తెలుఁగు సాహిత్యంలో శకములు కావాలి

8 వీక్షణలు
మొదటి చదవని మెసేజ్‌కు స్కిప్ చేయి

రాకేశ్వర రావు

చదవనివి,
21 నవం, 2009 11:28:43 AM21-11-09
వరకు సాహిత్యం గుంపు,తెలుఁగు వికీ గుంపు

వికీమూలాలకై, నాకు తెలుగు సాహిత్యంలో శకాలు కావలెను.
ఉదా - 1900 తరువాత ఆధునిక
1600-1900 ప్రబంధ
వంటివి వున్నాయి కాదా..

ఆంగ్లంలో ఇవి ఇలా వున్నాయిట. మఱి అలా స్టాండర్డుగా పెట్టుకున్నట్టున్నారు.
>1900|Modern|
>1631|Early modern|
>1420|Renaissance|
>601|Medieval|
|Ancient

నేను వీటిని ఎందుకు వాడుతున్నానంటే,
http://en.wikisource.org/wiki/Template:What_era_is
ఈ మూసని తెనుగీకరిస్తున్నాను.
http://te.wikisource.org/w/index.php?title=మూస:ఏ_శకము

ప్రస్తుతానికి ఏవో పెడుతున్నాను గానీ, మీ సలహాలు చాలా ఉపయోగపడతాయి.

రాకేశ్వర


తాడేపల్లి T.L. Bala Subrahmanyam

చదవనివి,
21 నవం, 2009 12:28:44 PM21-11-09
వరకు sahi...@googlegroups.com
తెలుగుసాహిత్యంలోని యుగవిభజన విషయంలో విమర్శకుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఒక్కొక్కఱూ ఒక్కొక్కరకంగా విభజించారు. కానీ అది స్థూలంగా ఇలా ఉంటుంది.

ప్రాఙ్నన్నయ యుగము (క్రీ.శ.1 నుండి 1000 వఱకు)
నన్నయయుగము (క్రీ.శ.1000 నుండి 1225 వఱకు)
తిక్కనయుగము (1225 -1400)
శ్రీనాథయుగము (1400 - 1500)
ప్రబంధయుగము (1500 - 1650)
దక్షిణాంధ్రయుగము (1650 - 1800)
ఆధునికయుగము (1800 -        )

ఇక్కడ నేనిచ్చిన సమాచారంలోని కాలఖండాల్లో కొంచెం హెచ్చుతగ్గులుండవచ్చును కనుక సరిపుచ్చుకోవలసిందిగా ప్రార్థన.

పై కాలఖండాల్లో నన్నయ్య దగ్గర్నుంచి శ్రీనాథుడి దాకా ఉన్న 500 సంవత్సరాల కాలఖండాన్ని అనువాదయుగం పేరుతో ఒకే యుగంగా పరిగణించేవారున్నారు. నన్నయ్యకీ తిక్కనకీ మధ్య శివకవియుగమని ఇంకో యుగాన్ని జత చేర్చినవారున్నారు. ఇవేవీ కాక ఆయా రాజవంశాల్ని బట్టి యుగవిభజన చేసినవారున్నారు.

విపుల సమాచారం కొఱకు ఏదైనా తెలుగు సాహిత్యచరిత్ర గ్రంథాన్ని సంప్రదించగలరు.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

రాకేశ్వర రావు

చదవనివి,
22 నవం, 2009 7:46:02 AM22-11-09
వరకు సాహిత్యం

నెనర్లు బాలసుబ్రహ్మణ్యంగారు,
ఇలాంటి వర్గాకరణే సంస్కృత రచయితలకు కృతులకూ దొరుకుతుందా?

