ఆణికాడవట యంతటికి

22 views
Skip to first unread message

Bharath

unread,
Apr 22, 2012, 12:42:51 AM4/22/12
to సాహిత్యం
అనమచార్యుల కీర్తనం యొక్క భావం ఎవరైనా తెలియ చేయగలరు గుంపులో


ఆణికాడవట యంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా

ముంగిట చెమటల ముత్యపు పూసలు
అంగన లోలో నమ్మీనదె
ఇంగితంపువెల లెరుగుదువటవో
యంగడి బేహారి యవి గొనవయ్యా

మొల్లమి మాచెలిమోవిమాణికము
అల్లవెలకు నీ కమ్మీనదె
తొల్లి నీవు సూదులవాట్లచే
కొల్ల లడిగితట కొనవయ్యా

నిడుదల చూపుల నీలంబులు నీ-
వడిగినంతకే యమ్మీనదే
పడతిదె శ్రీవేంకటపతి నీ వదె
యెడయని కాగిట నిటు గొనవయ్యా

సతతం

unread,
Apr 27, 2012, 3:44:31 AM4/27/12
to sahi...@googlegroups.com
ఆణికాడు అంటే వ్యాపారి.
ఓ వేంకటేశా! నీవు నేర్పరి అయిన వ్యాపారివి.
మాచెలి అలమేల్మంగ
నీకు ఆమె చెమటబిందువులనే ముత్యాలసరులను అమ్ముతోంది.
వాటి వెల నీవు ఎరుగుదువా?
ఓ వ్యాపారీ అవి కొనవయ్యా!

అలాగే మాచెలి పెదవి ఓ మాణిక్యము. కొను
మాచెలి చూపులు నీలాలు . నీవడిగినంత ధరకే అమ్ముతోంది.
గ్రహించవయా!


భవదీయుడు,

రావెమ్మెస్సారెల్
http://www.satatam.blogspot.com

22 ఎప్రిల్ 2012 10:12 ఉ న, Bharath <rad...@gmail.com> ఇలా రాసారు :

సతతం

unread,
Apr 27, 2012, 3:52:52 AM4/27/12
to sahi...@googlegroups.com
ఆణికాడు అంటే అసలు అర్థం మర్మజ్ఞుడు. అయితే ఇక్కడ బేహారి అని వాడటంవల్ల నేను ఇక సూటిగా వ్యాపారి అనేశాను. గ్రహించగలరు.
మొత్తానికి భావం అదే.
రావెమ్మెస్సారెల్.

27 ఎప్రిల్ 2012 1:14 సా న, సతతం <raom...@gmail.com> ఇలా రాసారు :

Bharath Ch

unread,
Apr 27, 2012, 4:26:21 AM4/27/12
to sahi...@googlegroups.com
రావు గారు ,

అద్భుతం అర్ధం చెప్పినందుకు శత కోటి వందనాలు
=భరత్=


2012/4/27 సతతం <raom...@gmail.com>

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Apr 27, 2012, 4:44:30 AM4/27/12
to sahi...@googlegroups.com
సభ్యులారా!
ఈ మాట కు ఈ క్రింది అర్ధాలూ ఉన్నాయి:
మర్మ మెరింగినవాడు, గుట్టుతెలిసినవాడు. 

సమయ సంధర్భాల బట్టి వాడుకోవాలి.

అన్నమయ్య కాలంలో ఏ విధంగా వాడేవారో తెలుసుకోవలసిన అగత్యం కూడా ఉంది కదా!

నాకు తోచింది చెప్పాను. తప్పులుంటే తెలియజేయండి.

భవదీయుడు

వెంకటప్పయ్య.

Ravi E.N.V.

unread,
Apr 27, 2012, 5:58:57 AM4/27/12
to sahi...@googlegroups.com
ఆణి అని తమిళుల బ్రాహ్మణుల తెగ ఒకటుంది. రజనీకాంత్ తమిళపాటలో (రజనికాంత్, మీనా, సినిమా వీరా)  ’మాడత్తిలె, కన్నిమాడత్తిలె, ఆణిపొణ్ణు అయ్యరాతి పొణ్ణు...." అని వస్తుంది. బహుశా ఆ ’ఆణి’ కి దీనికి యేదో సంబంధం ఉండి యుండవచ్చును.

2012/4/27 టేకుమళ్ళ వెంకటప్పయ్య <tekumalla.v...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages