దేశద్రోహి కన్నీటి చుక్క

2 views
Skip to first unread message

cbrao

unread,
May 8, 2007, 1:36:02 PM5/8/07
to telug...@googlegroups.com

కొండేపూడి నిర్మల గారు,

పై కవితలో
http://prajakala.org/mag/2007/05/nirmala_maypoem

మీరు రాసిన
"మెజారిటీ భావావేశాలకు భిన్నంగా కుమిలిపోయే
ఈ దేశద్రోహి కళ్ళనుండి పారిపోండి
మువ్వన్నెల జెండా పడగ నీడలో కన్నుమూసిన
నా సహచరుడి స్ఫూర్తితో తప్పించుకు పొండి"
ఇందులో "మువ్వన్నెల జెండా పడగ నీడలో" అనే పద ప్రయోగానికి అర్థం చెప్పగలరా? అలా చెప్పవలసిన అవసర మేమిటి?

-cbrao


 

Prasad Charasala

unread,
May 8, 2007, 2:09:35 PM5/8/07
to telug...@googlegroups.com

రావు గారూ,
గుజరాత్ లో భూటకపు ఎన్‌కౌంటరులో చనిపోయిన సొహ్రాబుద్దీన్ "మువ్వన్నెల జెండా పడగ" కాటుకే కదా బలయ్యింది.
బహుశా నిర్మల గారు అలాంటి వాటి గురించే చెబుతున్నారనుకుంటానిక్కడ.

--ప్రసాద్
http://blog.charasala.com

--
Prasad
http://blog.charasala.com

రవి వైజాసత్య

unread,
May 8, 2007, 3:20:54 PM5/8/07
to తెలుగుబ్లాగు
పోలీసు కళంకాన్ని దేశానికి ఆపాదించడమెంత సమంజసం?


drchinthu

unread,
May 8, 2007, 10:57:51 PM5/8/07
to తెలుగుబ్లాగు

సామాన్య ప్రజానీకం దృష్టిలో ప్రభుత్వం అంటే పోలీసు కాబట్టి...ఇక్కడ జెండా
ప్రభుత్వాన్ని సూచిస్తుంది దేశాన్ని కాదేమో...
(నా దేశభక్తిని శంకించవద్దని మనవి!)
అన్నట్ట్టు చెప్పడం మరచాను...రవి గారూ 'శుభాకాంక్షలు' మాలో చేరినందుకు!!!

surya...@gmail.com

unread,
May 9, 2007, 12:06:12 AM5/9/07
to తెలుగుబ్లాగు
మువ్వన్నెలు ఒక్క జాతీయ జెండాలో మాత్రమే ఉంటే
ఆ వన్నెలను జాతి మొత్తం గౌరవమిస్తుంది.

స్వార్ధం‌తో ఒక రాజకీయ పార్టీ తన వన్నెలనే
జాతీయ వన్నెలుగా మార్చి, అవే వన్నెలను తమ పార్టీకి కూడా వాడుకుంటూ,
సామాన్య మానవునకు అవి పార్టీ వన్నెలో, జాతీయ వన్నెలో తెలియక
తికమకమవుతుంటే
ఇక జాతీయ వన్నెలకీ, ఆ జెండాకి గౌరవం ఏముంటుంది ఈ దేశం‌లో!

> > పోలీసు కళంకాన్ని దేశానికి ఆపాదించడమెంత సమంజసం?- Hide quoted text -
>
> - Show quoted text -

సత్యసాయి కొవ్వలి

unread,
May 9, 2007, 2:34:06 AM5/9/07
to తెలుగుబ్లాగు
పైన వ్యాఖ్యలు వ్రాసిన వాళ్ళందరూ దయచేసి ఒక్క సారి ఆ కవిత సాంతం చదివి
ఆనక ఇంకో వ్యాఖ్య తప్పక వ్రాయండి.
ఆ కవిత ఒక ముస్లిం సైనికుడి వితంతు భార్య ఆవేదన. అది కాంగ్రేస్ జండాకి,
దేశ జండాకి ఉన్న పోలిక వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ గురించి కాదు. గుజరాత్
సోహ్రూద్దీన్ గురించికాదు, పోలీసుజులుం గురించి కాదు. ఒక వ్యక్తిగా
ఆమెకి ఎలాగైనా ఆవేదన పడే అర్హత ఉంది. కాని ఒక కవి ఆ ఆవేదనకి అక్షర రూపం
ఇచ్చేటప్పుడు సామాజిక బాధ్యతని విస్మయించకూడదని నా అభిప్రాయం. నిర్మల
గారి కవిత అందులో ని పదప్రయోగాలూ అబాధ్యతగా ఉన్నాయనడంలో సందేహంలేదు.
అసలే ఒక పక్క ముస్లింలు జాతీయజీవనస్రవంతిలోంచి పక్కకి వెళ్ళిపోతున్నారని
(వెళ్ళగొట్టబడుతున్నారని) అంటూన్న నేపధ్యంలో ఇలాటి కవితలు ఎలాంటి భావనలని
కలగచేస్తాయో ఆలోచించండి. అసలే మన నాయకులు ప్రజల్ని రెచ్చకొట్టడమే పనిగా
పెట్టుకున్నారాయెను. ఆవిడ, మతప్రస్తావన లేకుండా, ఒక సైనికుడి భార్య
ఆవేదనగా ఆ కవితని మలిచినా కొంత వరకు బానే ఉండేది. అప్పుడు కూడా, ఇలాటి
కవితలు ప్రతికూలభావనలు (నెగెటివ్ థాట్స్) కలిగించే అవకాశమే ఎక్కువ.
కవిత్వాల ప్రయోజనం కవి భావ వ్యక్తీకరణే కాని దాని పర్యవసానంతో
పనిలేదా?

