ఒక సాఫ్త్వేర్ ఇంజినీరు జీవితం

4 views
Skip to first unread message

Sitarama

unread,
Oct 30, 2009, 2:19:52 PM10/30/09
to సాహిత్యం
"ఒక సాఫ్త్వేర్ ఇంజినీరు జీవితం" అని నేను ఒక నవలిక రాశాను.దానిని ఒక
తెలుగు వార పత్రిక కు పంపితే సమాధానం రాలేదు. దాని లో కొంత ఒక బ్లాగు గా
రాశాను. ఎవరూ బాగున్నదీ లెనిదీ చెప్పలేదు. దానితో ఉత్సాహం పోయి బ్లాగు
చెయటం ఆపేశాను. ఈ గుంపు లొ బ్లాగరులు ఒక సారి చదివి మీ అభిప్రాయం
చెప్తే, అది బాగుంటే మిగిలినది బ్లాగు చేయటం మొదలెడతాను. డాని లింకు
ఇక్కడ వుంది:
http://quotas.sulekha.com/blog/post/2008/09/-22.htm
ఫ్రసాదు

uma maheswari

unread,
Oct 31, 2009, 12:35:51 AM10/31/09
to sahi...@googlegroups.com
నమస్కారం ప్రసాదు గారు !
నేను మీ "ఒక సాఫ్త్వేర్ ఇంజినీరు జీవితం" అనే బ్లాగు ని చదివాను.
చాల బాగా రాసారు.చిన్న చిన్న విషయాల్ని చాల విపులంగా రాసారు.
సుమారు ఒక గంట లో జరిగినదాన్ని సంభాషణా పూర్వకంగా రాసినట్టున్నారు.చాలాబాగుంది.
ఇక పోతే దీన్ని చదువుతున్నంతసేపు నాకు ఎక్కడో చిన్న సందేహం.
ఈ కధనం అంతా,చేతన్ భగత్ రాసిన "The night at the call center" అనే ఓ
ఆంగ్ల నవల లానే ఉంది.
తరువాత,చిన్న చిన్న అక్షర దోషాలు వున్నయి.మరల ఒక సారి సరిచూసుకోగలరు.

అభినందనలతో
కల్పలతిక


2009/10/30 Sitarama <sitaram...@gmail.com>:

sudarsanarao majety

unread,
Oct 31, 2009, 2:10:03 AM10/31/09
to sahi...@googlegroups.com
రాయడం ఆపకండి. రాస్తూ, రాస్తూ పోతుంటే రచన రాటు దేలుతుంది. సాహిత్యాన్ని ఎక్కువుగా చదవటం అలవాటు చేసుకోండి. తెలుగు భాషాభిమానాన్ని ఎట్టి పరిస్థితులలోనూ విడనాడకండి. మన తెలుగు భాష గొప్పదనం ప్రపంచం లోని ఏ భాషతోనూ పోల్చదగ్గది కాదు. తెలుగుకు సాటి తెలుగే.  ఈ విషయంలో తెలుగు వాళ్ళమైన మనం బహుధా గర్వించితీరాలి. రాయడం ఒక కళ. ఆ కళకు పదును పెట్టుకుంటూ, రాస్తూనే ఉండండి. మంచి రచయిత కాగలరు. మీకున్న తెలుగు భాషాభిమానానికి ధన్యవాదములు. మీ నవలిక చదివాను. బాగానే ఉంది. ఎవ్వరూ బాగుందీ, లేనిదీ చెప్పలేదని నిరుత్సాహపడకండి. మీ రాయాలన్న ఉత్సాహమే మిమ్ములను మునుముందుకు నడిపిస్తుంది. సెలవు.

2009/10/30 Sitarama <sitaram...@gmail.com>

Sitarama prasad

unread,
Nov 1, 2009, 11:55:26 AM11/1/09
to sahi...@googlegroups.com
ధన్యవాదాలు ఉమామహేశ్వరి గారు. చేతన్ భగత్ నవల గురించి విన్నాను. దాని తో ఎదైనా పోలిక వుంటే అది కాకతాళీయమే. ఈ నవలను నాకుతెలిసిన జీవితం నుంచీ రాశాను. కాల్ సెంటర్ వాళ్ళ జీవితాలకీ సాఫ్ట్ వేర్ వాళ్ళ జీవితాలకీ పొలిక వుంటుంది కాబట్టి ఈ రెండు నవలలకి కూడ పొలిక వుండి వుండవచ్చును.  తెలుగు ను ఆంగ్లం లొ టైపు  చెయటం నాకు ఇదే మొదలు. అందువలన అక్షర దోషాలు కూడా ఎక్కువే. ఆయితే ఈ నవల లో కథా నాయకుడి పల్లెటూరి  బాల్య జీవితం గురించి కూడా రాశాను.
మీ మాతలు నాకు కొండంత విశ్వాసాన్ని ఇచ్చాయి. నవల చేతి రాత  లో సిధ్ధం గానే వుంది. డానిని టైపు చేయాలి.                         

2009/10/31 uma maheswari <uma.m...@gmail.com>

Sitarama prasad

unread,
Nov 1, 2009, 12:17:39 PM11/1/09
to sahi...@googlegroups.com
ధన్యవాదాలు సుదర్శనరావు గారు. మీ తెలుగు భాషాభిమానానికి నాకు చాలా గర్వం గా వుంది. కానీ,  నా సందేహం ఏమిటంటే సాహిత్యం కూడా ఏ శిల్ప కళ లా నో  ఒక  మృత కళ అవుతుందెమో నని . ఈ భయం  తెలుగు సాహిత్యం విషయం లో మరింత  నిజమయ్యే అవకాశం వుంది. ఎందుకంటే  ఇంకో రెండు దశాబ్దాల్లో తెలుగు అంతరించిన భాషల జాబితా లో చేరనుంది. కాబట్టి తెలుగు లో రాసి ఏమైనా ప్రయోజనం వుందా, మన స్వ-ప్రేమ, స్వ భాషాభిమానం తృప్తి చెందటంతప్ప?    

2009/10/31 sudarsanarao majety <srma...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 1, 2009, 9:00:32 PM11/1/09
to sahi...@googlegroups.com
ఎందుకంటే  ఇంకో రెండు దశాబ్దాల్లో తెలుగు అంతరించిన భాషల జాబితా లో చేరనుంది. కాబట్టి తెలుగు లో రాసి ఏమైనా ప్రయోజనం వుందా, మన స్వ-ప్రేమ, స్వ భాషాభిమానం తృప్తి చెందటంతప్ప?    

ఎవరు చెప్పారిది మీకు ? మీకు మీరే అనుకుంటున్నారా ? అయితే మఱి ఈరోజు నుంచే మీరు తెలుగులో మాట్లాడ్డం, రాయడం, ఆలోచించడం మానెయ్యండి. లేదంటే అనవసరంగా ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చెయ్యకండి. తెలుగుని బతికుండగానే చంపెయ్యకండి. ఎంత ఇంగ్లీషు మీడియమ్ రాజ్యమేలుతున్నా ఇప్పటికీ రాష్ట్రంలో తొంభైలక్షలమంది పిల్లలు పదో తరగతి దాకా తెలుగుని ఒక చదువుతూనే ఉన్నారు. తెలుగుపత్రికల దైనిక ముద్రణ ఇప్పటికీ నలభైలక్షల కాపీలు ఉంది. ఎనిమిదిన్నఱకోట్లమందిమి బతికే ఉన్నాం. మనం బతికుండగా మన భాష ఎలా చస్తుది ? ఒక భాష బతకడం బతక్కపోవడం విద్యావ్యవస్థ మీద ఆధారపడి ఉండదు. ఇంగ్లీషువాళ్ళ హయాంలో అసలు తెలుగుమీడియమే లేదు. అయినా వాళ్ళ పాలనలో 170 సంవత్సరాలు తెలుగు బతికే ఉందిగా ? తెలుగులాంటి భాషలు అంత సులభంగా చావవు. బయటి ప్రభావాల్చేత కొంత రూపాన్ి మార్చుకుంటాయంతే !

