ్యి , చేస్తూనే ఉండు -
కొంతకాలానికి అదే రాజుగారి శాసనం అవుతుంది అని చెపుతున్నాడు ఆయన.
సిగ్గుండాలి మనిషికి.

సుధాకర్ గారూ - మీరన్నది నిజమే ఇంటర్నెట్టులో తెలుగు వ్యాప్తికి ఎంత
ఎక్కువ సమాచారం ఉంటే అంత మంచిది. కానీ కొత్త సంపదని తీసుకుని రావటానికి
ప్రయత్నం చెయ్యాలి కానీ , ఉన్న వాటినే తిప్పి తిప్పి అన్ని చొట్ల కాపీ
చేసిపెడితే ఉపయోగం ఏమిటి అండి.

ఈ కాలంలో దొరుకుతున్న కన్వర్టర్లతో,ఇలా వెబ్ సైటులు పెట్టుకున్నవారు అంతా
ఎన్నో సంవత్సరాలు కష్టపడి సేకరించిన సంపదని రెండు నిముషాలలో యూనీకోడులోకి
మార్చి పడేసి తమవిగా ప్రచురించుకోవటం అతి హేయమయిన పని అని నేను కూడా
భావిస్తున్నాను.

ఎవరు అంగీకరించకపోయినా ఫరవాలేదు. నా ఉద్దేశ్యం నేను చెప్పెశాను. కానీ
ఒక్క విషయం - వంశీగారు కానీ మిగిలిన వెబ్ సైటు మాష్టార్లు కానీ వేరే ఎవరు
కానీ కాపీరైటు గురించి తప్పనిసరిగా ఆలొచించి కొంచెం ఆ దిశగా తమ ప్రయత్నం
మొదలు పెడతారు అని ఆశిస్తూన్నాను.

ఆయనది విశాల హృదయమే కావచ్చు, లేదా ఇవి ఎలాగూ అరికట్టలేము -పోనిలే అనే
అసహాయత అన్నా కావచ్చు - కానీ ఇలాంటి చోరీలు అరికట్టకపోతే ముందు ముందు
పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది అని మటుకు ఖచ్చితంగా చెప్పగలను.

ఈ ఇంటర్నెట్టు చోరీలు, సాహితీ దొంగతనాలు అరికట్టటానికి అందరము సాయాం
చేస్తారు అని నా విశ్వాసం.

KASYAP కశ్యప్

unread,
Apr 18, 2007, 1:15:42 AM4/18/07
to telug...@googlegroups.com
అయ్యో ! ఈ గుంపులో ఇలాంటివి చదవలసివస్తుదని వూహించలేదు :(, ఇతరుల అభిప్రాయాలను పరిగణించకుండా వ్యక్తి గత ఉద్దేశ్యం చెప్పటాని ఇది సరిఅయిన వేదిక కాదేమో! ఆలోచించండి. సయమనంపాటించ వలసినదిగా మనవి .
మీశ్రేయోబిలాషి
కశ్యప్

Malini

unread,
Apr 18, 2007, 1:22:35 AM4/18/07
to తెలుగుబ్లాగు
లేదు కశ్యప్ గారూ

నేను బాగా ఆలోచించిన తరువాతే ఈ టపా రాసాను. కొందరు ఆడవారు కూడా నా పాత
టపాకి ఆవేశపడి సమాధానం రాసారు. అలాంటప్పుడు వెయ్యని ఈ ప్రశ్న ఇప్పుడు
వస్తుంది అని నేను అనుకోలేదు. అందుకని చొరవ తీసుకుని ఈ గుంపు లో ఉన్న
జనాలు మన, నా కుటుంబ సభ్యులు అనే ఉద్దేశ్యం తో రాసాను కానీ వేరే యే
ఉద్దేశ్యం లేదు.

దీనికి ఎవరయిన బాధ పడితే దానికి నేనేం చెయ్యలేను.గుంపులోనుంచి
వెళ్ళగొడతారో ఏమో అన్న భయం కూడా నాకు లెదు. అంతా ఇక వివేకం గల మన
పెద్దవారి చేతుల్లో ...

On Apr 17, 10:15 pm, "KASYAP కశ్యప్" <kasya...@gmail.com> wrote:
> అయ్యో ! ఈ గుంపులో ఇలాంటివి చదవలసివస్తుదని వూహించలేదు :(, ఇతరుల అభిప్రాయాలను
> పరిగణించకుండా వ్యక్తి గత ఉద్దేశ్యం చెప్పటాని ఇది సరిఅయిన వేదిక కాదేమో!
> ఆలోచించండి. సయమనంపాటించ వలసినదిగా మనవి .
> మీశ్రేయోబిలాషి
> కశ్యప్
>

> --
> కశ్యప్
> KASYAP,- Hide quoted text -
>
> - Show quoted text -

Kiran Kumar Chava

unread,
Apr 18, 2007, 1:23:27 AM4/18/07
to telug...@googlegroups.com
Malini has all the rights to send her opinions to this group about this topic.
 
I will try to reply to this by evening.
 
Busy now
--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

Kiran Kumar Chava

unread,
Apr 18, 2007, 1:26:42 AM4/18/07
to telug...@googlegroups.com

ఈ గుంపులోనుండి ఇంత వరకూ ఎవరినీ వెళ్ళగొట్టలేదు స్పామర్లను తప్ప.

అసలు ఆ ఆలోచనే ఎవరికీ లేదనుకుంటాను.

అసలు ఆ రూలు కూడా లేదు, అమన అలిఖిత తెలుగు బ్లాగు రాజ్యాంగంలో :)

ఇదేమీ సాధారణ గ్రూపు కాదు కదా, we are something different

KASYAP కశ్యప్

unread,
Apr 18, 2007, 2:00:20 AM4/18/07
to telug...@googlegroups.com

మాలిని గారు, నేను మిమ్మల ని మాత్రమే ఉద్దేసించి అనలేదు నొపిస్తే క్షమించండి , అసలు పాత ధారలోనే నెను సయమనంపాటించ వలసినదిగా విన్నవించాలిసినది . నేను కూడా ఈ గుంపు లో ఉన్న
జనాలు మన, నా కుటుంబ సభ్యులు అనే ఉద్దేశ్యం తో మాత్రమే రాసాను :(

మీశ్రేయోబిలాషి
కశ్యప్



--
కశ్యప్
KASYAP,

Prasad Charasala

unread,
Apr 18, 2007, 8:32:59 AM4/18/07
to telug...@googlegroups.com

మాలిని గారూ,

ఇంత వరకు ఈ విషయం మీద నేను మౌనంగా వున్నాను. కొన్ని అభిప్రాయాలు చదవలేదు కూడా! తీరా వంశీగారు కలగజేసుకొని తన అభిప్రాయం చెప్పాక అనిపించింది ఈ విషయం భలే సీరియస్ అయిపోయిందే అని. తీరా ఇప్పుడు మీ ఆవేశం (ఆక్రోశమా) చూస్తుంటే నా అభిప్రాయం కూడా చెబుదామనిపించింది.
మొదటిది మీరు మాగంటి అభిప్రాయాన్ని అంగీకరించడం లేదు. ఆ అభిప్రాయం తో మీకు శతృత్వం వుందేమొ గానీ మాగంటితో కాదు కదా?
Copyright violation అనేది ఇంత సులభంగా తెగే వ్యవహారం కాదు. పేటెంట్ హక్కుల విశయంలో జరుగుతున్న రచ్చ చూస్తున్నారుగా! అలాగే Free Software ఉద్యమమూ చూసుంటారు. అతి ఎక్కువమందికి వుపయోగపడాలనేది కొందరి అభిమతమైతే, వుపయోగించుకున్న ప్రతి ఒక్కరి నుంచీ రుసుము పొందాలనేది ఇంకొందరి అభిమతం. ఏదేమైనా మాగంటి అభిప్రాయం మొదటిదని నా అభిప్రాయం. తను సంపాదించిన సమాచారాన్ని ఇతరులు ఎలా వుపయోగించుకోవాలి అనేది పూర్తిగా అతని ఇష్టం. ఇందులో మన జోక్యం వుండాల్సిన అవసరం లేదు. కొందరు ఎలా కాఫీ చేసుకున్నా అభ్యంతరం లేదు అందాల్సింది అందరికీ అందిందా లేదా అనేది చూస్తే ఇంకొందరు కనీసం తమకు దాని గొప్పదనం ఆపాదిస్తే చాలు అంటారు. ఇంకొందరు ఎట్టి పరిస్థితుల్లో తమ సమాచారాన్ని వాడకూడదు అంటారు. ప్రతి ఒక్కరికీ తమ స్వంత అభిప్రాయాలుండటానికి హక్కు వుంది.
అసలు ఇంటర్నెట్ మీద వున్న సమాచారాన్ని వాడుకోవడాన్ని దొంగతనంతో పోల్చలేం. దొంగతనం చేస్తే ఆ వస్తువు దొంగ వశమైపోతుంది, ఇక దానిమీద అసలు యజమానికి ఎటువంటి అధికారమూ వుండదు. కానీ ఇంటర్నెట్ అనేది అలా కాదు కదా! ఎంతమంది మాగంటి దగ్గరనుండీ గుంజినా అదింకా అక్కడ అలానే వుంటుంది. దీన్ని దేనితో పోల్చవచ్చంటే దీపంతో! మాగంటి దగ్గర వున్న దీపంతో ఎవరెన్ని దీపాలు వెలిగించినా మాగంటి దీపం ఇచ్చే వెలుగులో మార్పు రాదు. అయితే ఇంకో దీపాన్ని వెలిగించుకొనే వెసులుబాటు ఇవ్వడమా అలాగాక అందరూ తన దీపం వెలుగులోనే కూర్చోవాలనడమా అనేది వాళ్ళ వాళ్ళ విజ్ఞత మీద ఆధారపడివుంది. అలాగే దీపం వెలిగించుకున్నతను తను దీపం ఎవరి చలవవల్ల, సహాయం వల్ల వెలిగించుకున్నాడో చెప్పడమూ చెప్పకపోవడమూ వెలిగించుకున్నతని విజ్ఞత మీద ఆధారపడుతుంది. మన దీపం సహాయంతో ఇంకొకడు దీపం వెలిగించుకుంటే ఎలా అది దొంగతనమవదో ఇదీ అలాగే దొంగతనమవదు. (చివరికి దీపం వెలగాడినికి అవసరమైన నిప్పును ఎవరో ఎప్పుడో కనిపెట్టారన్నది వేరే విశయం)
మొహం మీద వుమ్మడం లాంటివి మీ గౌరవానికి తగినవి కాదని నా నమ్మకం. కలియుగమైనా, ఏ యుగమైనా ప్రాధమిక ధర్మాలలో మార్పుండదు. ఇలాంటి ఇంట్ర్‌నెట్ గుంపుల్లో ప్రపంచంలో వున్నన్ని రకాల మనుషులూ వుంటారు. ఒక విశయాన్ని ఒకరు సీరియస్‌గా తీసుకుంటే ఇంకొకరు దాన్ని చిన్న విశయంగా తీసుకుంటారు. ఉచితంగా మా సర్వర్‌లో దాచుకోండి, వుచితంగా మా మెయిల్ సిస్టం వాడుకోండి, వుచితంగా మా సాఫ్ట్‌వేర్ వాడుకోండి, వుచితంగా ఫోన్ చేసుకోండి, వుచితంగా మా ప్రోగ్రాం చూడండి, వుచితంగా మా దగ్గర మీ బ్లాగులు రాసుకోండి,వుచితంగా..., వుచితంగా...,...,... అంటున్న ఈరోజుల్లో వుచితంగా కాపీ చేసుకోవడం అనే అర్థంలో ఆయన కలియుగం అనే పదం వాడి వుంటాడు. అందుకే మీరంత భేజారయిపోతే ఎలాగండి?
కొత్త సంపదనీ సృష్టించాలి అలాగే వున్న సంపదనీ అందరికీ అందుబాటులోకి తేవాలి. ఒక్క మాగంటి గారే అందరికీ పంచలేకపోవచ్చు. ఆ పని ఇతరులు చేస్తున్నారు. ఒక రామాయణాన్నే తీసుకోండి. వాల్మీకి రాసిందాన్నే ఎంత మంది తిరిగి తిరిగి రాశారో! ఇంతమంది రాయడానికి ఆ కథమీద భక్తి కొందరికి కారణమైతే అది ఇచ్చే నీతి సర్వవ్యాపితం కావాలనేది ఇంకొందరికి కారణమయ్యుండవచ్చు. ఇక్కడ మాగంటి లక్ష్యాన్నే కాపీ చేసిన వారూ నెరవేరుస్తుంటే మాగంటికి కావల్సిందదే కదా!
ఎన్నో సంవత్సరాలు వాళ్ళు పడిన శ్రమను చూసి మీరు ఇంతగా స్పందిస్తున్నారు. నిజమే ఇంతమంది ఆయన దగ్గరనుండీ కాపీ చేసుకుంటాన్నారంటే ఆయనకెంత గర్వంగా వూండాలి!
ఎవరు సంపాదించిన, కూడగట్టిన సమాచార, సాహితీ సంపదను ఎవరికి ఎలా అందుబాటులో వుంచాలన్నది వారివారి స్వవిషయం. ఇందులో బయటివారు చేయగలిగిందేమీ లేదు. ఇలాంటి చోరీల వల్ల (చోరీ అని నేనలేకున్నా) ముందుముందు ఎటువంటి వుపద్రవాలొస్తాయొ మీరు కొంచం వివరించి వుంటే బాగుండేది. మహా అంటే ఏం జరుగుతుంది repitation (పునరుక్తి) జరుగుతుంది. ఒకే విషయం ప్రతిచోటా వుండి అందరికీ అందుబాటులో వుంటుంది. దానికి మాగంటి సంతోషిస్తారు. ప్రతి చోటా ఇదే సరుకు చూసి విసుగు చెందినవారు కొత్త దాని కోసం పెంపర్లాడతారు. అది ఎవరు సృష్టిస్తారో వాళ్ళు అందరి మన్ననలూ అందుకుంటారు. ఇంతకుమించిన వుపద్రవాన్ని నేను వూహించలేకున్నాను.