-రాకేశ్వర

On Nov 21, 10:28 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam


<subtadepa...@gmail.com> wrote:
> తెలుగుసాహిత్యంలోని యుగవిభజన విషయంలో విమర్శకుల మధ్య ఏకాభిప్రాయం లేదు.
> ఒక్కొక్కఱూ ఒక్కొక్కరకంగా విభజించారు. కానీ అది స్థూలంగా ఇలా ఉంటుంది.
>
> ప్రాఙ్నన్నయ యుగము (క్రీ.శ.1 నుండి 1000 వఱకు)
> నన్నయయుగము (క్రీ.శ.1000 నుండి 1225 వఱకు)
> తిక్కనయుగము (1225 -1400)
> శ్రీనాథయుగము (1400 - 1500)
> ప్రబంధయుగము (1500 - 1650)
> దక్షిణాంధ్రయుగము (1650 - 1800)
> ఆధునికయుగము (1800 -        )
>
> ఇక్కడ నేనిచ్చిన సమాచారంలోని కాలఖండాల్లో కొంచెం హెచ్చుతగ్గులుండవచ్చును కనుక
> సరిపుచ్చుకోవలసిందిగా ప్రార్థన.
>
> పై కాలఖండాల్లో నన్నయ్య దగ్గర్నుంచి శ్రీనాథుడి దాకా ఉన్న 500 సంవత్సరాల
> కాలఖండాన్ని అనువాదయుగం పేరుతో ఒకే యుగంగా పరిగణించేవారున్నారు. నన్నయ్యకీ
> తిక్కనకీ మధ్య శివకవియుగమని ఇంకో యుగాన్ని జత చేర్చినవారున్నారు. ఇవేవీ కాక ఆయా
> రాజవంశాల్ని బట్టి యుగవిభజన చేసినవారున్నారు.
>
> విపుల సమాచారం కొఱకు ఏదైనా తెలుగు సాహిత్యచరిత్ర గ్రంథాన్ని సంప్రదించగలరు.
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly

> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

చదవనివి,
22 నవం, 2009 8:01:06 AM22-11-09
వరకు sahi...@googlegroups.com
దొఱుకుతుంది. ముదిగొండ దంపతులు (ముదిగొండ సుజాతారెడ్డి అనే పేరొకటే గుర్తుంది) రచించగా తెలుగువిశ్వవిద్యాలయంవారు ప్రచురించిన సంస్కృతసాహిత్యచరిత్ర అనే ఉద్‌గ్రంథాన్ని చూడగలరు.

Dr.R.P.Sharma

చదవనివి,
22 నవం, 2009 10:06:55 AM22-11-09
వరకు సాహిత్యం
తెలుగు సాహిత్యంలోని యుగవిభజనకు ఆంధ్రవాఙ్మయచరిత్ర ఉపయోగపడుతుంది.
మీకు కావాలంటే అవి ఆన్‌లైన్‌లో చదవడానికి,దిగుమతికి కింద చిరునామాల్లో
లభిస్తాయి.
అవి:-
1. ఆంధ్రవాఙ్మయచరిత్రము - దివాకర్ల వేంకటావధాని
http://teluguthesis.com/index.php?showtopic=998

2. ఆంధ్రవాఙ్మయచరిత్ర - కాశీనాథుని నాగేశ్వర్‌రావు
http://teluguthesis.com/index.php?showtopic=997

3. ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మికాంతం
http://teluguthesis.com/index.php?showtopic=107

ఇక సంస్కృత వాఙ్మయ చరిత్రకు ఈ కింది పుస్తకాలు ఉపయోగపడుతాయి.
1. సంస్కృత సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతారెడ్డి, ముదిగంటి గోపాల్
రెడ్డి
http://teluguthesis.com/index.php?showtopic=45

2. సంస్కృతవాఙ్మయచరిత్ర - (లౌకికవాఙ్మయం - ద్వితీయభాగం) -మల్లాది
సూర్యనారాయణ శాస్త్రి
http://teluguthesis.com/index.php?showtopic=44

3. సంస్కృతవాఙ్మయచరిత్ర - (వైదిక వాఙ్మయం - ప్రథమ భాగం) -మల్లాది
సూర్యనారాయణ శాస్త్రి
http://teluguthesis.com/index.php?showtopic=43

- బుధజన విధేయుడు
రామక పాండురంగశర్మ
----------------------------------------------------------
ఎన్నెన్నో అపురూపమైన తెలుగు, సంస్కృతగ్రంథాలకు
http://teluguthesis.com

అందరికీ రిప్లయి పంపు
రచయితకు రిప్లయి ఇవ్వు
ఫార్వర్డ్ చేయి
0 కొత్త మెసేజ్‌లు