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Sitarama prasad

unread,
Nov 2, 2009, 10:47:07 AM11/2/09
to sahi...@googlegroups.com
తాడేపల్లి  గారు,
ఎప్పుడొ వార్తా పత్రిక లొ చూశాను తెలుగు ఇంకా రెండు లేక మూడు దశాబ్దాలలొ మృత భాష అవుతుందని. ఇంగిలీషు వాళ్ళు వున్న రొజులలొనే మన తాతలు మంచి తెలుగు మట్లాడే వారు అనుకుంటా. మన నాన్న తాత ల తెలుగు మన తెలుగు కంటే బాగుంటుంది కదా. 
మన పట్టణాలలో వుండే వారిని ఇంగిలీషు మాట వాడకుందా ఒక పది నిమిషాలు మాట్లాడమనండి (నాతొ సహా) . ఛాలా కష్టమై పోతుంది. ఇవన్నీ కూడా రోగానికి చిహ్నాలే.  
భాష  ఆరోగ్యం ఎంతమంది మాట్లాడుతున్నారు అనే దాని మీద అధారపడి వుండదు.  ఫిన్లాండ్ జనాభా 55 లక్షలు. మన హైదరాబాదు జనాభా కంటె తక్కువే . అయినా వారి విద్యా వుద్యొగం అంతా  వారి భాష లొ నే సాగుటుంది. కాబట్టి ఫిన్నిష్ భాష ఆరోగ్యం గా వుంది అనిపిస్తుంది నాకు. వారు బయటి వారి తొ తప్పితే చాలా అరుదు గా ఇంగిలీషు పదాలను వాడతారు.      

2009/11/2 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 2, 2009, 11:44:32 AM11/2/09
to sahi...@googlegroups.com
ముత్తాతల కాలంలో మాత్రం స్వచ్ఛమైన తెలుగు ఎక్కడుందండీ ?  ఉర్దూ పదాలతో మిశ్రమం చేసిన తెలుగే మాట్లాడేవారు. ఇప్పుడు తాతల్లాగా దరఖాస్త్ అనడం మానేసి అప్లికేషన్ అంటున్నాం అంతే ! అంతమాత్రాన భాష చనిపోతుంది అంటే ఎలా ? ఎలాగైతే పెళ్ళయినంత మాత్రాన జనం తెగతెంపులు చేసుకుపోయినట్లు అవ్వదో అలాగే ఇతర భాషల ప్రభావానికి లోనైనంత మాత్రాన భాషలు చాలవు. మీరు ఏదో చిన్న యూరోఫియన్ జాతి సంగతి చెప్పారు. బావుంది. కానీ ఆ స్థితి తెలుక్కి కలగాలంటే తెలుగువాళ్ళకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేకసైన్యం కావాలి. ఎందుకంటే తెలుగు సమస్య సాంస్కృతికం కాదు. ఇది మన వ్యక్తిగత ఎంపిక (personal choice) కాదు. అంటే మన వ్యక్తిగత అభిమానాలతోను, ఎంపికలతోను దీన్ని పరిష్కరించలేము. ఇదొక తరతరాల రాజకీయ సమస్య. తరతరాలుగా ఇతరుల సామ్రాజ్యాల్లో భాగంగా మిగిలిపోయి స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్న ఒక మహాజాతి యొక్క సమస్య. నా మటుకు నేను అలాంటి పరిణామాన్ని మనసారా ఆహ్వానిస్తాను. కానీ ఇతరుల్లో ఎంతమంది ఆహ్వానిస్తారు ?

భాషకి దాని భౌగోళిక  వ్యవహర్తల (territorial speakers) సంఖ్య మంచి రక్షణ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందువలనే తెలుగే కాక అనేక భారతీయభాషలు జీవించగలుగుతున్నాయి. తెలుగుకంటే తక్కువమంది మాట్లాడేవాళ్ళ భాషల  గుఱించి ఇలాంటి జోస్యాలెవరూ చెప్పడం లేదు. ఉదాహరణకి బర్మీస్ మాట్లాడేవాళ్ళు కేవాల్ం రెండున్నఱకోట్లమంది మాత్రమే. సింహళీ మాట్లాడేవాళ్ళ సంఖ్య కేవలం ఒక కోటి మాత్రమే. కానీ వాటికి చెప్పని జోస్యాలు పదికోట్ల మందికి మాతృభాషైన తెలుక్కి ఎలా వర్తిస్తాయని కాస్త ఆలోచించారా ?  ఇందులో ఉన్న కుట్రని గమనించాలి. ఇలా ప్రచారం చేస్తే నేర్చుకునేవాడు కూడా మానేస్తాడని తెలుగుభాషా శత్రువుల ప్రణాళిక. ఆ కుట్రలో, ఆ అబద్ధాల్లో మనం పాలుపంచుకోవద్దు.      

పత్రికలకి సంచలనాలు కావాలి. అవన్నీ నమ్ముతూ కూర్చోకూడదు. ఈ రోజుల్లో మీడియా యొక్క విశ్వసనీయత ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద గుండుసున్నా. సర్వే సంస్థలైనా, ఆఖరికి శాస్త్ర పరిశోధకులమని చెప్పుకునేవాళ్ళ మాటలకున్న విలువ సరిగ్గా అంతే. ప్రజలుగా మనం స్వంత మన పరిశీలననీ, స్వాలోచననీ, అనుభవాన్ని మాత్రమే నమ్ముకోవాలి.మీరు చెబుతున్న ఒక అంశాన్ని నేను స్పృశించాను కదా ! భాషలు చావవు. మారతాయంతే !

Sitarama prasad

unread,
Nov 2, 2009, 3:25:57 PM11/2/09
to sahi...@googlegroups.com
"ఎలాగైతే పెళ్ళయినంత మాత్రాన జనం తెగతెంపులు చేసుకుపోయినట్లు అవ్వదో అలాగే ఇతర భాషల ప్రభావానికి లోనైనంత మాత్రాన భాషలు చావవు"
ఒక భాష మీద ఇంకొక భాష ప్రభావం సమాన హొదా లొ కలిగితే ఫరవాలేదు. అది ఆహ్వానించ తగ్గదే.  తెలుగుమీద కన్నడం ప్రభావం, అలానే కన్నడం మీద తెలుగు ప్రభావం అలాంటిదే.  ఇది ఇచ్చి పుచ్చుకునే పద్దతి. కానీ ఇంగ్లీష్ మాత్రం తెలుగుని ప్రభావితం చెస్తోంది. తెలుగు ఇంగ్లీషు ని ప్రభావితం చెయటం లేదు కదా? ఇంగ్లీషు కున్న ఈ హోదా రాజకీయ ఆర్ధిక అధికారానికి సంబంధిచినది. ప్రపంచీకరణ వల్ల అది  మరింత వేగవంతం అవుతొంది. 
గత రెండు వేల ఏళ్ళ లో లేని సాంస్కృతిక ప్రపంచీకరణ  ఈనాడు మీడియా వలన జరుగుతొంది.  కాబట్టి ఈ రెండు వేల ఏల్ల లొ జరగని దుర్ఘటన (తెలుగు అంతరించి పోవటం)  ఇప్పుడు జరుగుతుందేమోనని నా భయం.  అది జరగక పొతే నేను చాలా సంతొషిస్తాను.  
తెలుగు మీద ఇంగ్లీషు ప్రభావాన్ని మీరు సమర్ధిస్తారా?  

2009/11/2 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
ముత్తాతల కాలంలో మాత్రం స్వచ్ఛమైన తెలుగు ఎక్కడుందండీ ?  ఉర్దూ పదాలతో మిశ్రమం చేసిన తెలుగే మాట్లాడేవారు. ఇప్పుడు తాతల్లాగా దరఖాస్త్ అనడం మానేసి అప్లికేషన్ అంటున్నాం అంతే ! అంతమాత్రాన భాష చనిపోతుంది అంటే ఎలా ? ఎలాగైతే పెళ్ళయినంత మాత్రాన జనం తెగతెంపులు చేసుకుపోయినట్లు అవ్వదో అలాగే ఇతర భాషల ప్రభావానికి లోనైనంత మాత్రాన భాషలు చాలవు. మీరు ఏదో చిన్న యూరోఫియన్ జాతి సంగతి చెప్పారు. బావుంది. కానీ ఆ స్థితి తెలుక్కి కలగాలంటే తెలుగువాళ్ళకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేకసైన్యం కావాలి. ఎందుకంటే తెలుగు సమస్య సాంస్కృతికం కాదు. ఇది మన వ్యక్తిగత ఎంపిక (personal choice) కాదు. అంటే మన వ్యక్తిగత అభిమానాలతోను, ఎంపికలతోను దీన్ని పరిష్కరించలేము. ఇదొక తరతరాల రాజకీయ సమస్య. తరతరాలుగా ఇతరుల సామ్రాజ్యాల్లో భాగంగా మిగిలిపోయి స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్న ఒక మహాజాతి యొక్క సమస్య. నా మటుకు నేను అలాంటి పరిణామాన్ని మనసారా ఆహ్వానిస్తాను. కానీ ఇతరుల్లో ఎంతమంది ఆహ్వానిస్తారు ?