ఇదిగో ఇప్పుడు మీరు రాసిన టపా దానికి నేను రాసిన సమాధానం అలాగే ఇంకెందరో చేస్తున్న వాదనలు ఇక్కడే కాదు RSS రూపంలో ఎక్కెడెక్కడో కాపీ అయిపోతూ వున్నాయి. నా దగ్గర తాజాతాజా సమాచారం వుంది అందుకోండహో (వుచితంగా) అంటూ ప్రతిఒక్కరూ RSS, podcost లాంటి రూపంలో అందించడానికి పోటీ పడుతుంటే నా సమాచారం నాకే సొంతం ఇది నా సైట్‌లో తప్ప ఇంకెంక్కడ వుండాటానికి వీల్లేదహో అనడం కొంచం పాతకాలం విశయంలా అనిపించడం లేదూ మీకు.

చివరిగా: మాలిని గారూ మీ అభిప్రాయం, ఆవేదన అర్థం చేసుకోదగ్గవే. మీ అభిప్రాయాల్మీద నాకు గౌరవం వుంది. నా అభిప్రాయం కొందరికి తప్పూ కావచ్చు అయినా ఇది నా అభిప్రాయం మాత్రమే.

--ప్రసాద్
http://blog.charasala.com

 

 



 
--
Prasad
http://blog.charasala.com

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Apr 18, 2007, 9:05:11 AM4/18/07
to telug...@googlegroups.com
ప్రసాదుగారు, నా మనస్సులో కూడా అచ్చు మీరు వ్రాసినటువంటి అభిప్రాయమే ఉంది. మీ అభిప్రాయంలో నేను 100% ఎకీభవిస్తున్నాను. మాలినిగారికి నేను చెప్పేంత వాణ్ణికాదుగాని, ఎవరైనా వ్యక్తుల అభిప్రాయాలు నచ్చకపోయినట్లయితే, ఆ అభిప్రాయానికి వ్యతిరేకంగా మీవాదన వినిపించాలిగాని, ఇలా వ్యక్తిగతదూషణకు దిగటం భావ్యంకాదు.
-రమణ.
 
--
రమణ
http://uvramana.wordpress.com

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Apr 18, 2007, 9:32:44 AM4/18/07
to తెలుగుబ్లాగు
కాపీరైట్లకి పరిమితులున్నాయి. ఏ కాపీరైటైనా 60 ఏళ్ళపాటు మాత్రమే
చెల్లుబాటులో ఉంటుందని నాకొక న్యాయవాది చెప్పారు. ఈ కాపీరైట్ల/ పేటెంట్ల
జబ్బుని నేను ప్రోత్సహించలేను. ఈ జబ్బుమనుషులు భాషలో ఉన్న దాదాపు అన్ని
పదాల మీద Trademark హక్కులు తెచ్చుకున్నారు. రేపు నిఘంటువులో
వాడుకోవడానికి పదాలే లేకుండా పోయే పరిస్థితి కనపడుతోంది. ఎవడో మన రచనని
తనదిగా చెప్పుకుని ఆర్థిక లాభం పొందాడనే కారణం చేత ప్రతీకార ధోరణితో
కాపీరైట్ల చట్టాన్ని ఆశ్రయించబూనుకోవడాన్ని నేను పిల్లచేష్టగా
భావిస్తాను.

ప్రపంచంలో అన్నింటికంటే తొందరగా పాతబడేది జ్ఞానం. తొందరగా వ్యాపించేదీ
అదే. కాపీరైట్లతో మనం ఎవరినీ కట్టెయ్యలేం.ఎంతమందినని monitor చేస్తాం ?
ఒకటి మాత్రం నిజం. కాపీ చేసిన వ్యక్తి అదే ప్రతిభ తనలో అంతకుముందు గాని
తరువాత గాని ఉందని నిరూపించుకోలేడు. Consistency లేకపోవడం చేత అది అతని
రచన కాదనే అనుమానం కొందరికైనా తప్పకుండా వస్తుంది.

నన్నయ్య తిక్కన విషయానికొస్తే -ప్రపంచం ఎప్పుడూ ఒకలాగానే ఉంది. తేడా
కొంచెమే. ఎటొచ్చీ అప్పుడు సాహిత్యం వ్యాపార వస్తువూ కాదు. Mass product
అంతకంటె కాదు.అయితే ప్రింటింగ్ ప్రెస్సులు లేకపోవడం చేత గ్రంథచౌర్యానికి
పాల్పడే అవకాశం నిజానికి ఆ రోజుల్లోనే ఎక్కువ.కాని ఎవరూ అందుకు
ఒడిగట్టినట్లు దాఖలాలు లేవు. మనం ఒకపక్క ఇంటర్‌నెట్‌లో అందరినీ మన "రాతలు
చూడండొహో" అని చాటింపు వేస్తూ మరోపక్క "నా అనుమతి లేకుండా నా రాతలు
వాడుకోకూడ"దని హెచ్చరించడం హాస్యాస్పదం. మనకి తెలిసో తెలీకో ముందో వెనకో
జనం మన రాతల్ని వాడుకుని తీరతారు.

మనకేమో అన్నీ ఉచితంగా కావాలి. మనం మాత్రం మన రాతల్ని వేరేవాడు ఏ రకంగా
ఉపయోగించుకున్నా భరించలేం. ఏమిటీ స్వార్థం ? మనమే శాశ్వతం కానప్పుడు మన
రాతలు శాశ్వతమా ? ఒకవేళ ఈ రాతలతో ఏదో ఆర్థిక ప్రయోజనం ఉందని దానికి
Copycats గండికొడుతున్నారనీ అనుకుంటే - నా తండ్రి ఏ రాతలూ రాయలేదు.
అందుచేత నాకు ఎలాంటి royalties గాని రావు. నాకు నేను వేరే మార్గాల్లో
సంపాదించుకుని బతుకుతున్నాను. నా రాతల royalties మీద నా కొడుకు ఆధారపడి
బతకాలని నేను కోరుకోవడం లేదు. ఎందుకీ కాపీరైట్లు ? అనవసరమైన మనోవేదన
కాకపోతే ?

On Apr 18, 6:05 pm, "వెంకట రమణ (Venkata Ramana)" <uvram...@gmail.com>
wrote:


> ప్రసాదుగారు, నా మనస్సులో కూడా అచ్చు మీరు వ్రాసినటువంటి అభిప్రాయమే ఉంది.
> మీ అభిప్రాయంలో నేను 100% ఎకీభవిస్తున్నాను. మాలినిగారికి నేను చెప్పేంత
> వాణ్ణికాదుగాని, ఎవరైనా వ్యక్తుల అభిప్రాయాలు నచ్చకపోయినట్లయితే, ఆ
> అభిప్రాయానికి వ్యతిరేకంగా మీవాదన వినిపించాలిగాని, ఇలా వ్యక్తిగతదూషణకు
> దిగటం భావ్యంకాదు.
> -రమణ.
>

> ...
>
> read more »- Hide quoted text -

Sudhakar S

unread,
Apr 18, 2007, 9:42:56 AM4/18/07
to telug...@googlegroups.com

ఈ కాపీ రైట్లు లాంటి విషాయాలు ఇలానే వేడిగా వుంటాయిఅందరూ ఇలా వుమ్ముకుంటూ పోతే 95% భారతీయుల మొహాలన్నీ వుమ్ముతో తడిసి మెరుస్తు కనిపిస్తాయి . మనమేమన్న కొనుక్కొని విండోస్ గానీ, ఆఫీస్ గానీ వాడుతామా? పోనీ కొన్నాకా , అవి కాపీలు చేసి స్నేహితులకూ, కుటుంబ సభ్యులకు పంచక వూరుకుంటామా?

 

పాటలు అందరూ ఆడియో సీడీలు కొని MP3 లు తయారు చేసి వింటున్నారా? మిగతావారికి దర్జాగా పంచుతున్నారా?

 

ఇలాంటి లాజిక్కులు లాగితే వుమ్మాలనుకునే వారు కూడా తడుముకుంటారనే నేను ఇంతవరకూ బ్లాగలేదు. :-)

 

అయితే కాపీతనాన్ని అందరూ ఖండిస్తారు. కానీ తాడేపల్లిగారిలా జాతిని మొత్తం తెలుగోల్లను తిట్టవలసినంత లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దరిద్రం ప్రపంచం మొత్తం వుంది. ప్రతీ దగ్గరా ఎలా వున్నదో ఇక్కడ కూడా అలానే వుంది. ఎంతో కొంత కాపీ (విషయ సంగ్రహనం) చెయ్యకుండా ఎవరూ సొంతంగా ఇప్పుడు ప్రాచీన సాహిత్య రచనలు చెయ్యలేరే అంతవరకూ ఎందుకూ ప్రతీ విజ్ఞాన పుస్తకానికీ చివరన References అని కూడా రాస్తారు కదా.. మక్కీకి మక్కీ కాపీ చేస్తే తిడితే అర్ధం వుంటుంది. అది కూడా సొంత రచనలైతే….

 

ఉదాహరణకు

 

౦౧. కృష్ణ రాసిన ఒరిజినల్ రచన నుంచి రాముడు ఒక మంచి సాహిత్యాన్ని తీసుకుని/సేకరించి ఒక చోట రాశాడనుకుందాం.

 

౦౨. ఇపుడు రాముడు రాసిన/సేకరించిన విషయం నచ్చి , వెంకట్ అనే అతడు దానిని అలానే తన బ్లాగులో పెట్టాడనుకుందాం. లేదా తను కూడా కృష్ణ తాలుకా ఒరిజినల్ ప్రతి నుంచే పెట్టాడనుకుందాం.

 

౦౩. ఇప్పుడు కాంతారావు వచ్చి, హన్నా ! వెంకట్ నువ్వు రాముడు కష్టపడి రాసింది కాపీ చేస్తావా? అన్నాడనుకోండి?

 

అలా వుంది ఇక్కడ కూడా….

 

రాముడు చేసిన పనే కదా వెంకట్ కూడా చేసినది?

 

మన గ్రంధాయాలలో ఎన్నో పుస్తకాలు వుంచుతారు. వాటిని చదివి, వాటిలో విషయాలతో కూర వండి Ph.D పట్టాలు సాధించినవారున్నారు. అయితే వారందరూ ఆయా పుస్తకాల references  వారి Ph.D వ్యాసాలలో రాస్తారు. అదీ విషయ సంగ్రహణ లేదా మరలా వుపయోగించడం అనేది.

 

జ్ఞానం అనేది తరతరాలుగా అందించబడుతుంది. దానిని కనిపెట్టిన వారు వేలలోనే వుంటారు మన ప్రపంచంలో. పదాల పొందికను, వాటి అమరికను కాపీ రైట్లుగా చేసుకోవాలంటే చాలా తేలిక. కానీ దానిని తిరిగి ఇంకోలా రాయటం కూడా అంతే తేలిక.



--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Tummala Sirish Kumar

unread,
Apr 18, 2007, 10:10:59 AM4/18/07
to telug...@googlegroups.com
ఓ ప్రయోగం.. మీమీ బ్లాగుల్లో బాగా రాసామని అనుకున్న టపాల్లోంచి చిన్న ముక్కలు తీసి గూగుల్లో వెతికి చూడండి. ఎక్కడో ఓచోట అదే జాబు మెరుస్తూ కనిపించొచ్చు.

మన రాతలను కాపీ చేసి మరోచోట పెట్టుకుంటే పెట్టుకోనీయండి. మన పేరు చెబితే సంతోషం, చెప్పకున్నా సంతోషమే. అనుకరణకు మించిన పొగడ్త లేదని అన్నారు కదా!
మొత్తమ్మీద మంచి చర్చ జరుగుతోంది. చాలా ఆసక్తికరంగా ఉంది.
-శిరీష్

Praveen Garlapati

unread,
Apr 18, 2007, 10:31:57 AM4/18/07
to telug...@googlegroups.com
నా అభిప్రాయాలు ఇక్కడ వారికంటే కొద్దిగా భిన్నం...

కాపీరైట్లకు నేను పూర్తిగా వ్యతిరేకం కాదు. కాపీరైట్లు అంటే ఖరీదు చెయ్యాల్సిందే అని అనుకోవడం లో కొంత
మంది పొరబడతారు. అన్ని కాపీరైట్లు కేవలం డబ్బు కోసం కాదు.

ఉదాహరణకి మీరు ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని ఏళ్ళు కష్టపడి ఒక వ్యాసం రాసారు, లేదా ఒక పేపర్ రాసారు. మీ
పేపరును మక్కీ కి మక్కీ గా ఒక రోజులో దించేసారు. అది కూడా విజ్ఞానాన్ని పచంచుతుంది, అలాగని మీరు
ఊరికుండవలసిందేనా ?

లినక్స్ వంటి ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లకు కూడా GPL వంటి కొన్ని లైసెన్స్ లు ఉంటాయి. ఎందుకు ?
లినక్స్ సోర్స్ మొత్తం లభ్యం. మీరు మీకు కావలసినట్టు దాన్ని మార్చుకోవచ్చు. కానీ మీరు మార్చిన కోడ్ ని మళ్ళీ
ఓపెన్ సోర్స్ చెయ్యవలసి ఉంటుంది. దీని వలన లాభమా, నష్టమా ? మీరే ఆలోచించండి. అందరికీ పంచాలన్న విధానం
ఇక్కడ ఇంకా సమర్థవంతంగా పని చేస్తుంది. కాదంటారా ?

ఇంకో ఉదాహరణ, మీరు మీ కంటెంట్ ని అంతా అందరికీ అందేలా ఉచితంగా ఉంచారు. మీ కంటెంట్ ని ఉపయోగించి
ఎవరయినా డబ్బులకు అమ్మితే, మీరు అనుకున్నది విఫలం అయినట్టే కదా. ఇలాంటప్పుడూ కూడా కాపీరైట్లు
ఉపయోగపడతాయి. ఉదాహరణకి నేను క్రియేటీవ్ కామన్స్ షేర్ ఎలైక్, నాన్ కమర్షియల్ లైసెన్స్ వాడతాను. దీని వల్ల
ఎవరయినా నా కంటెంట్ ని కమర్షియల్ గా ఉపయోగించాలనుకుంటే వారికి నా పర్మిషను లేదు. కానీ నా లాంటి భావాలే
ఉండి వారు నా వ్యాసం ఉపయోగించాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు.

అలాగే విండోస్ ని, ఆఫీస్ ని కొనకుండా ఉపయోగిస్తే అది తప్పే. ఎంతో మంది చేస్తారని తప్పు ఒప్పవదు కదా ?
నేను కాపీ చేసిన విండోస్ వాడను, ఆఫీస్ వాడను. ఓపెన్ సోర్స్ వాడతాను. కమర్షియల్ సాఫ్ట్‌వేర్ కి ప్రత్యామ్నాయాలు
వాడతాను. నాకు సాధ్యపడీందని అందరికీ సాధ్యం కాకపోవచ్చు, ఇష్టం ఉండకనూ పోవచ్చు. అలాగని విండోస్ మీద
కాపీరైట్లు తీసెయ్యండి అంటే ? ఎవరి బిజినెస్ మోడల్ వారికి ఉంటుంది, ఎవరికి తగినది వారు వాడుకుంటారు.
అందులో తప్పేమీ లేదు. అలాగని నేనేదో సాధువునని అన్నీ కరెక్టే అని చెప్పట్లేదు, నేనూ mp3 లు వగయిరా
వాడతాను, డౌన్లోడ్ చేస్తాను. తప్పా అంటే తప్పే మరి.

అలాగే ఎవరో అన్నారు కాపీ చేస్తే కంటెంట్ పోదు, కానీ ఇంకో కాపీ తయారవుతుంది కాబట్టి చోరీ కాదు అని. మరి ఆ
పైరసీ వల్లా కాదుటండీ మన సినిమా వాళ్ళు నెత్తిన చెంగేసుకుంటుంది ? అందుకు కాదుటండీ ఈ RIAA
(http://en.wikipedia.org/wiki/Riaa) మొదలయిన చిక్కులు ?

అందుకనే దేనికుండే లాభాలు, నష్టాలు వాటికుంటాయి. నేను ఏ సైడూ తీసుకోకపోవచ్చు ఇందులో కానీ, ఎవరికి
ఇష్టమయినట్టు వాళ్ళ కంటెంట్ ని కాపాడుకోవడం లో తప్పు లేదు అని నా అభిప్రాయం.

-ప్రవీణ్ గార్లపాటి

> On 4/18/07, *వెంకట రమణ (Venkata Ramana)* <uvra...@gmail.com

> <mailto:uvra...@gmail.com>> wrote:
>
> ప్రసాదుగారు, నా మనస్సులో కూడా అచ్చు మీరు వ్రాసినటువంటి అభిప్రాయమే ఉంది.
> మీ అభిప్రాయంలో నేను 100% ఎకీభవిస్తున్నాను. మాలినిగారికి నేను చెప్పేంత వాణ్ణికాదుగాని, ఎవరైనా
> వ్యక్తుల అభిప్రాయాలు నచ్చకపోయినట్లయితే, ఆ అభిప్రాయానికి వ్యతిరేకంగా మీవాదన వినిపించాలిగాని, ఇలా
> వ్యక్తిగతదూషణకు దిగటం భావ్యంకాదు.
> -రమణ.
>

> On 4/18/07, *Prasad Charasala* <char...@gmail.com

> http://blog.charasala.com <http://blog.charasala.com/>
>
>
>
>
>
>
>
>
> On 4/18/07, *KASYAP కశ్యప్* <kasy...@gmail.com


> <mailto:kasy...@gmail.com> > wrote:
>
> మాలిని గారు, నేను మిమ్మల ని మాత్రమే ఉద్దేసించి అనలేదు నొపిస్తే క్షమించండి , అసలు
> పాత ధారలోనే నెను సయమనంపాటించ వలసినదిగా విన్నవించాలిసినది . నేను కూడా ఈ గుంపు
> లో ఉన్న
> జనాలు మన, నా కుటుంబ సభ్యులు అనే ఉద్దేశ్యం తో మాత్రమే రాసాను :(
>
> మీశ్రేయోబిలాషి
> కశ్యప్
>
>
>

> On 4/18/07, *Kiran Kumar Chava* <chava...@gmail.com


> <mailto:chava...@gmail.com>> wrote:
>
> ఈ గుంపులోనుండి ఇంత వరకూ ఎవరినీ వెళ్ళగొట్టలేదు స్పామర్లను తప్ప.
>
> అసలు ఆ ఆలోచనే ఎవరికీ లేదనుకుంటాను.
>
> అసలు ఆ రూలు కూడా లేదు, అమన అలిఖిత తెలుగు బ్లాగు రాజ్యాంగంలో :)
>
> ఇదేమీ సాధారణ గ్రూపు కాదు కదా, we are something different
>
>
>
>
>

> On 4/18/07, *Kiran Kumar Chava* <chava...@gmail.com


> <mailto:chava...@gmail.com>> wrote:
>
> Malini has all the rights to send her opinions to
> this group about this topic.
>
> I will try to reply to this by evening.
>
> Busy now
>
>
>
>

