కౌముది - మే 2013 సంచిక విడుదలైంది

19 views
Skip to first unread message

KiranPrabha

unread,
Apr 30, 2013, 11:45:19 PM4/30/13
to sahi...@googlegroups.com
ఆకాశమంత విశాలం అమ్మ అంతరంగం
ఆకాశమంత సమోన్నతం అమ్మ అనురాగం -
నిద్దరమత్తు వదలనంటుంటే 
వెలుగుపూలతో మేల్కొలుపు పాడుతుంది,
పగటి వేడిమికి వాడిపోయాననేమో
సాయంసంధ్యా వీవనతో సాంత్వన నిస్తుంది,
చీకటి భూతం తరుముతుంటే
పాలపుంత తానై ముందడుగు వేయిస్తుంది,
అనంతమే తన ప్రేమకి కొలమానమంటుంది,
దిగంతమే తన సహనానికి సరిహద్దంటుంది,
జీవనపోరాటంలో దారులు దూరమైనా
అదృశ్యహస్తాలతో దీవిస్తూనే ఉంటుంది!
ఆకాశమంత విశాలం అమ్మ అంతరంగం!!
ఆకాశమంత సమోన్నతం అమ్మ అనురాగం!!!!


--
With Best Regards
KiranPrabha
http://www.kiranprabha.com
http://www.koumudi.net

Sreenivas Bondili

unread,
May 2, 2013, 11:18:08 AM5/2/13
to sahi...@googlegroups.com
కిరణ్ ప్రభగారికి,
ఆర్యా,
లాభాపేక్ష, వ్యాపార ప్రయోజనాలు యే మాత్రం లేకుండా ఉత్తమ స్థాయిలో కౌముది పత్రికను నడుపుతున్నందుకు మీకు నా అభినందనలు. మీరు యిచ్చిన లంకెలో కంఠమనేని గారి కథలను మళ్ళీ చదివి ఆనందించాను. నా వద్ద కంఠమనేని రాధాకృష్ణమూర్తిగారి సరస్వతీ పటం అనే పేరు గల కథ, పల్లకి వారపత్రికలో ప్రచురింపబడినది వున్నది. నేనప్పుడు జాగ్రత్తగా కత్తిరంచిన పుటలు కనబడ్డాయి. కౌముదిలో ప్రచురించే అవకాశం వున్నదా? ఆ పుటలు స్కాన్ తీసి పంపిస్తాను. కాపీరైట్ సమస్యలేవీ రావా?
శ్రీనివాసుడు. 

2013/5/1 KiranPrabha <kiran...@gmail.com>

--
 
---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Reply all
Reply to author
Forward
0 new messages