surya...@gmail.com Vraasenu:

Prasad Charasala

unread,
May 9, 2007, 10:09:42 AM5/9/07
to telug...@googlegroups.com

నాకైతే ఇందులో నెగటివ్ భావనలు కలిగించేదేముందో అర్థం కావట్లేదు.
అసలు ఏ వుద్దేశ్యంతో ఆ పదం వ్రాశారన్నది రచయిత్రి చెబితే తప్ప మనకు అర్థం కాదు. మనం ఎన్ని రకాలుగానైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు.
మనకు కల్పవృక్షం నీడలా అంపించేది ఇంకొకరికి పాము పడగ నీడలా అనిపించొంచ్చు. అందుకు కారణాలేమిటో చూడాలిగాని అసలలా అననే వద్దు అంటే ఎలా?
అయినా మన ఈ వాదోపవాదాలు అక్కడే ప్రజాకళలోనే చేస్తే బాగుంటుందేమొ!

--ప్రసాద్
http://blog.charasala.com



> On May 9, 7:57am, drchinthu <drchin...@gmail.com> wrote:
> > సామాన్య ప్రజానీకం దృష్టిలో ప్రభుత్వం అంటే పోలీసు కాబట్టి...ఇక్కడ జెండా
> > ప్రభుత్వాన్ని సూచిస్తుంది దేశాన్ని కాదేమో...
> > (నా దేశభక్తిని శంకించవద్దని మనవి!)
> > అన్నట్ట్టు చెప్పడం మరచాను...రవి గారూ 'శుభాకాంక్షలు' మాలో చేరినందుకు!!!
> > On May 8, 3:20pm, "రవి వైజాసత్య" < vyzasa...@gmail.com> wrote:
> >
> >
> >
> > > పోలీసు కళంకాన్ని దేశానికి ఆపాదించడమెంత సమంజసం?- Hide quoted text -
> >
> > - Show quoted text -




--
Prasad
http://blog.charasala.com

cbrao

unread,
May 9, 2007, 11:35:49 AM5/9/07
to telug...@googlegroups.com
ప్రజా కళ discussion forum కాదు. అది ఒక web magazine మాతమే.

Prasad Charasala

unread,
May 9, 2007, 2:12:34 PM5/9/07
to telug...@googlegroups.com

బ్లాగుల్లో మన వాదనలు వినిపిస్తున్నాం కదా అలాగే అక్కడానూ!

--ప్రసాద్
http://blog.charasala.com



--
Prasad
http://blog.charasala.com

Kiran Kumar Chava The Oremuna

unread,
May 10, 2007, 12:44:00 AM5/10/07
to తెలుగుబ్లాగు
అవును ఈ వాదోపవాదములు అక్కడే ప్రజాకళలో చేస్తే బాగుంటుంది.

కానీ అక్కడ కూడా చిన్న సమస్య ఉన్నది, అది మోడరేటెడ్ కామెంట్సు స్వేచ్చ
లేదు :(

NagarajaT (నాగరాజా)

unread,
May 10, 2007, 1:13:11 AM5/10/07
to తెలుగుబ్లాగు
మోడరేటెడ్ ప్రజా కళ? :) అది కొండేపూడి నిర్మల గారి కన్నీటి చుక్క...
క్షమించు అబ్బాజాన్

On May 10, 12:44 am, Kiran Kumar Chava The Oremuna

Sudhakar S

unread,
May 10, 2007, 4:42:55 AM5/10/07
to telug...@googlegroups.com
రాసిన వ్యాఖ్యలు కూడా తొలగింపబడ్డాయి ఈ సైట్ లో ....

On 5/10/07, NagarajaT (నాగరాజా) <naga...@gmail.com> wrote:
మోడరేటెడ్ ప్రజా కళ? :) అది కొండేపూడి నిర్మల గారి కన్నీటి చుక్క...
క్షమించు అబ్బాజాన్

On May 10, 12:44am, Kiran Kumar Chava The Oremuna
<chavaki...@gmail.com> wrote:
> అవును ఈ వాదోపవాదములు అక్కడే ప్రజాకళలో చేస్తే బాగుంటుంది.
>
> కానీ అక్కడ కూడా చిన్న సమస్య ఉన్నది, అది మోడరేటెడ్ కామెంట్సు స్వేచ్చ
> లేదు :(






--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Prasad Charasala

unread,
May 10, 2007, 7:54:50 AM5/10/07
to telug...@googlegroups.com

అయ్యో! అవునా? అయితే మనకిష్టమొచ్చిన చోట మన అభిప్రాయాలు పంచుకోవడంలో తప్పులేదు. అసభ్యంగా /spam వుంటే తప్ప ఏ కామెంటునీ తొలగించవసరం లేదు అన్నది నా అభిప్రాయం. ఎవరినైనా ఏమైనా చెప్పనివ్వాలి. చదివిన వారే దాని విలువను నిర్ణయించుకుంటారు.

--ప్రసాద్
http://blog.charasala.com



--
Prasad
http://blog.charasala.com

ammadu

unread,
May 11, 2007, 1:34:20 AM5/11/07
to తెలుగుబ్లాగు

" దేశ ద్రోహి కన్నీటి చుక్క"కు స్పందించిన వారందరికీ ధన్య వాదాలు.
నా చిన్నప్పుడు "పాకిస్టాన నీ పిలక పీకిస్తాను"అనే పాట పాడుతూ నా కు
నచ్చని వాల్లందరిని అలాగే పిలిచె దాన్ని.

మా బంధువులల్లో ఒక ఆవిడని ఏవొ చిన్న ఆస్తి తగాదాల కారణం గా చైనా భూతం అని
పిలుస్తారు ఇప్పటికీ.
క్రికెటు కామెంట్రీ చదివండి ,వాళ్ళూ ఓడినప్పుడు మట్టి కరిచారని ,మనం
ఓడినప్పుడు కాలు నొప్పి వల్ల గెలవ లేక పోయామని మీడియా వార్తలు రాస్తుంది.
ఒక దేశాన్ని/జాతిని/కులాన్ని/ప్రాతీయాన్ని గురించి ద్వేషం ఇలా ఉగ్గు
పాలతొ రంగరించి పోయడం ఒక నాగరికతగా మనం ఒప్పుకుంటున్నాం.

మరి రాగ ద్వేషాలతో సంబంధం లేకుండా అన్ని యుద్ధాల లోనూ బలవుతున్నది
స్త్రీలు.
గెలుపు ఓటమి లతో కాకుండా కేవలం ఫలితాలు భరిస్తున్నదీ వీళ్ళే.
మొన్న గుజరాత హింసలో ఒక రాజ్యం ఒక మతం చట్టబద్ధంగా చేసిన హింస మీరు చూసే
వుంటారు.అటువంటి మంత్రై గొప్ప పాలకుడు గా బహౌమతి పొందడం కూడా మీకు
తెలుసు.
28 మంది రచయితలం కలిసి ఆ భీభత్సాలు చూసి వచ్చాం.
ముస్లిమ కవయిత్రి షాజహానా తన కవితలో అంటుంది.
;నా మొగవాడూ,నా దేవుడే బాధిస్తున్నాడనుకుంటే
ఇప్పుడు నీ మగవాడూ నీ దేవుడూ కూడానా...."అక్కడి అత్యాచారానికి గురయిన
వాళ్ళ స్వరంలో...

దేశభక్తులు /మువ్వన్నెల జెండాలు ఎవరికి కల్ప వ్రుక్షాలవుతున్నాయో గాని
ఒక యుద్ధ వితంతువుకి ఇంకోలా కనిపీం చవచ్చు.

కాబట్టి ప్రియ మిత్రులారా నాకవితని దాని వాస్తవ నేపధ్యం లో అర్ఢం
చేసుకోండి.
రాజ కీయాలు ముడి పెట్ట వద్దు.
నిజానికి ఆ కవిత పంపడానికి ముందు నేను ఎడిట చేసిన పాదాలు కొన్ని
వున్నాయి.అవి కూడా చదవండి.
"ఎత్తుకెళ్ళిన వెండి కిరీటాల, బాణాల, కత్తెర్ల లాఘవంతో
హుస్సేను సాగరపు టొడ్డున పౌరాణిక క్రిష్ణుడున్న చోట
ఆయుధాలు కుంభకకోణం చేసిన వాడి అమాంబాపతు వంశక్రీడలే
త్యాగధనుల చరిత్ర పుటలుగా చదువుకుంటున్న చోట
పెదవులున్న వాళ్ళంతా మాట్లాడుతారా?
హక్కులున్న వాళ్ళంతా ఆత్మ హననాల్నించి తప్పించు కుంటారా?"

Sudhakar S

unread,
May 11, 2007, 3:36:44 AM5/11/07
to telug...@googlegroups.com
ఎంత చక్కగా చెప్పారు :-) ఇప్పుడు అర్ధం అయ్యింది.

కుహానా దేశ భక్తులు, కుహానా ధర్మ వుద్ధారకులు , జాతి పోలీసులు ఎప్పుడు తగ్గితే అప్పుడు ఈ దేశం భారత దేశంగా హృదయాలనుంచి గుర్తించబడుతుంది.
Reply all
Reply to author
Forward
0 new messages