> On 4/18/07, *KASYAP కశ్యప్* <kasy...@gmail.com


> <mailto:kasy...@gmail.com> > wrote:
>
> అయ్యో ! ఈ గుంపులో ఇలాంటివి చదవలసివస్తుదని వూహించలేదు
> :(, ఇతరుల అభిప్రాయాలను పరిగణించకుండా వ్యక్తి గత ఉద్దేశ్యం
> చెప్పటాని ఇది సరిఅయిన వేదిక కాదేమో! ఆలోచించండి. సయమనంపాటించ
> వలసినదిగా మనవి .
> మీశ్రేయోబిలాషి
> కశ్యప్
>
>
>

> On 4/18/07, *Malini*
> <malini....@gmail.com

> http://www.oremuna.com <http://www.oremuna.com/>


> http://flickr.com/photos/chavakiran
> naa sOdi
>
>
>
>
> --
> ----
> ధన్యవాదములు,
> కిరణ్ కుమార్ చావా

> http://www.oremuna.com <http://www.oremuna.com/>


> http://flickr.com/photos/chavakiran
> naa sOdi
>
>
>
>
> --
> కశ్యప్
> KASYAP,
>
>
>
>
>
> --
> Prasad

> http://blog.charasala.com <http://blog.charasala.com/>
>
>
>
>
>
> --
> రమణ
> http://uvramana.wordpress.com <http://uvramana.wordpress.com>
>
>
>
>
>
> >

Prasad Charasala

unread,
Apr 18, 2007, 10:41:18 AM4/18/07
to telug...@googlegroups.com

"అలాగే ఎవరో అన్నారు కాపీ చేస్తే కంటెంట్ పోదు, కానీ ఇంకో కాపీ తయారవుతుంది కాబట్టి చోరీ కాదు అని. మరి ఆ

పైరసీ వల్లా కాదుటండీ మన సినిమా వాళ్ళు నెత్తిన చెంగేసుకుంటుంది ? అందుకు కాదుటండీ  ఈ ఋఈఆఆ
(
http://en.wikipedia.org/wiki/Riaa) మొదలయిన చిక్కులు ?"

నవీన్ గారూ, మీరు చెప్పినదాంతో విభేదించక్కరలేదు. నా వుద్దేశ్యం అన్నిచోట్లా కాపీ మంచిదనిగానీ కాపీరైటు అన్నిచోట్లా మంచిదనిగానీ కాదు. ఎక్కడ apply చేయాల్సినదాన్ని అక్కడ apply చేసుకోవాలి. అన్నిటికి ఒకే మంత్రం పనికిరాదు. అలాగే అసలు స్వంతదారుడి (అసలోడెవడనేది మళ్ళీ ప్రశ్న) అభిమతం ప్రకారం మనం నడుచుకోవాలి.
మీరే అన్నట్లు కొన్ని చోట్ల ఓ మోడల్ ఇంకో చోట మోడల్ వప్పుతుంది.

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 18, 2007, 11:47:44 AM4/18/07
to telug...@googlegroups.com
పైరసీ వల్లా కాదుటండీ మన సినిమా వాళ్ళు నెత్తిన చెంగేసుకుంటుంది ? అందుకు కాదుటండీ  ఈ ఋఈఆఆ
(
http://en.wikipedia.org/wiki/Riaa) మొదలయిన చిక్కులు ?"
 
ఇది (ప్రవీణ్ మాటలు) చదువుతూంటే "... వాళ్లు లెజెండ్స్ కాదుటండీ..., నేను లెజెండుని కాదుటండీ..." అంటూ స్వర్ణోత్సవాలలో మోహన్‌బాబు ప్రసంగావేశం గుర్తుకొచ్చింది. :) దానికీ దీనికీ పోలికలేదనుకోండి, ప్రవీణ్ చెప్పేది అందరికీ పనికొచ్చేమాట. 
 
చర్చ చాలాబాగుంది. ఇక్కడ నామాట. కాపీరైటు చేయబడని రచనలను తమ సైటులో ఉంచుతూ, అవి సేకరించి తనకు ఇచ్చిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసి గౌరవం ప్రకటించారు  మాగంటిగారు. దాన్ని మెచ్చి మరింతమందికి అందించాలనే ప్రయత్నం చేసినవారు అదే గౌరవాన్ని ప్రకటించడం గుర్తెరగలేదు - బహుశా ఈ ఇంటర్నెట్టు వ్యవహారాలు కొత్తకావడం వల్ల కావొచ్చు. పైరేటెడ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం వాడకుండా పైకొచ్చిన తెలుగువాడు/భారతీయుడు బహుశా ఉండడేమో(విదేశీయుల సంగతి నాకు తెలియదు). ఎవరైనా ముందుకొచ్చి - "నేనున్నాను" అంటే, "పాపం వీడికేదో అయ్యింది" అని జాలిగాచూస్తాం. అలాగే mp3లు, సినిమాలు... ఇవన్నీ దొడ్డిదారిన వాడటం రక్తంలో జీర్ణించుకుపోయి, అలా వాడటమే ఫ్యాషన్ అదే రాచబాట అయిపోయంది. పొరబాటున ఒక డీవీడీ అద్దెకు తెచ్చుకొన్నా, ఒక మంచి పాటల సీడీ కొన్నా "డీవీడీ రెంటుకు తెచ్చుకున్నావా, ఏం పాపం!? నీకీ టొరెంట్ గురించి తెలీదా, ఇక్కడ ప్రీగా చూడొచ్చు తెలుసా, పిచ్చివాడా" అని ఒకాయన నలుగురిలో అనటం, దానికి మిగతావాళ్లు నవ్వి "అరే యే కౌన్ సా జమానాకా హైరే, భగవాన్ ఇస్కో కబ్ గ్యాన్ దేగా" అంటూ గేలిచేయడం చేయడం నాకు అనుభవం. ఎందుకంటే సీడీలు కొనడం అనే సంస్కృతి వచ్చి వాళ్లుకూడబెట్టిన ధనమంతా దోచేస్తుందని భయం. సీడీలు కొనేవాడు ఈ సమాజంలో ఒక కలుపుమొక్క. (గాంధీగురించి మాట్లాడితే ఇక వాడు దేశద్రోహం చేస్తున్నట్టు పరిగణింపబడి, వీణ్ణి ముగించే 'నాథు'డెవడయ్యా అనే దిశలో ఆలోచనలు సాగుతాయి). మనం పెరుగుతున్న సమాజం ఇలా తిరోగమిస్తోంది గనక మనమూ ఆ తానులో ముక్కలమే, ఆ గూటి పక్షులమే కాకపోతే అది సమాజద్రోహంగా పరిగణింపబడే స్థాయికొచ్చింది పరిస్థితి. ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న నాలాంటి వారిలో ఇది మరీ ఎక్కువగా చూస్తున్నాను.
 
చివరాఖరికి నేను చెప్పేదేమిటంటే, కాపీరైటు హక్కులను మనకు చేతనైనంతలో గౌరవించాలి. అది మనలో లేకపోతే మన పిల్లల్లో అస్సలుండదు. మన సమాజం హీనమైనదవుతుంది. అందరూ దర్జాదొంగలు తయారవుతారు. దొంగలున్న సమాజాన్ని ప్రపంచంలోని ఇతర సమాజాలు ఎలా గౌరవిస్తాయి!? ఒక కళారూపం, ఒక కష్టఫలం, వీటి వెనకనున్న శ్రమకు మనమిచ్చే కనీస గౌరవం మన బాధ్యత. నిజానికి అది మనకు మనమిచ్చుకొనే గౌరవం.  ఎలాగంటే, ఇండియన్స్ అనగానే ఇలాంటి ఇలాంటి అభిప్రాయాలు మనసులో మెదిలి, కించిత్తు భావనతో ప్రపంచంలోని ఇతర జాతులు మనల్ని చూడకూడదంటే ఇలాంటి చిన్నచిన్న విషయాలమీద కాస్త మనసుపెట్టాలి మనం. "సీడీ కొన్నావా, పిచ్చోడా" అని నిన్ను ఎవరైనా అనగానే వానికి వంతపాడుతూ నిన్ను గేలిచేసే జనాల సంఖ్య పెరిగిపోకుండా చేయడం చాలా ముఖ్యం. ఇది చేయకుండా రాజకీయనాయకులను, ప్రభుత్వాన్ని, పరిస్థితులనూ విమర్శిస్తూ మాట్లాడే నైతికహక్కు మనకు రాదుకదా!? మన స్తాయిలో మనకు చేతనైంది ఎ.ఆర్.రెహమాన్ సృజననూ శ్రమనూ ఫ్రీగా అనుభవించడమైతే, మన నాయకులు తమ స్థాయిలో తామకు చేతనయింది తాము చేస్తున్నారు. (మాఫియాలతో కలిసి మన ఆస్తులను కబ్జా చేయడం లాంటివి) మనం చేసేది మనకు పెద్ద తప్పుగా అనిపించకపోతే, వాళ్ల చేసేదీ వాళ్లకంతే కదా. ఎవరికి చేతనయింది వాళ్లు చేసేసుకోవడం ఆటవికన్యాయం. ముందుకెల్లడమా, రాతియుగానికెళ్లడమా మన చేతల్లోనే ఉంది. ఇదీ విజ్ఞత.

Malini

unread,
Apr 18, 2007, 12:55:16 PM4/18/07
to తెలుగుబ్లాగు

రానారే గారు , ప్రవీన్ గారు చెప్పింది బాగుంది. ఇక ప్రసాద్ గారి దీపాల
సంగతికి వస్తే - దీపాలు ముట్టిచ్చుకోవటం మంచిదే ప్రసాదు గారు. మీరు
వివరించీన్ తిరు కూడా బాగుంది. కానీ ఒక సందేహం ఆ దీపం వెరే చొటికి
వెళ్ళినప్పుడు కొత్త కాంతి ఇవ్వాలి కదా. అంతే కానీ అంటించుకున్న దీపం
వెలుతురు నీడనే నేను ప్రసరిస్తాను అంటే అది కాంతి అవుతుందా, భ్రాంతి
అవుతుందా?

ఇక సుధాకర్ గారి లాజిక్కుల విశ్లేషణ కి వస్తే, 95 శాతం మంది ఉమ్ములతొ
మెరుస్తూ ఉంటే, ఆ మెరుస్తున్న వాళ్ళు కనీసం ఆ ఉమ్ముల మెరుపుని
తుడిచేసుకుని మన స్వంత మెరుపు తెచ్చుకుందాము అని ఎప్పుడు ఆలొచిస్తారో
అప్పుడే రానారే గారు చెప్పినట్టు ముందుకెళ్ళడం అనేది సంభవిస్తుంది - లేదు
ఈ ఉమ్ముతొనే నేను మెరుస్తూ ఉంటాను అంటే రాతియుగానికి వెళ్ళతం
ప్రాప్తిస్తుంది.

తాడేపల్లి వారి విషయానికి వస్తే - ఆయన రాసింది చదివినప్పుడు మొట్టమొదటిగా
కలిగే భావన - ఈయన చెప్పినదాన్లో కొన్ని పచ్చి నిజాలు ఉన్నాట్టు మొదటగా
అనిపిస్తుంది, కాకపోతే తరువాత తీరికగా కూచుని ఆలోచించాలీ.

Sudhakar S

unread,
Apr 18, 2007, 1:09:56 PM4/18/07
to telug...@googlegroups.com
నా ఆశ కూడా మీరు ఏం చెప్పారో అది రావాలనే..అంతే గానీ రాతియుగంలోకి వెళ్లి వుమ్ముకుంటే లాభం లేదండి :-)

మన basic ethics లో మార్పు రావాలి. అది అన్ని స్థాయిలలోనూ రావాలి. అది ఒక పాట కావచ్చు, MP3 కావచ్చు లేదా పంచ తంత్ర కధ కావచ్చు....

ప్రస్తుతం ఇంటర్నెట్లో మనం వుమ్మితే అది పైకి వెల్లి మన మీదే పడటం ఖాయం. ఏం చెయ్యగలమో ఆలోచించండి, తిట్టుకోవటం వల్లనో, శత్రువైతే అవ్వనీ అనుకోవటంలో పనులేం జరుగుతాయండీ? :-)

--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Malini

unread,
Apr 18, 2007, 1:22:16 PM4/18/07
to తెలుగుబ్లాగు
మీరు చెప్పినట్టు మన మూలాల్లో, సమూహాల్లో మార్పు రావాలి అంటే ఎం
చెయ్యవచ్చో కూడా మీరే చెప్పండి. ఒక వెళ కొంత మందొ, చాలా మందో ఆ మూలాలని
మార్చుకోవటానికి ఇష్టపడకపోతే అప్పుడు కూడా ఏం చెయ్యాలో కూడా కొంచెం
ఎవరన్నా వివరిస్తే బాగుంటుంది.

ఉమ్మితే మనమీదే పడుతుంది అని ఊరుకుంతేనో లెకపోతే ఎక్కడో వాసన వస్తొంది-
అయితే నాకేంటి ఎవడొ శుభ్రం చేస్తాడులే అని అందరూ కూర్చుంటే ఆ కంపు, ఉమ్ము
మన ఇంట్లోకి రావటం కూడా ఖాయం అని మాత్రం చెప్పగలను

Prasad Charasala

unread,
Apr 18, 2007, 1:50:56 PM4/18/07
to telug...@googlegroups.com

మాలిని గారూ,

మీ వాదనను రానారె అద్భుతంగా వివరించారు.
ముట్టిచ్చుకున్న దీపం ఆ దీపం నీడనే వుందని ఎలా అనుకోగలం? ముట్టిచ్చుకున్నతనికీ సందర్షకులు వుండబట్టే కదా ఆయన ఆపని చేశాడు.

రానారె అన్నట్లు రాజకీయనాయకులు పెద్ద కుంభకోణాలకు పాల్పడితే మనం ఇలా మన స్థాయికి తగిన కుంభకోణాలకు పాల్పడతాం. కానీ స్వంతదారు దాన్ని కాపీ చేసుకోవచ్చని స్వేచ్చ ఇచ్చినా కూడా కాపీ చెయడం తప్పేనంటే అది తప్పు.

--ప్రసాద్
http://blog.charasala.com

 

 



On 4/18/07, Malini <malini....@gmail.com> wrote:



--
Prasad
http://blog.charasala.com

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Apr 18, 2007, 2:47:29 PM4/18/07
to తెలుగుబ్లాగు
కాపీరైట్స్ అనేవి గతకాలపు ప్రింట్ మీడియా యొక్క చారిత్రిక అవశేషం.
ప్రింట్ మీడియా ఆధిపత్యం చెలాయించిన కాలంలోనే వాటిని అమలు చెయ్యడం
అసాధ్యమైపోయింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కాలంలో పరిస్థితి వేరే
చెప్పనక్కరలేదు. కాపీరైట్స్ కాపీల్ని నిరోధించజాలవు. బహుశా మక్కికి మక్కి
కాపీ కొట్టకుండా మాత్రమే ఆపుతాయి. మహా అయితే మీ పేరాగ్రాఫుల క్రమం
మార్చబడుతుంది. మీరు పెట్టిన హెడ్డింగులు మారతాయి. అవసరమైతే బొమ్మలు కూడా
మారతాయి. పదాలు కూడా అక్కడక్కడ మార్చబడతాయి (నార అని ఉన్న చోట పీచు అని
మారుస్తారు) అంతే ! ఎవరిని ఆపగలరు ? ఇక్కడ కొంతమంది బ్లాగర్లుగా మారాకనో
లేక వెబ్‌సైట్లు మొదలుపెట్టాకనో దీని గురించి ఆలోచిస్తున్నారు. నేను 15
క్రితమే దీని గురించి బుఱ్ఱ బద్దలుచేసుకుని ఒకరకమైన వైరాగ్యాన్ని
పొందాను. ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక idea మన తలలో ఉన్నంతవరకే
మనది.అది బయటికి వచ్చిందో అది ఇక మనది కాదు.సమాజానిది.ఆ సమాజంలో
కాపీరాయుళ్ళు కూడా ఉంటారు.

On Apr 18, 10:50 pm, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> మాలిని గారూ,
> మీ వాదనను రానారె అద్భుతంగా వివరించారు.
> ముట్టిచ్చుకున్న దీపం ఆ దీపం నీడనే వుందని ఎలా అనుకోగలం? ముట్టిచ్చుకున్నతనికీ
> సందర్షకులు వుండబట్టే కదా ఆయన ఆపని చేశాడు.
>
> రానారె అన్నట్లు రాజకీయనాయకులు పెద్ద కుంభకోణాలకు పాల్పడితే మనం ఇలా మన
> స్థాయికి తగిన కుంభకోణాలకు పాల్పడతాం. కానీ స్వంతదారు దాన్ని కాపీ చేసుకోవచ్చని
> స్వేచ్చ ఇచ్చినా కూడా కాపీ చెయడం తప్పేనంటే అది తప్పు.
>
> --ప్రసాద్http://blog.charasala.com
>

Malini

unread,
Apr 18, 2007, 4:58:23 PM4/18/07
to తెలుగుబ్లాగు
సమాజంలో కాపీరాయుళ్ళు ఉంటారు, నానా రకాల మంచి వారు ఉంతారు. సమాజానికి
అన్ని రకాల వారూ కావాలి - అది తప్పదు కుడా. కానీ ఎప్పుడయితే చెడు మంచిని
మించిపోతుందో అప్పుదే మనుష్యుల మధ్య యుద్ధాలు ప్రారంభమవుతాయి. ఇప్పటివరకు
ఈలాటి యుద్ధాల్లో చెడు సమ్హరింపబడాలి అనే ఉద్దేశ్యం ఉందేది. కానీ చెడు
నెగ్గాలి అని ఎవరూ కోరుకోరు కదా - దుర్మార్గుల తప్ప. అలానే ఇది కూడా.
తప్పులు చేస్తున్నప్పుడు, దానికి తగిన శిక్ష అనుభవించడానికి సిద్ధంగా
కూడా ఉండాలి కదా. అది ఒకరికి తప్పు అవ్వొచ్చు , ఒకరికి ఒప్పు అవ్వొచ్చు.
అలాంటప్పుదు నిర్ణయించాలిసింది ఎవరు ? రాజీ పడిపోవటమా, పోరాడటమా అనేది
వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నా లాంటి వారిని విప్లవ వీర నారీమని
అని మీరు పిలవవొచ్చు, ఎందుకంటే నా వాదం విమర్శనాత్మకంగా ఉందని. కానీ అంత
మాత్రాన నేను పోరాడటం మానను - నా వంతు చెడును కడిగేదాకా ప్రయత్నం
చేస్తూనే ఉంటాను.

అయినా పదిహేనేళ్ళ వయసులోనే మీరు కాపీరాఇటుల గురించి బుర్ర బద్దలు
కొట్తుకున్నారు అంటే , ఆ సంగతి ఏమిటో తెలుసుకోవాలి అని ఆసక్తిగా ఉంది.
కొంచెం వివరిస్తారా?

On Apr 18, 11:47 am, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"

> > Prasadhttp://blog.charasala.com- Hide quoted text -

Sudhakar S

unread,
Apr 18, 2007, 10:46:38 PM4/18/07
to telug...@googlegroups.com
కాపీ అనేది కొత్త వికారం కాదు కాబట్టి, దీనికి కొన్ని చట్టాలు (పనికిరాకపోయినా...) వున్నాయి. ఉదాహరణను మనం చెప్పుకున్న GPL, Creative Commons వగైరాలు. కాన దురదృష్టవశాత్తు ఒక సమాచారాన్ని Unique గా గుర్తించే పని అసంభవం. ఇది చేదు నిజం. అంతవరకూ ఎందుకు, సాంకేతిక 

విషయాలను ప్రచురించే ఏ తెలుగు వార్తా పత్రికా వాటి మూలాలు (Scientific American, Slashdot, Nature Magazine) అనేవి కనీసం ప్రచురించటం లేదు. అవి ఇస్తే జనాలు అక్కడికి వెళ్లి చదువుకుంటారు కదా? కానీ అలా చెయ్యరు. వారి పేజీలు నిండాలి. ఈ లెక్కలో వుంది కాపీ భూతం. అది గాడ్జిల్లా అయితే మనం చీమలం . నాకైతే మనం ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఏమి చెయ్యలేం అనిపిస్తుంది. ఇది పలాయనవాదమో , నిరాశావాదమో కాదువాస్తవ అవలోకనం (practical thinking).


ఈ మధ్య ఆంగ్లంలో గూగుల్ యాడ్స్ ఈ రకమైన పైరసీకి విపరీతంగా దోహదం చేస్తున్నాయి. ఒక బ్లాగు తెరవటం, రకరకాల విషయాలు కత్తిరించి అక్కడ పడేసి యాడ్స్ పెట్టెయ్యటం , పబ్లిసిటీ విపరీతంగా చెయ్యటం…..అది చాలు మీరు ప్రతీ నెలా గూగుల్ నుంచి ఒక మూడు వందల డాలర్ల చెక్కు అందుకోవటానికి. అలా కాకుండా ఇంకొకరి విషయాన్ని రాసినా విషయ మూలాలకు ఒక లంకె ఇచ్చే సంప్రదాయం ఇపుడు వున్నది. Lifehacker.com లాంటి అత్యున్నత స్థాయి బ్లాగులలో మనం ఇది చూడవచ్చు.

 

ఇలాంటివన్నీ పరికిస్తే నాకు ఈ చర్చకు మూలమైన విషయాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి చేసినవారు ఏదో గ్రంధం అచ్చువేసుకునో లేదా డబ్బులు సంపాదించే పనో చెయ్యటం లేదు కదా అని నాకనిపిస్తుంది. వంశీ గారు సహృదయంతో రాసిన మెయిల్ కూడా ఇదే విషయాన్ని చెప్తుంది.



--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

On 4/18/07, Malini <malini....@gmail.com> wrote:

సత్యసాయి కొవ్వలి

unread,
Apr 19, 2007, 4:56:00 AM4/19/07
to తెలుగుబ్లాగు
ఆహా. కథ ముదిరి పాకాన పడింది. ఒకాయన వంశీగారి పేజీనుండి copy , paste
చేసి తన బ్లాగులో ఉంచడంతో మొదలయిన వాగ్యుద్ధం రకరకాల చిలవలూ పలవులుగా
విస్తరించి తెలుగు బ్లాగ్లోకజాలంలో ఉమ్ముల తుంపర్లుగా పడడం, వాటిని
మనమందరం తుడుచుకోవాల్సి రావడం- బాగుంది. చర్చ పసందుగా, అర్ధవంతంగా,
వాడిగా, వేడిగా, వడిగా సాగింది. పాల్గొన్నవాళ్ళ మానసిక పరిణతికి నా
జోహార్లు. మాలినిగారికి చర్చ మొదలెట్టినందుకు ప్రత్యేక అభినందనలు.

మనలో చాలామందికి రిఫెరెన్సులూ, క్రెడిట్లూ లాంటి గోలలు తెలియవు. మీరు
ఏదైనా Ph.D. థీసిస్ తిసుకోండి, 95% వాటిల్లో వీరకాపీ కనిపిస్తుంది.
జర్నల్ పేపర్లలో మక్కికి మక్కీ దించేసిన ఆచార్యులు కూడా ఉన్నారు.
కాపీచేస్తే సులభంగా తొందరగా అయిపోతుంది. స్వంతంగా రాస్తే ఎప్పటికీ
అవ్వకపోవచ్చు కాబట్టి కాపీకే ఎక్కువ మొగ్గు చూపిస్తారు జనాలు. ఇది
ఖచ్చితంగా తప్పే. ఇది చవకరకం. కానీ, మూలాన్ని ఉటంకిస్తూ, తమ వ్యాసాల్లో
ఇతరులనుండి గ్రహించిన విషయాలకు వారికే గొప్పనివ్వడం ఉత్తమ రకం. కనీస
ధర్మం.
ఈసందర్భంగా ఒక సంగతి మీతో చెప్పాలి. ఈమధ్యన ఇక్కడ కొంతమంది మనదేశంవాళ్ళం
ఒక విహారానికి వెళ్ళాం. అక్కడ ఫోటోలు తీసుకొన్నాం. పికాసో లోనో,
ఫ్లికర్లోనో ఎక్కడో ఎవర్కి తోచిన చోట వాళ్ళు పెట్టారు. చూసిన
వాళ్ళుచూశారు. ఒకాయన మెయిల్ పంపించాడు- నా ఫోటోలు బాగున్నాయని
(చూడాలనుకొంటే: http://picasaweb.google.com/saikovvali/Soraksan2006
వీటిని మీరేమైనా చేసుకోవచ్చు- దింపచ్చు, చింపచ్చు, మడవచ్చు,
అతికించుకోవచ్చు- మీయిష్టం), వాటిని తన బ్లాగులో(తమిళ్) వాడుకోవచ్చా
అని. అసలు చూసినవాళ్ళే కరువైనరోజుల్లో వాడుకొంటానంటే నాకు సంతోషమేకదా.
ఓఎస్సన్నా. వీలైతే ఆ బ్లాగులంకె పంపించమన్నా- ఉత్సుకత కొద్దీ. ఆయన
బ్లాగుకి లంకెలిస్తున్నా- http://emadal.blogspot.com/2006/11/9.html ,
http://emadal.blogspot.com/2006/10/8.html ఆయన్లాంటి పద్ధతి పాటిస్తే
కొన్ని గొడవలు తప్పుతాయేమో? తమిళ వాసనలున్నవాళ్ళేవరైనా ఉంటే ఆయన
బ్లాగులు చూడొచ్చు- he is a learned man.

మనం ఏదైనా సృష్టించినది ఎవరైనా తమదే అని చెప్పుకోంటే చాలా అన్యాయం.
సమాజంలో సృజనాత్మకత పెరగదు. కానీ మనం సృష్టించింది కేవలం మనవల్లే
జరుగుతుందా? సమాజం ప్రమేయంలేకుండానే మనం ఇంత సృష్టికర్తలమైపోయామా?
కాదు. మనం ఈదశలో ఉన్నామంటే మన ముందువాళ్ళు వేసిన బాటలే కారణం. ఆ బాటలకి
టోల్ టాక్సులు మనం ఖచ్చితంగా కట్టామా? కట్టలేదు, కట్టలేము. అలాగే మన
సృష్టిని ఇతరులు 'సదుపయోగిస్తోంటే' (స్వార్ధానికి కాదు) మనం
సంతోషించాలి. మన భారతీయ సాంప్రదాయంలో (వి)జ్ఞానం అందరిదీ. ఒక్కోసారి
విజ్ఞానం అందరికీ అందకపోయినా దాని ఫలాలు అందుతూనే ఉన్నాయి.

ఈ పేటెంట్లు, కాపీరైట్లు ముఖ్యంగా అమెరికా వాళ్ళ 'పిదప'కాలం బుద్ధులు.
వాళ్లకి అన్నిటికీ హక్కులు కావాలంటారు. చిన్న ఉదాహరణ చూడండి. పసుపు
తెలియని భారతీయుడుండడు. కానీ అది అమెరికాలో పసుపుకి ఓషధ గుణాలున్నయని
ఒకడు పేటెంటు తెచ్చుకొన్నాడట. వాడు 'కనిపెట్టాడు' కాబట్టి ఎవడైనా పసుపుని
ఔషధంగా వాడితే వాడికి డబ్బులుకట్టాలి. ఇది వాడి పైత్యం. డబ్బులు
సంపాదించడానికి వాడి విజ్ఞానాన్ని ఇలా వాడుకోవడానికి వాళ్ల చట్టం
వీలుకల్పించింది. అమెరికా పేటేంట్ చట్టంప్రకారం అమెరికా వాడికి
తెలియనిదేదైనా కొత్త విషయమే, పేటేంటుకర్హమే. ఇంకే దేశంవాళ్ళకైనా
తెలిసుంటే వాళ్లు తర్వాత గగ్గోలుపెట్టుకోగాక. అలాగే ఆయనెవడో 'వాస్తు'
అన్న పదానికి పేటెంటు తీసుకొన్నాడట!

కానీ మన సంస్కృతిలో ముఖ్యసూత్రం- 'బహుజన హితాయ, బహుజన సుఖాయ' అన్నదే.
వ్యక్తి ముఖ్యం కాదు, సమాజమే. అలా అని సృజనాత్మకతని తక్కువ చేయలేదు.
నిజంగా స్వయంప్రతిభ ఉన్న వాళ్ళని ఇప్పటికీ మనం తలుచుకొంటున్నాం. కాపీ
చేసినవాడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. ఒకవేళ అయినా ఎల్లకాలం
నిలబడలేడు. 'better to be wrong by being original rather than being
right by imitation' అన్నది నా సిద్ధాంతం. అలాగే మన తెలివి పంచిన
కొద్దీ పెరుగుతుంది. ఈవిషయంలో మాగంటి వారి స్పూర్తి నచ్చింది.

టి.యల్.యస్.భాస్కర్

unread,
Apr 19, 2007, 5:16:10 AM4/19/07
to తెలుగుబ్లాగు
> ఏదైనా Ph.D. థీసిస్ తిసుకోండి,  95%  వాటిల్లో వీరకాపీ కనిపిస్తుంది.
> జర్నల్ పేపర్లలో మక్కికి మక్కీ దించేసిన ఆచార్యులు కూడా ఉన్నారు.


అయ్యా సత్య సాయి గారు...నమస్కారం. ఎదో కష్టపడి పరిశొధన చేసాను..."Ph.D"
పట్టా ఇచ్చారు. కాని మీ అభిప్రాయం చూసిన తరువాత కొంచం భయం వేసింది.95%
"thesis" ల్లో వీర కాపీ నా? ఎలా ధ్రువీకరించారు? మీరు ఇచ్చే జవాబు మీద
నేను మీరు వ్రాసిన అభిప్రాయానికి స్పందిస్తాను.

భాస్కర్

సత్యసాయి కొవ్వలి

unread,
Apr 19, 2007, 7:40:46 AM4/19/07
to తెలుగుబ్లాగు
అయ్యా క్షమించండి. మన యూనివర్సిటీల భాగోతం దగ్గినుండి చూసిన కాసింత
అనుభవంతో కొద్దిపాటి ఉత్ప్రేక్ష కలిపి ఎఫెక్ట్ కోసం అలా అన్నానే కానీ అంత
ధృవసత్యం కాదు. 95% బదులు చాలా అని చదవమని మనవి.


టి.యల్.యస్.భాస్కర్ Vraasenu:

టి.యల్.యస్.భాస్కర్

unread,
Apr 19, 2007, 8:06:06 AM4/19/07
to తెలుగుబ్లాగు
ఇది సినిమా కాదు...మీరు "effects" వ్రాయటానికి..."coyrights" మీద ఎంతో
"serious debate" జరుగుతుంది.

నా అభిప్రాయం ప్రకారం మీరు అనుకుంనంత దీనముగా పరిస్థితి లేదు. ఎవరైనా
చూసి చదివితే మండిపడతారు.

మిత్రులకు చిన్న విన్నపం. దయచేసి ఇలంటి వాఖ్యలు ఎంతో అలోచించి వ్రాయండి.

> > భాస్కర్- Hide quoted text -

Kiran Kumar Chava

unread,
Apr 19, 2007, 8:14:45 AM4/19/07
to telug...@googlegroups.com

భాస్కర్ గారూ

మీరు అనుకున్నంత బాగుందంటారా?

1. నాకు కాపీ కొట్టి వ్రాసే ప్రొఫెసర్లే తెలుసు (పేపరు సబ్మిట్టింగునకు )
2. మన వాళ్ళ పీ హెచ్ డీ ల నుండి పనికి వచ్చినవి లెక్క తీస్తే ఎన్ని వస్తాయంటారు?
3.



టి.యల్.యస్.భాస్కర్

unread,
Apr 19, 2007, 8:31:35 AM4/19/07
to తెలుగుబ్లాగు
మిత్రుడు కిరణ్ కి...


మీరు చెప్తున్న ప్రోఫసర్లు ఉన్నారు. కాని చాలా తక్కువ శాతం. అయితే మీకు
అలాంటి ప్రోఫసర్ల్తో పరిచయం వలన అలా అనిపిస్తుంది అని నేను
అనుకుంతున్నాను. నా అలోచన తప్పు కావొచ్చును.

మనము ఇలాంటి "platforms" మీద వ్రాస్తున్నప్పుడు ఎంతో అలోచించి వ్రాయలి.
మనము వ్రాస్తున్నది ఇంకోకరిని గాని వారి అలోచనలను తప్పుతోవ పట్టించకూడదని
నా అభీప్రాయం. కదా?


On Apr 19, 5:14 pm, "Kiran Kumar Chava" <chavaki...@gmail.com> wrote:
> భాస్కర్ గారూ
>
> మీరు అనుకున్నంత బాగుందంటారా?
>
> 1. నాకు కాపీ కొట్టి వ్రాసే ప్రొఫెసర్లే తెలుసు (పేపరు సబ్మిట్టింగునకు )
> 2. మన వాళ్ళ పీ హెచ్ డీ ల నుండి పనికి వచ్చినవి లెక్క తీస్తే ఎన్ని
> వస్తాయంటారు?
> 3.
>

> On 4/19/07, టి.యల్.యస్.భాస్కర్ <tlsbhas...@gmail.com> wrote:
>
>
>
>
>
>
>
> > ఇది సినిమా కాదు...మీరు "effects" వ్రాయటానికి..."coyrights" మీద ఎంతో
> > "serious debate" జరుగుతుంది.
>
> > నా అభిప్రాయం ప్రకారం మీరు అనుకుంనంత దీనముగా పరిస్థితి లేదు. ఎవరైనా
> > చూసి చదివితే మండిపడతారు.
>
> > మిత్రులకు చిన్న విన్నపం. దయచేసి ఇలంటి వాఖ్యలు ఎంతో అలోచించి వ్రాయండి.
>
> > On Apr 19, 4:40pm, "సత్యసాయి కొవ్వలి" <saikovv...@gmail.com> wrote:
> > > అయ్యా క్షమించండి. మన యూనివర్సిటీల భాగోతం దగ్గినుండి చూసిన కాసింత
> > > అనుభవంతో కొద్దిపాటి ఉత్ప్రేక్ష కలిపి ఎఫెక్ట్ కోసం అలా అన్నానే కానీ అంత
> > > ధృవసత్యం కాదు. 95% బదులు చాలా అని చదవమని మనవి.
>
> > > టి.యల్.యస్.భాస్కర్ Vraasenu:
>
> > > > > ఏదైనా Ph.D. థీసిస్ తిసుకోండి, 95% వాటిల్లో వీరకాపీ కనిపిస్తుంది.
> > > > > జర్నల్ పేపర్లలో మక్కికి మక్కీ దించేసిన ఆచార్యులు కూడా ఉన్నారు.
>
> > > > అయ్యా సత్య సాయి గారు...నమస్కారం. ఎదో కష్టపడి పరిశొధన చేసాను..."Ph.D"
> > > > పట్టా ఇచ్చారు. కాని మీ అభిప్రాయం చూసిన తరువాత కొంచం భయం వేసింది.95%
> > > > "thesis" ల్లో వీర కాపీ నా? ఎలా ధ్రువీకరించారు? మీరు ఇచ్చే జవాబు మీద
> > > > నేను మీరు వ్రాసిన అభిప్రాయానికి స్పందిస్తాను.
>
> > > > భాస్కర్- Hide quoted text -
>
> > > - Show quoted text -
>

> --
> ----
> ధన్యవాదములు,

> కిరణ్ కుమార్ చావాhttp://www.oremuna.comhttp://flickr.com/photos/chavakiran
> naa sOdi- Hide quoted text -

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 19, 2007, 8:35:02 AM4/19/07
to telug...@googlegroups.com
ఎవరు ఎంత కష్టపడ్డా, ఎవరు PhD ఇచ్చినా ఆ పరిశోధన "అంతవరకూ మానవాళికి అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని ఆధారం చేసుకునే" జరిగి ఉంటుంది. ఈ మాటనే సత్యసాయిగారు చాలా సౌమ్యంగా చెప్పారు. ఈ మాటకు మానవాళికి పూర్తి కొత్తవిషయాలను నిరూపించి చెప్పిన న్యూటన్, ఐన్‌స్టీన్, సి.వి.రామన్ లాంటి వారు కూడా ఉలికిపడరేమో. ఆయన 95% అనగానే దాని ధృవీకరణ అడగడం అవసరమా?

 
-- రానారె
http://yarnar.blogspot.com

టి.యల్.యస్.భాస్కర్

unread,
Apr 19, 2007, 8:52:27 AM4/19/07
to తెలుగుబ్లాగు
మన అభిప్రాయలు మన అనుభవాలతో ముడి పడి ఉంటాయి. అయితే మనము వాటి బయటకు
వచ్చి "objective" గా సమస్యను చూడటానికి ప్రయత్నించాలి.

రెడ్డి గారు...నా అలోచన ప్రకారం..ధ్రువీకరన అవసరం. కాదా? "comment
severity" ని ద్రుస్టిలో పెట్టుకోని అడిగాను.
కిరణ్..."Ph.D" లు, వాటి "subject matter" సామాజానికి, దేశానికి
ఉపయోగపడాలనే "intention" పరిశొధన చేసే వారి అందరిలో ఉంటాది. కాని అలా
జరిగే అవకాసం మన దేసంలో తక్కువ కావొచ్చు.

ఇక ఈ టాపిక్ మీద నా కామంట్లు ఉండవు...

On Apr 19, 5:35 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"


<iamramuh...@gmail.com> wrote:
> ఎవరు ఎంత కష్టపడ్డా, ఎవరు PhD ఇచ్చినా ఆ పరిశోధన "అంతవరకూ మానవాళికి అందుబాటులో
> ఉన్న విజ్ఞానాన్ని ఆధారం చేసుకునే" జరిగి ఉంటుంది. ఈ మాటనే సత్యసాయిగారు చాలా
> సౌమ్యంగా చెప్పారు. ఈ మాటకు మానవాళికి పూర్తి కొత్తవిషయాలను
> నిరూపించి చెప్పిన న్యూటన్, ఐన్‌స్టీన్, సి.వి.రామన్ లాంటి వారు కూడా
> ఉలికిపడరేమో. ఆయన 95% అనగానే దాని ధృవీకరణ అడగడం అవసరమా?
>

> On 4/19/07, Kiran Kumar Chava <chavaki...@gmail.com> wrote:
>
>
>
>
>
>
>
> > భాస్కర్ గారూ
>
> > మీరు అనుకున్నంత బాగుందంటారా?
>
> > 1. నాకు కాపీ కొట్టి వ్రాసే ప్రొఫెసర్లే తెలుసు (పేపరు సబ్మిట్టింగునకు )
> > 2. మన వాళ్ళ పీ హెచ్ డీ ల నుండి పనికి వచ్చినవి లెక్క తీస్తే ఎన్ని
> > వస్తాయంటారు?
> > 3.
>

> > On 4/19/07, టి.యల్.యస్.భాస్కర్ <tlsbhas...@gmail.com> wrote:
>
> > > ఇది సినిమా కాదు...మీరు "effects" వ్రాయటానికి..."coyrights" మీద ఎంతో
> > > "serious debate" జరుగుతుంది.
>
> > > నా అభిప్రాయం ప్రకారం మీరు అనుకుంనంత దీనముగా పరిస్థితి లేదు. ఎవరైనా
> > > చూసి చదివితే మండిపడతారు.
>
> > > మిత్రులకు చిన్న విన్నపం. దయచేసి ఇలంటి వాఖ్యలు ఎంతో అలోచించి వ్రాయండి.
>
> > > On Apr 19, 4:40pm, "సత్యసాయి కొవ్వలి" < saikovv...@gmail.com> wrote:
> > > > అయ్యా క్షమించండి. మన యూనివర్సిటీల భాగోతం దగ్గినుండి చూసిన కాసింత
> > > > అనుభవంతో కొద్దిపాటి ఉత్ప్రేక్ష కలిపి ఎఫెక్ట్ కోసం అలా అన్నానే కానీ అంత
>
> > > > ధృవసత్యం కాదు. 95% బదులు చాలా అని చదవమని మనవి.
>
> > > > టి.యల్.యస్.భాస్కర్ Vraasenu:
>
> > > > > > ఏదైనా Ph.D. థీసిస్ తిసుకోండి, 95% వాటిల్లో వీరకాపీ కనిపిస్తుంది.
> > > > > > జర్నల్ పేపర్లలో మక్కికి మక్కీ దించేసిన ఆచార్యులు కూడా ఉన్నారు.
>
> > > > > అయ్యా సత్య సాయి గారు...నమస్కారం. ఎదో కష్టపడి పరిశొధన చేసాను..."Ph.D"
> > > > > పట్టా ఇచ్చారు. కాని మీ అభిప్రాయం చూసిన తరువాత కొంచం భయం వేసింది.95%
> > > > > "thesis" ల్లో వీర కాపీ నా? ఎలా ధ్రువీకరించారు? మీరు ఇచ్చే జవాబు మీద
> > > > > నేను మీరు వ్రాసిన అభిప్రాయానికి స్పందిస్తాను.
>
> > > > > భాస్కర్- Hide quoted text -
>
> > > > - Show quoted text -
>
> > >http://www.oremuna.com
> > >http://flickr.com/photos/chavakiran
> > > naa sOdi
>

> -- రానారెhttp://yarnar.blogspot.com- Hide quoted text -

Sudhakar S

unread,
Apr 19, 2007, 9:21:43 AM4/19/07
to telug...@googlegroups.com
95% ని "చాలా మట్టుక" అని చదువుకుందాం...

సరిగ్గా గుర్తులేదు కానీ ఈ విషయం మీద కొంత మంది వారి Ph.D పట్టాలను కోల్పోయిన వార్త గుర్తుకొస్తుంది.

--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

sudhakar valluri

unread,
Apr 19, 2007, 1:20:14 PM4/19/07
to telug...@googlegroups.com
అయ్యా! విషయం కాపిరైట్ మీద మొదలై, డాక్టరేట్ మీద మళ్ళింది. ముందు మన చర్చలో కాపిరైట్ విషయానికి భరతవాక్యం పలికి, అప్పుడు డాక్టరేట్ మీద చర్చ ప్రారంభిద్దాము, ఎందుకంటే ఈ విషయం కూడా, అంతర్జాలం లాగా అనంతమైనది, ముందుకుపోయెకొద్ది, అవనీతి అశ్రితపక్షపాతం మొదలైన అంశాలు బయటకొస్తాయీ మరి. 
--
Sudhakar    
vskar08gmail.com

సత్యసాయి కొవ్వలి

unread,
Apr 20, 2007, 3:26:41 AM4/20/07
to తెలుగుబ్లాగు
అయ్యా. మీరు ఘనాపాటీలు. నా లాంటి ఓనాలుగు పనసలు వల్లించే వాళ్ళమీద బాణాలు
సంధిస్తే కష్టం. ప్రతీ మనిషికీ/రచయితకీ ఒక శైలి ఉంటుంది. ఆశైలిని బట్టి
వాళ్ళు వ్రాసే పద్ధతి ఉండొచ్చు. కొంతమంది ఉత్ప్రేక్షలు వాడితే, కొంతమంది
వ్యంగ్యాలు వాడొచ్చు. అంత మాత్రాన చెప్పే విషయపు సీరియస్‍నెస్
తగ్గిపోదనుకొంటా. అయినా నేను చాలా సీరియస్ టపా వ్రాసాననుకొంటున్నా.
నాజాబులో మీకు అభ్యంతరకరమైన వాక్యం మినహాయించి మిగిలిన జాబు చదివి
చూడండి.

పరిస్తితులు అంత అధ్వానంగా లేవని మీఅభిప్రాయం. మీ అభిప్రాయం
గౌరవిస్తా. ప్రశ్నించను. నాది కూడా అనుభవం నుండి వచ్చిన అభిప్రాయం.
తప్పవచ్చు.

అసలు, మనం రామాయణం వింటూ శూర్ఫణఖ అందం మీదకి చర్చ మరల్చినట్లున్నాం.
వల్లూరిగారు చెప్పినట్లు మళ్ళా రామాయణానికి వద్దాం. ఈలోపులో ఎవరూ
శూర్ఫణఖ లాంటి విషయాలపై చర్చ ప్రారంభించకుందురు గాక.

పదండి ముందుకు....

Kiran Kumar Chava

unread,
Apr 20, 2007, 3:37:10 AM4/20/07
to telug...@googlegroups.com

రామాయణం మొత్తం అయిపొయినది కదా!

