నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 11

1 view
Skip to first unread message

megha

unread,
Apr 18, 2008, 2:54:12 AM4/18/08
to sahityam
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 11
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
కాలంతో నీవు పరుగులు తీయలేవని
తీరాలు దూరాన ఉన్నాయని
అలసి పోయానని భావించి
అడుగులు తీయలేక సొకించి
కలలు కనడం మానకు
మనసుకు సంతొషం దూరం చెయకు

చీకటి వెనుక చిరు దివ్వెటలా
కనుల మాటున మూసిన కనులకు తోడుగా
కలలు దాగి ఉండేను
శుభోదయాన నీ కలతని తీరం చేర్చేను

ఒడుదుడుకుల మాటున
మనసులొ దాగిన ఆశరేకలే
తీరాలు దరిచేర్చు స్నెహాలు
కనులు మూసుకొని ఓ సారి
మనసులొ మిగిలిపొ ఈ సారి..
--మేఘ

http://manogatam.blogspot.com/
Reply all
Reply to author
Forward
0 new messages