-రాకేశ్వర
On Nov 21, 10:28 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam
<subtadepa...@gmail.com> wrote:
> తెలుగుసాహిత్యంలోని యుగవిభజన విషయంలో విమర్శకుల మధ్య ఏకాభిప్రాయం లేదు.
> ఒక్కొక్కఱూ ఒక్కొక్కరకంగా విభజించారు. కానీ అది స్థూలంగా ఇలా ఉంటుంది.
>
> ప్రాఙ్నన్నయ యుగము (క్రీ.శ.1 నుండి 1000 వఱకు)
> నన్నయయుగము (క్రీ.శ.1000 నుండి 1225 వఱకు)
> తిక్కనయుగము (1225 -1400)
> శ్రీనాథయుగము (1400 - 1500)
> ప్రబంధయుగము (1500 - 1650)
> దక్షిణాంధ్రయుగము (1650 - 1800)
> ఆధునికయుగము (1800 - )
>
> ఇక్కడ నేనిచ్చిన సమాచారంలోని కాలఖండాల్లో కొంచెం హెచ్చుతగ్గులుండవచ్చును కనుక
> సరిపుచ్చుకోవలసిందిగా ప్రార్థన.
>
> పై కాలఖండాల్లో నన్నయ్య దగ్గర్నుంచి శ్రీనాథుడి దాకా ఉన్న 500 సంవత్సరాల
> కాలఖండాన్ని అనువాదయుగం పేరుతో ఒకే యుగంగా పరిగణించేవారున్నారు. నన్నయ్యకీ
> తిక్కనకీ మధ్య శివకవియుగమని ఇంకో యుగాన్ని జత చేర్చినవారున్నారు. ఇవేవీ కాక ఆయా
> రాజవంశాల్ని బట్టి యుగవిభజన చేసినవారున్నారు.
>
> విపుల సమాచారం కొఱకు ఏదైనా తెలుగు సాహిత్యచరిత్ర గ్రంథాన్ని సంప్రదించగలరు.
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly
> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com
2. ఆంధ్రవాఙ్మయచరిత్ర - కాశీనాథుని నాగేశ్వర్రావు
http://teluguthesis.com/index.php?showtopic=997
3. ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మికాంతం
http://teluguthesis.com/index.php?showtopic=107
ఇక సంస్కృత వాఙ్మయ చరిత్రకు ఈ కింది పుస్తకాలు ఉపయోగపడుతాయి.
1. సంస్కృత సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతారెడ్డి, ముదిగంటి గోపాల్
రెడ్డి
http://teluguthesis.com/index.php?showtopic=45
2. సంస్కృతవాఙ్మయచరిత్ర - (లౌకికవాఙ్మయం - ద్వితీయభాగం) -మల్లాది
సూర్యనారాయణ శాస్త్రి
http://teluguthesis.com/index.php?showtopic=44
3. సంస్కృతవాఙ్మయచరిత్ర - (వైదిక వాఙ్మయం - ప్రథమ భాగం) -మల్లాది
సూర్యనారాయణ శాస్త్రి
http://teluguthesis.com/index.php?showtopic=43
- బుధజన విధేయుడు
రామక పాండురంగశర్మ
----------------------------------------------------------
ఎన్నెన్నో అపురూపమైన తెలుగు, సంస్కృతగ్రంథాలకు
http://teluguthesis.com