ఓ, ఈ పద్యాన్ని వెంకటనాధుడు అనే కవికి అంటగట్టారని నాకు తెలియదు. ఇదొక ప్రసిద్ధ చాటు పద్యం, తెలుగు పద్యం యొక్క అందాన్ని కొంచం 'రొమాంటిక్'గా వర్ణించినది.
ఘనతర ఘూర్జరీ కుచయుగక్రియ గూఢము గాక, ద్రావిడీ
స్తనగతి తేట గాక, అరచాటగు ఆంధ్రవధూటి చొక్కపుం
జనుగవపోలె, తేటయునుఁ జాటుదనంబును గాకయుండ జె-
ప్పిన నదిపో కవిత్వమనిపించు, నగించటు గాక యుండినన్
ఘనతర ఘుర్జరి అని Googleలో ఇచ్చి చూడండి :)
Regards,
Sreenivas
2012/2/28 రాజేశు దేవభక్తుని <>
ఈ పద్యం లో కవిత్వలక్షణం చెప్పాడు కవి.
1.ఘనతర=గొప్పనైన; ఘూర్జరీ=గుజరాతీ(స్త్రీయొక్క);కుచయుగక్రియన్=సతనయుగ్మం
వలె; గూఢము కాక= పూర్తిగా దాచబడినదికాకుండా;
2.ద్రావిడీ స్తనగతిన్= ద్రావిడస్త్రీస్తనంవలె; తేటగాక= పూర్తిగా బయటకు
ఏర్పడకుండా
3. అరచాటగు=కనపడీ కనపడనట్లుండే; ఆంధ్రవధూటి=తెలుగుమహిళయొక్క; చనుగవవలె=
స్తనయుగ్మంలా;
- తేటయును, చాటుదనంబును గాకయుండగా చెప్పితే.....అదయ్యా కవిత్వమంటే. అలా
కాకుండాఉన్నకవిత్వం వింటే
అది హాస్యాస్పదమౌతుంది.
డా.రామక పాండురంగశర్మ.
--------------------------
సంస్కృతాంధ్ర సాహితీగ్రంథాలకు నిలయం -
తెలుగుపరిశోధన http://teluguthesis.com