పురాణం ముగించకపోతే, ఇలా పిడకల వేటేమిగుల్తుంది



Chandu

unread,
Apr 20, 2007, 4:28:15 AM4/20/07
to తెలుగుబ్లాగు
అయ్య బాబోయ్. ఇంత వాడి వేడి చర్చ ఇంతవరకు ఈ గ్రూపులో చూడలేదు.
వేసవి వేడి ఇక్కడా కనిపిస్తోంది.

---------------------------------------------
Chandu
http://www.telugubloggers.com

On Apr 20, 12:37 pm, "Kiran Kumar Chava" <chavaki...@gmail.com> wrote:
> రామాయణం మొత్తం అయిపొయినది కదా!
>
> పురాణం ముగించకపోతే, ఇలా పిడకల వేటేమిగుల్తుంది
>

> On 4/20/07, సత్యసాయి కొవ్వలి <saikovv...@gmail.com> wrote:
>
>
>
>
>
> > అయ్యా. మీరు ఘనాపాటీలు. నా లాంటి ఓనాలుగు పనసలు వల్లించే వాళ్ళమీద బాణాలు
> > సంధిస్తే కష్టం. ప్రతీ మనిషికీ/రచయితకీ ఒక శైలి ఉంటుంది.  ఆశైలిని బట్టి
> > వాళ్ళు వ్రాసే పద్ధతి ఉండొచ్చు. కొంతమంది ఉత్ప్రేక్షలు వాడితే, కొంతమంది
> > వ్యంగ్యాలు వాడొచ్చు. అంత మాత్రాన చెప్పే విషయపు సీరియస్‍నెస్
> > తగ్గిపోదనుకొంటా.  అయినా నేను చాలా సీరియస్ టపా వ్రాసాననుకొంటున్నా.
> > నాజాబులో మీకు అభ్యంతరకరమైన  వాక్యం మినహాయించి మిగిలిన జాబు చదివి
> > చూడండి.
>
> > పరిస్తితులు అంత అధ్వానంగా లేవని  మీఅభిప్రాయం.  మీ అభిప్రాయం
> > గౌరవిస్తా.  ప్రశ్నించను.  నాది కూడా అనుభవం నుండి వచ్చిన అభిప్రాయం.
> > తప్పవచ్చు.
>
> > అసలు, మనం రామాయణం వింటూ శూర్ఫణఖ అందం మీదకి చర్చ మరల్చినట్లున్నాం.
> > వల్లూరిగారు చెప్పినట్లు మళ్ళా రామాయణానికి వద్దాం.  ఈలోపులో ఎవరూ
> > శూర్ఫణఖ లాంటి విషయాలపై చర్చ ప్రారంభించకుందురు గాక.
>
> > పదండి ముందుకు....
>

మధు

unread,
Apr 21, 2007, 5:03:31 AM4/21/07
to తెలుగుబ్లాగు
అయ్యో, నేను ఈ విషయాన్ని గమనిస్తూనే ఉన్నా.. దీనికి సంబంధించి అన్నీ కాక
పోయినా చాలా సంభాషణలను చదివాను. ఐతే ఒక్కటి మాత్రం నిజం. ఇంటర్నెట్లో
పెట్టాక అది ఎంత కష్టపడి చేసినది అయినా దాని మొత్తం క్రెడిట్ మనకే
రావాలంటే చాలా కష్టం.

ఒకవేళ కొన్నాళ్ళ తరవాత అది వేరే ఇంకెవరు పబ్లిష్ చేసి ఉంటే మీరు ఇలాగే
వాదించలేరు కదా. సంవత్సరాల తరబడి తయారుచేస్తున్న వాటికే( సాఫ్ట్వ్వేర్,
సినిమాలు వగైరా) వాటికే దిక్కులేదు.

మీరు ముందే, మీ పేరు జతచేయమని అడిగి ఉంటే, ఇంత గొడవ తప్పిపోయేదీ కదండీ
మాలిని గారూ. ఏమంటారు? జనం మధ్యలోకి వచ్చాక అది మన సొత్తు అని ఎలా
చెప్తాం??

అలా అని తప్పు మీది అని నేను అనలేను. కాపీ చేసిన్నప్పుడు దాని అసలు
రూపకర్తని మెన్షన్ చెయ్యడం సంస్కారం.. అది అందరం మైంటెయిన్ చేస్కుందాం.

On Apr 18, 12:58 am, Malini <malini.chaki...@gmail.com> wrote:
> Haste decision by Mr.Maganti or was it thoughtful decision about
> copyright of his content. What ever it is - I donot agree with it.
>
> May he become my enemy by saying this, but I am inclined to say that
> it's a not a wise decision. Some team members responded saying that
> creative commons is one way to stop the copyright violation and what I
> gathered from most other answers is copy is not a crime, but not
> giving proper credit is a crime. I would take a stand on the first
> part of creative commons licenses, but not on the second suggestion of
> proper credit. Proper credit is like
>

> దొంగతనం చేసాము కానీ - నేను ఒప్పుకుంటున్నాను కదా ఫలానా వారింట్లోనుంచి


> దొంగతనం చేసాను, కాబట్టి దొంగతనం అనేది తప్పు కాదు అని అన్నట్టుగా ఉంది.
> తీరిగ్గా కూర్చుని కొంచెం ఆలోచించిన తరువాత భలే బుడుగు గారు
> చెప్పినదానిలో చాలా మటుకు తప్పు లేదు అని అనిపించింది.సుబ్రహ్మణ్యంగారో
> ఎవరో అన్నారు నన్నయ, తిక్కన కాపీరైట్లు పెట్టుకున్నారా అని - కానీ ఆ
> కాలంలో మనుషులకి కొన్ని మానవతా విలువలు ఉన్నాయండి - దొంగతనాలు అసలు
> ఉండేవి కాదు, పైగా దొంగతనం మహా పాపం అని భావించే రోజుల్లో పుట్టారు ఆ
> మహానుభావులు.అందుకే వారు మాణిక్యాలుగా మిగిలిపోయారు. ఈ కాలంలో దొంగతనం
> చేయకపోతే పాపంగా భావించేవాళ్ళు కోకొల్లలు. అదే జనావళికి సమ్మతం అని
> బలవంతంగా రుద్దే ప్రయత్నం కూడా చేస్తుంటారు కొంతమంది. అది చాల తప్పు
> అండి.కానీ మొన్న నేను ఆవెశంలో ఆ సమయానికి నచ్చింది అని సుబ్రహ్మణ్యం గారి
> అదే టపాకి సమాధనం రాసాను. అది ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాను.
>
> ఇది కలియుగం కాబట్టి ఇలాగే ఉంటుంది అని ఒక పెద్దాయన ఎవడో జోకాడు. ఆయన
> మొహం మీద ఉమ్మేయాలనిపించింది. పెద్దవాడిగా ఉండి పిల్లలకు నీతి

> చెప్పకపోగా , ఫర్వాలేదులే నీ దొంగతనం నువ్వు చెయ్యి , చేస్తూనే ఉండు -


> కొంతకాలానికి అదే రాజుగారి శాసనం అవుతుంది అని చెపుతున్నాడు ఆయన.
> సిగ్గుండాలి మనిషికి.
>

> సుధాకర్ గారూ - మీరన్నది నిజమే ఇంటర్నెట్టులో తెలుగు వ్యాప్తికి ఎంత
> ఎక్కువ సమాచారం ఉంటే అంత మంచిది. కానీ కొత్త సంపదని తీసుకుని రావటానికి
> ప్రయత్నం చెయ్యాలి కానీ , ఉన్న వాటినే తిప్పి తిప్పి అన్ని చొట్ల కాపీ


> చేసిపెడితే ఉపయోగం ఏమిటి అండి.
>

> ఈ కాలంలో దొరుకుతున్న కన్వర్టర్లతో,ఇలా వెబ్ సైటులు పెట్టుకున్నవారు అంతా
> ఎన్నో సంవత్సరాలు కష్టపడి సేకరించిన సంపదని రెండు నిముషాలలో యూనీకోడులోకి


> మార్చి పడేసి తమవిగా ప్రచురించుకోవటం అతి హేయమయిన పని అని నేను కూడా
> భావిస్తున్నాను.
>

> ఎవరు అంగీకరించకపోయినా ఫరవాలేదు. నా ఉద్దేశ్యం నేను చెప్పెశాను. కానీ


> ఒక్క విషయం - వంశీగారు కానీ మిగిలిన వెబ్ సైటు మాష్టార్లు కానీ వేరే ఎవరు
> కానీ కాపీరైటు గురించి తప్పనిసరిగా ఆలొచించి కొంచెం ఆ దిశగా తమ ప్రయత్నం
> మొదలు పెడతారు అని ఆశిస్తూన్నాను.
>
> ఆయనది విశాల హృదయమే కావచ్చు, లేదా ఇవి ఎలాగూ అరికట్టలేము -పోనిలే అనే

> అసహాయత అన్నా కావచ్చు - కానీ ఇలాంటి చోరీలు అరికట్టకపోతే ముందు ముందు


> పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది అని మటుకు ఖచ్చితంగా చెప్పగలను.
>

> ఈ ఇంటర్నెట్టు చోరీలు, సాహితీ దొంగతనాలు అరికట్టటానికి అందరము సాయాం
> చేస్తారు అని నా విశ్వాసం.

నవీన్ గార్ల

unread,
Apr 24, 2007, 8:16:12 AM4/24/07
to తెలుగుబ్లాగు
వామ్మో...ఇంత హాటు హాటు డిబేటును ఎలా మిస్సయ్యాను. ఇప్పుడు నేను దీని మీద
ఏమి వ్యాఖ్య వ్రాసినా...గత 35 పోస్ట్ల నుంచి కాపీ చేశానంటారు ;)
ఉండబట్ట లేక మాగంటి వారికి "ఉచిత" సలహా ఇస్తున్నా....ఎలాగూ జనాలు కష్టపడి
మీ రచనల్ని యూనీకోడులోకి మార్చేశారు కదా. మీరు మళ్ళీ వాటిని
తీసుకొని..మీసైటును యూనీకీడీకరించండి. దీన్ని "వ్రతం చెడ్డా ఫలితం
దక్కడం" అనాలా?
- నవీన్ గార్ల


మధు Vraasenu:

kotta pali

unread,
Apr 25, 2007, 6:47:42 AM4/25/07
to telug...@googlegroups.com
I support this idea fully - it's a pain to depend on PDFs unendingly.

Maganti garu, vintunnArA?


Ahhh...imagining that irresistible "new car" smell?
Check out new cars at Yahoo! Autos.

Kiran Kumar Chava

unread,
Apr 25, 2007, 6:52:25 AM4/25/07
to telug...@googlegroups.com
I will also be happy to see maagaMTi org in UNICODE. As I don't read any Telugu other than UNICODE on net, I am not reading this site :(
 
Thanks and Regards,
Kiran Kumar Chava
--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా

Prasad Charasala

unread,
Apr 25, 2007, 9:46:16 AM4/25/07
to telug...@googlegroups.com

కాపీ చేసుకునే వాళ్ళకి కూడా శ్రమ తప్పించిన వారవుతారు! :)

--ప్రసాద్
http://blog.charasala.com

 

 



--
Prasad
http://blog.charasala.com
Reply all
Reply to author
Forward
0 new messages