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 3, 2009, 3:51:45 AM11/3/09
to sahi...@googlegroups.com
ఇదివఱకటి ఉర్దూ ప్రభావం కూడా సమానస్థాయిలో జఱిగినది కాదు. అదీ ఏకదిశ్యమే (one-way). పైవాళ్ళ నుంచి కిందికి వచ్చింది. కిందినుంచి పైకి ఏమీ వెళ్ళలేదు. అంతమాత్రాన తెలుగు చనిపోలేదు. ఉర్దూవారి పాలనలో తెలుగుని సంపూర్ణంగా ఆధికారికంగా నిషేధించిన రోజులున్నాయి. అయినా తెలుగు చావలేదు. అలాంటిదే ఇప్పటి ఇంగ్లీషు ప్రభావం కూడా !  మనవాళ్ళు ఎంత ఇంగ్లీషు నేర్చుకున్నా తెలుగు నామవాచకాల (nouns) ని ఇంగ్లీషు నామవాచకాలతో  ప్రతిక్షేపించగలరే తప్ప ఏకంగా తెలుగుభాషని ఇంగ్లీషుభాషతో ప్రతిక్షేపించలేరు. ఇంగ్లీషుని ఇంగ్లీషులా మాట్లాడ్డం వచ్చినవాళ్ళు మెట్రోల్లో కూడా తక్కువే. ప్రాథమికంగా ఆ భాష ఈ దేశంలో ఇమడదు. తెలుగుని ఇంగ్లీషు బళ్ళలో నిషేధించడంలో గల అంతరార్థం అదే. తెలుగువాక్యనిర్మాణం ఒక విధమైన ఆలోచనాశైలిని పెంపొందిస్తుంది. దాని కలవాటుపడ్డవారు ఇంగ్లీషు ఆలోచనాశైలిని నేర్చుకోలేకపోతారేమోనని వాళ్ళ భయం. అంటే తెలుస్తూనే ఉందిగా ఆ భాష ఇక్కడి ఆలోచనాశైలిలో ఇమడదని. పైవర్గాలవారు కిందివర్గాల నెత్తిన బలవంతంగా రుద్దడం వల్ల ఇక్కడ అది కొనసాగగల్గుతోందంతే. ఆ రుద్దుడు కార్యక్రమాన్ని ఆపేయగల గట్టి పరిపాలకుడెవరైనా వస్తే ఇంగ్లీషు ఈ దేశంలోంచి పూర్తిగా అదృశ్యమైపోతుంది. అప్పుడు ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం సిద్ధిస్తుంది.

Maruthi Ram

unread,
Nov 4, 2009, 2:33:43 AM11/4/09
to sahi...@googlegroups.com
Ila telugu varu matladu kovataniki  avakasam kalpinchina google variki dhanyavadalu

On 11/3/09, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> wrote:
ఇదివఱకటి ఉర్దూ ప్రభావం కూడా సమానస్థాయిలో జఱిగినది కాదు. అదీ ఏకదిశ్యమే (one-way). పైవాళ్ళ నుంచి కిందికి వచ్చింది. కిందినుంచి పైకి ఏమీ వెళ్ళలేదు. అంతమాత్రాన తెలుగు చనిపోలేదు. ఉర్దూవారి పాలనలో తెలుగుని సంపూర్ణంగా ఆధికారికంగా నిషేధించిన రోజులున్నాయి. అయినా తెలుగు చావలేదు. అలాంటిదే ఇప్పటి ఇంగ్లీషు ప్రభావం కూడా !  మనవాళ్ళు ఎంత ఇంగ్లీషు నేర్చుకున్నా తెలుగు నామవాచకాల (nouns) ని ఇంగ్లీషు నామవాచకాలతో  ప్రతిక్షేపించగలరే తప్ప ఏకంగా తెలుగుభాషని ఇంగ్లీషుభాషతో ప్రతిక్షేపించలేరు. ఇంగ్లీషుని ఇంగ్లీషులా మాట్లాడ్డం వచ్చినవాళ్ళు మెట్రోల్లో కూడా తక్కువే. ప్రాథమికంగా ఆ భాష ఈ దేశంలో ఇమడదు. తెలుగుని ఇంగ్లీషు బళ్ళలో నిషేధించడంలో గల అంతila రార్థం అదే. తెలుగువాక్యనిర్మాణం ఒక విధమైన ఆలోచనాశైలిని పెంపొందిస్తుంది. దాని కలవాటుపడ్డవారు ఇంగ్లీషు ఆలోచనాశైలిని నేర్చుకోలేకపోతారేమోనని వాళ్ళ భయం. అంటే తెలుస్తూనే ఉందిగా ఆ భాష ఇక్కడి ఆలోచనాశైలిలో ఇమడదని. పైవర్గాలవారు కిందివర్గాల నెత్తిన బలవంతంగా రుద్దడం వల్ల ఇక్కడ అది కొనసాగగల్గుతోందంతే. ఆ రుద్దుడు కార్యక్రమాన్ని ఆపేయగల గట్టి పరిపాలకుడెవరైనా వస్తే ఇంగ్లీషు ఈ దేశంలోంచి పూర్తిగా అదృశ్యమైపోతుంది. అప్పుడు ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం సిద్ధిస్తుంది.



నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org



--
Maruthi Ram
Chief Executive
Sri Sai Lakshmi Enterprises
F1, Industrial Estate,
Sanath Nagar, Hyderabad - 500 018
Tel : +91-040 - 2381 5280
Mobile : 09160 3945 41
            09391 0698 19

Sitarama prasad

unread,
Nov 4, 2009, 10:35:06 AM11/4/09
to sahi...@googlegroups.com
avunu google  ki nenarlu

2009/11/4 Maruthi Ram <bvsma...@gmail.com>

Kaśyap కశ్యప్

unread,
Nov 5, 2009, 9:15:37 PM11/5/09
to sahi...@googlegroups.com
అంత దృశ్యం గూగల్ లోడికి ఉన్నదని అనుకోను ౧౯౯౮ నుండి తెలుగులో రాయటానికి ఈ టపా వంటి కొన్ని ఉపకరణాలు ఉండేవి , మనము వాడే ఈ ఉపకరణం తయారు చేసినది Quillpad from Tachyon టెక్నాలజీస్ వారి సాంకేతిక సహకారముతో ! , ఇది ఎప్పటి నుండో రెడిఫ్ఫ్ వాడు ఇచ్చి వున్నాడు . ఏది ఏమయినా ఈ చెత్త అల్గారిదమ్ వలన మన రాసే తెలుగు లో అచుతప్పులు దోర్లటానికి ఆస్కారం కలదు, మన తెలుగు కూడా SMS  భాష లాగ అవుతుందేమోనని నా భయం :(

4 నవంబర్ 2009 9:05 pm న, Sitarama prasad <sitaram...@gmail.com> ఇలా రాసారు :



--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

ranganath middela

unread,
Nov 7, 2009, 1:55:34 AM11/7/09
to sahi...@googlegroups.com
మీ నవలిక బాగుంది, కాని అందులోని విషయమేంటో అంతుచిక్కడం లేదు, ఐన రచనా శైలి నాకు నచ్చింది . ఏది ఏమైనా రాయడం అపెయకూడదు, అందువల్ల బుర్ర స్తబ్దటగా మారిపోతుంది, ఫస్ట్ మీ బ్లాగ్ కొనసాగించండి. 

2009/10/30 Sitarama <sitaram...@gmail.com>

Sitarama prasad

unread,
Nov 7, 2009, 11:57:34 AM11/7/09
to sahi...@googlegroups.com
మీరు ఓపిక చేసుకుమి చదివినందుకు నెనర్లు రంగనాథ్ గారు, ఆ బ్లాగు ని  కొనసాగిస్తాను. 
కాలం గడిచి నాగరికత పెరుగుతున్న కొద్దీ మనిషి  సహజ అవసరాలు తీరటం పలచబడుతున్నది అనే కాన్సెప్ట్ తో రాశాను ఈ నవలిక ని. కథ ముందుకు పోతున్న కొద్దీ ఈ విషయం స్పష్టమవుతుంది  అనుకుంటున్నాను.

2009/11/7 ranganath middela <ranga...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages