పూవుల ప్రోవులు

11 views
Skip to first unread message

Dr. J. K. Mohan Rao

unread,
May 4, 2003, 9:19:24 PM5/4/03
to chan...@yahoogroups.com, racch...@yahoogroups.com

పూవుల ప్రోవులన్ దినము పూజలు సేతు స్మరించి, యో హరీ,
రావలె నా గృహమ్మునకు, రంజిల జేతును, హృద్య పద్య సం-
భావన లిత్తు, సల్లలిత భావ పరాగము లద్భుతమ్ముగా
తావుల జిమ్మ, రాగ సుధ త్రాగుద ముల్లము లుల్లసిల్లగా

శ్రీ హరి పూజకు ఎన్ని విచిత్ర కుసుమాలో!

కుసుమస్తబక - సగణయుక్త దండకము
కుసుమలతావేల్లితా - మ-త-న-య-య-య (1, 12)
కుసుమవిచిత్ర - న-య-న-య (1, 7)
కుసుమ - న-భ-న-న్హ-న-న-న-ల-గ (1, 13)

శ్రీ హరి మనోల్లాసమునకు ఎన్ని పుష్పాలో!

పుష్పదామ - మ-త-న-స-ర-ర-గ (1, 6, 13)
పుష్పితాగ్ర - సూచన 1
జాజిపుష్ప - సూచన 2

శ్రీహరి పాదపద్మాలకు ఎన్ని పద్మాలో!

అంబురుహము - భ-భ-భ-భ-ర-స-ల-గ (1, 13)
(అభినవ) తామరస - న-జ-జ-య (1, 8)
సరసిజ - మ-త-య-న-న-న-న-స (1, 10, 18)
సరసిజ - భ-స-గ
పద్మ - స-స-స-జ-గ (1, 9)
పంచకమల - భ-య-స-గ-గ (1, 7)
అంబుజ - భ-ర
నలిని - స-స-స-స-స (1, 10)
సరోజ - ర-స-ల-గ
జలజ - భ-ర-న-భ-గ (1, 10)
కమలవిలసిత - న-న-న-న-గ-గ (1, 9)
పద్మక - న-భ-జ-జ-జ-గ (1, 8)
వనరుహ - మ-స-భ-భ-న-న-న-న-గ (1, 11, 19)

శ్రీహరి కంఠ శోభకు ఎన్ని మాలలో!

ఉత్పలమాల - భ-ర-న-భ-భ-ర-ల-గ (1, 10)
చంపకమాల - న-జ-భ-జ-జ-జ-ర (1, 11)
నీలోత్పలమాల - మ-త-య
చంపకమాలి - భ-మ-స-గ (1, 6) (ఇది రుక్మవతికి ఇంకొక పేరు)
పద్మమాల - ర-ర-గ-గ
మల్లికామాల - ర-స-జ-జ-భ-ర (1, 11) (మత్తకోకిలకు ఇంకొక పేరు)
కుందమాల - న-జ-భ-న-స-స-జ-గ (1, 11) (దీనికి మరొక పేరు
పొగడసరము)
మల్లెలమాల - భ-ర-న-న-జ-జ-ర (1, 10)

శ్రీహరి నందవనిలో ఎన్ని ప్రసూనాలో!

ఏలా - స-జ-న-న-య (1, 6)
అశోకమంజరి - ర-జ గణములతో దండకము
కలిక - సూచన 3
మకరందిక - య-మ-న-స-జ-జ-గ (1, 7, 13)
మంజరి - స-జ-స-య-ల-గ (1, 6)
మాలతి - న-న-ర-య-య (1, 9)
వసంతతిలక - త-భ-జ-జ-గ-గ (1, 8)
లవలీ - సూచన 4
మంజుసౌరభ - సూచన 5
కిసలయవృత్త - స-స
వల్లీ - స-య-జ-త-గ (1, 8)
మందారదామ - త-త-త-గ-గ (1, 7)
పున్నాగ - భ-ర-న-మ-య-ల-గ (1, 11)
చంపకకేసరి - స-జ-స-స-స-ల-గ (1, 9)
గులాబి - భ-భ-భ-ర-స-స (1, 10)
వనమంజరి - న-జ-జ-జ-జ-భ-ర (1, 14)
తరువోజ - ఇం-ఇం-ఇం-సూ-ఇం-ఇం-ఇం-సూ (1.1, 3.1, 5.1, 7.1)
సురలతా - న-య
లతా - న-య-న-న-గ (1, 7)
సురభూజరాజ - న-భ-ర-న-న-న-ర (1, 12)
కనకలతిక - న-న-న-న-న-న-న-గ (1, 13)
కనకలత - న-న-న-న-న-న-న-స (1, 13)
మంజరీకావలి - య-మ-మ-ర-గ
విపినతిలక - న-స-న-ర-ర (1, 7)
మల్లికా - ర-జ-గ-ల (సమానికకు మరొక పేరు)

సూచన 1-
పాదములు 1, 3 - న-న-ర-య
పాదములు 2, 4 - న-జ-జ-ర-గ

సూచన 2-
జాజిపుష్పము-
పాదములు 1,3,4 - ర-ర-జ-న-న-గ-గ (1, 10)
పాదము 2 - ర-ర-జ-న-న-య (1, 10)

సూచన 3-
కలి(ళి)క-
పాదము 1 - న-య-ర-న-భ-జ-భ-గ (1, 13)
పాదము 2 - స-భ-న-జ-త-జ-న-స (1,14)
పాదము 3 - స-భ-ర-జ-న-న-న-స (1, 12)
పాదము 4 - న-జ-జ-న-త-జ-జ-ల-గ (1, 14)

సూచన 4-
లవలీ-
పాదము 1 - 12 అక్షరములు (చివర రెండు గురువులు, మిగిలినవి లఘువులు)
పాదము 2 - 16 అక్షరములు (చివర రెండు గురువులు, మిగిలినవి లఘువులు)
పాదము 3 - 8 అక్షరములు (చివర రెండు గురువులు, మిగిలినవి లఘువులు)
పాదము 4 - 20 అక్షరములు (చివర రెండు గురువులు, మిగిలినవి లఘువులు)

సూచన 5-
పాదములు 1, 3 - న-జ-జ-ర
పాదములు 2, 4 - స-జ-య-జ-గ

పూవుల, తీగల, తరువుల, లతల పేరులతో నున్న వృత్తాదులను
సేకరించి ఒకే చోట ఇచ్చినాను. ఇవి వృత్తరత్నాకరము, ఛందస్
శాస్త్రము, కవితాసాగరము నుండి గ్రహింపబడినవి.

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

Courtesy: http://www.kanneganti.com/

Reply all
Reply to author
Forward
0 new messages