ఏమి చెరరా శౌరి
ఎంత చెరరా!
ఏటికీ శాపమో
ఏనాటి పాపమో
ఈ వెర్రి శతాబ్దిలో
చిక్కుపడితిని నేను.
ఈ జనులు ఎవరోయి?
వీరెవరు నావారు కారోయి!
ఎవ్వరిని ఎరుగను నేను;
చూడ, నా బాహ్యమతి అధునాతనము
అంతరంగమేమొ అతి పురాతనము;
ఆత్మసఖుడవు నీవు
నీదు అతివను నేను
కృష్ణ! నిన్ను చేరేటి తీరేది
వెనుక జన్మకు దారేది
ఎంత వెదకిన గాని యమున తటి రాదేమి?
కల్ల లోకమేది?
నీవు కలలోక మేది?
గొల్లవాడా! చెప్పవటరా!
lyla
PS: Satya! Go ahead, tell me I am looking in the wrong city, for the
wrong guy.
I am only attempting to type a poem, using an unfamiliar key board,
and instructions in Italian, trying to beat the timer, and mail my
post before the time is up.
------------------------------------
To Post a message, send it to: racch...@yahoogroups.com
Courtesy: http://www.kanneganti.com/
Lyla gAru,
Enjoyed the nice verse.
First, I thought you meant "flute" player, as lute is a stringed,
not wind instrument. But, this sounds better. Who could be a better
lute player bringing out of so many hearts' strings so much of joy?!
That too, in these days when news tirelessly keeps telling how often
a handsome prince turns into a toad, instead of other way around!
ఎందుకో శ్రీ నరాల రామి రెడ్డి గారి ఈ పద్యం గుర్తుకొచ్చింది.
[Courtesy: శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ గారి
"అవధాన విద్య - ఆరంభ వికాసాలు"]
అవధానంలో సైతం ఇట్లాంటి పద్యాన్ని చెప్పారా అని ఆశ్చర్యం,
అయినా అక్షర సత్యం!
సీ. నీలాల గగనాల నిగ్గులూరెడు నీదు
కురులలో ఫించమై కులుక లేను
తేనెసొనలు పూలవానలు కురిపించు
మోవిపై వలపుల మురళి కాను
సిరికన్నె నెలకొన్న వరవక్షమున వెల్గు
కౌస్తుభ రత్నమ్ము గాకపోతి
చెంగుచెంగున దూకు చిన్ని పాదమ్ముల
చిన్నారి గడ్డినై చేరనైతి
తే. పచ్చికనుదిని స్వేచ్చగ పరుగు దీయు
సాధ్వియగు గోవుగా పుట్ట జాల నైతి
నేమి కాకుండ నిట్టుల నేడ్చు కొనుచు
విరహ వహ్నిలో బడినేను వేగి పోతి
-------------------------------------
విధేయుడు
-Srinivas