[racchabanda] సాహిత్యములో ప్రార్థ కుసుమాలు - 24

61 views
Skip to first unread message

J. K. Mohana Rao

unread,
Aug 14, 2007, 8:06:38 PM8/14/07
to chan...@yahoogroups.com, racch...@yahoogroups.com

సాహిత్యములో ప్రార్థనా కుసుమాలు - 24

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

జయ జయ సస్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
... జయ జయ జయ

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
... జయ జయ జయ

- దేవులపల్లి కృష్ణశాస్త్రి, విజయభారతి (1)

ఆగస్ట్ 15, 2007 భారతస్వాతంత్ర్య వజ్రదినోత్సవము.
ఈ సమయములో పై గీతము ఎంతయో సమంజసమైనది.
ఇది మాత్రాబద్ధమైన ఒక సుందర గీతము. ఇందులో కవి
భారత దేశాన్ని తన జననిగా భావించి గీతాకుసుమాన్ని ఆమె
చరణాలకు అంకితము చేసినారు. అందుకే రామాయణములో
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అంటాడు
లకష్మణుడు. తల్లి, తల్లి భూమి స్వర్గానికన్న తీపియైనది
కదా!

ఆమె భూదేవి. ఆమె లక్షలాది స్త్రీపురుషుల హృదయాలకు
కళ్ళవంటిది. ఆమె చీరచెరగు మంచి పండిన పైరుకున్న
ముదురు ఆకుపచ్చని రంగు గలిగినది. ఆమె అలకలు
వసంతఋతువులో విరిసిన పుష్పాలతో కదలాడుచున్నది. ఆమె
అడుగుదోయి నా హృదయములోని కోర్కెల లత్తుకతో ఎర్రగా నున్నవి.
దశదిశలలో ఆమె కీర్తులను పక్షులు పాడగా ఆమె తృప్తి
బొందినది. గాయకులు, వందిమాగధుల కంఠాలలో ఆమె విహరిస్తుంది.
ఆమె సొగసైన పాదాలను నా మధురగీతిక ముద్దు పెట్టుకొంటుంది.
అట్టి కన్న తల్లికి జయము కలుగుగాక అని ఈ మధురగీతికను ఆలాపిస్తారు
శాస్త్రిగారు.

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



____________________________________________________________________________________
Looking for a deal? Find great prices on flights and hotels with Yahoo! FareChase.
http://farechase.yahoo.com/


To Post a message, send it to: racch...@yahoogroups.com

Courtesy: http://www.kanneganti.com/

Reply all
Reply to author
Forward
0 new messages