అక్షరాలను లెక్కించడానికి ఒక పెర్లు స్కరిప్టు

13 views
Skip to first unread message

Rakesh Achanta

unread,
Jul 1, 2009, 9:04:20 AM7/1/09
to సంగణన

తెలుఁగులో ఇంచుమించుగా వాడబడే అక్షరాలు ఎన్ని వాటిని ఎంత తఱచుగా వాడతారు, అన్నది కనుగోడానికి ఒక పెర్లు స్కరిప్టు వ్రాసాను.

దీనిని
counter.tel.pl 0 <సంచయంపేరు>
అని పరుగెత్తిస్తే,
అది ఆ సంచయంలో (directory) ఉన్న txt, htm(l) ఫైళ్ళను తెఱచి వాటిలోని అక్షరాలను కనుగొని
ఒక్కొక్క అక్షరం ఎన్నిసార్లు వచ్చిందో చెబుతుంది.

నేను దీనిని బ్రౌను నిఘంటువు మీద నడిపాను. వచ్చిన ఫలితాలను అతికించిపంపుతున్నాను.

## వాడుక ##
# ఉభయాక్షరాలను ప్రత్యేకఅక్షరాలుగా భావించరాదు అనుకున్నప్పుడు
# counter.tel.pl 0 సంచయంపేరు
# ఉభయాక్షరాలను ప్రత్యేకఅక్షరాలుగా భావించరాదు అనుకున్నప్పుడు
# counter.tel.pl 1 సంచయంపేరు


counter.pl ఆంగ్లంలో వుంది, (తెలుగులో వ్యాఖ్యలు మాత్రమేవున్నాయి)  utf-8 పత్రి (file)
counter.tel.pl పూర్తిగా తెలుగులో వ్రాయబడ్డది! utf-8 పత్రి (file)
lc_brown_0.csv   బ్రౌణ్యంలో తెలుగు అక్షరాల పట్టి వాటి పౌనఃపున్యం (ఉభయక్షరాలు ప్రత్యేక అక్షరాలు కాదు)
lc_brown_1.csv   బ్రౌణ్యంలో తెలుగు అక్షరాల పట్టి వాటి పౌనఃపున్యం (ఉభయక్షరాలు ప్రత్యేక అక్షరాలు)


మీ రాకేశ్వర.
counter.pl
counter.tel.pl
lc_brown_0.csv
lc_brown_1.csv
Message has been deleted

Srinivasa Raju Datla

unread,
Jul 1, 2009, 9:16:21 AM7/1/09
to telugu-c...@googlegroups.com
భలే భలే బాగుంది!  ఫంక్షన్స్, వేరియబుల్స్ కూడా తెలుగులో చూస్తుంటే ముచ్చటగా ఉంది :-)
ఇంతకు ముందు తెలుగు వికీపీడియాలో ఎక్కువగా కనిపించే అక్షరం కోసం మాకినేని ప్రదీపు పైథానులో ఒక స్క్రిప్టు రాసినట్టు గుర్తు.

2009/7/1 Rakesh Achanta <rake...@gmail.com>

Sri Raghava Kiran Mukku

unread,
Jul 1, 2009, 9:18:42 AM7/1/09
to telugu-c...@googlegroups.com
రాకేశా

భలే భలే భలే.

పెర్లు పేర్లు తెలుగులో కూడా పెట్టుకోవచ్చా? ఔనూ, ఇంతకీ బ్రౌణ్యంలో ఎన్ని పదాలకిష ఈ లెక్ఖలూ?

రాఘవ

Rakesh Achanta

unread,
Jul 1, 2009, 9:28:04 AM7/1/09
to సంగణన
ఎన్ని పదాలకో తెలియదు. అది కనుగోవాలంటే వేఱే లిపి వ్రాయాలి :( అది వ్రాసే ఓపిక లేదు.
ఇదే కొద్దిగా అనవసర ప్రయాస . పనిలేని ప్రోగ్రామరు తెలుగులో ప్రోగ్రాములు వ్రాసాడఁట. :)

నేను లెక్కించింది మాత్రం, ఈ పుటనుండి మొదలయ్యే బ్రౌణు నిఘంటువు -
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1&table=brown&display=utf8

- రాకేశ్వర

2009/7/1 Sri Raghava Kiran Mukku <msrk...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages