మహా ఘటికుడు మన బుడుగు

21 వీక్షణలు
మొదటి చదవని మెసేజ్‌కు స్కిప్ చేయి

Ramanadha Reddy Yarrapu Reddy

చదవనివి,
11 ఏప్రి, 2007 2:01:21 AM11-04-07
వరకు sahi...@googlegroups.com
మిత్రులారా,
 
మీతో ఒక చిన్న మాట. మీలో కొందరైనా మాట కలుపుతారని చెబుతున్నాను: డెబ్బై ఆరేళ్ల బుడుగు తన బాల్యం గురించి చెప్పిన సంగతులు.
 
బాపు-రమణ ద్వయంలోని ముళ్లపూడి వెంకటరమణ రచనల గురించి ఆలోచనకు రాగానే వెంటనే స్ఫురణకు వచ్చే "బుడుగు" ఆయన చిన్నప్పటి ముద్దుపేరు. ఆయన తన బాల్యమును గురించి ఆంధ్రజ్యోతి వారి కోరికమేరకు ఉగాది సంచికకు రాసిన ఇటీవలి రచన  ఇక్కడ చూడండి. ఈ వ్యాసం చదువుతూ  ఉండగా ఒక వాక్యం నాకు తీవ్రభావావేశాన్ని కలిగించింది. కొంతసేపు అక్కడే ఆగిపోయాను, ఏవేవో ఆలోచిస్తూ. చిన్నతనంలో తండ్రిని కోల్పోయి, ఆస్తులను, ఆడంబరాలమూ కోల్పోయి, అమ్మ చేసే కష్టంతో వచ్చే చాలీచాలని సంపాదనతో చెన్నపట్నం(చెన్నై)లో మొండిగా బ్రతుకు బండిని లాగుతున్న రోజులను ఆయన ఇలా గుర్తుచేసుకుంటారు:
 
"ఇద్దరం పొద్దున్నే ప్రెస్సుకి వెళ్లేవాళ్లం. పొద్దున్న ఏడునుంచి, సాయంత్రం ఏడుదాకా నిలబడి కంపోజింగ్ చేసేది మా అమ్మ. నేను తొమ్మిది గంటలకు స్కూలుకు వెళితే నాకు రెండు ఇడ్డెనలు కొనిపెట్టి మిగిలిన పచ్చడి తను తినేది. సాయంత్రం నాలున్నరకి వెళితే ప్రెస్సు వాళ్లు ఏదేనా పెట్టేవాళ్లు. మేమిద్దరం తినేవాడిని."  --  -- తల్లీకొడుకులిద్దరూ ప్రెస్సువాళ్లు పెట్టింది "తినేవాడు". అంత సేపు నిలబడి పనిచేసిన తల్లి, దొరికిన ఆ కాస్త తిండినీ తాను తిన్నట్టుగాచేసి బిడ్డకే పెట్టే పరిస్థితిని "మేమిద్దరం తినేవాడిని" అనే వాక్యంలో మన కళ్లకు కడతారు రమణ.
 
ఇలాంటి మాటలు రమణ రచనల్లో కోకొల్లలు అంటారు. మీరు చదివిన లేదా విన్న రమణ రచనల్లో మీకు స్ఫురించే రచనలు లేదా ఘట్టాలు ఏమిటి?

-- రానారె
http://yarnar.blogspot.com

swathi

చదవనివి,
11 ఏప్రి, 2007 2:54:38 AM11-04-07
వరకు sahi...@googlegroups.com
వ్యాసం చదివాను. రమణ గారి స్టైల్లో బావుంది.

కళ్ళ దాకా రాలేదు కానీ మనసు మాత్రం చెమర్చింది .. రోజుల తరబడి ఆవకాయన్నం
తో గడపటం, డొక్కు సైకిల్ తో తిప్పలు పడటం, జ్వరం తో కూడా పని చేసే అమ్మా
నాన్నల్ని చూసి బాధపడటం లాంటివన్నీ గుర్తొచ్చి. రమణ గారి అనుభవాలు మనలో
చాలమంది జీవితాల్లో ఎదోక చోట ఉండేవుంటాయి.

ఇక ఆయన సాహిత్యం విషయానికొస్తే.
"అవమానం వేసింది" "బామ్మ వెనకేసుకొస్తుంది" లాంటి వన్ని చదివిన వాళ్ళెవరూ
మర్చిపోలేరు.

సముద్ర తీరం, నిత్య జీవిత ఋణానంద లహరి, అచ్చ తెలుగు సీతలు, సుబ్బారావు
లూ, అమ్మ ప్రేమలూ ఇవీ మిగతా కధల్లో గుర్తుండి పోయే అంశాలు.


--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.

sowmya balakrishna

చదవనివి,
11 ఏప్రి, 2007 3:03:26 AM11-04-07
వరకు sahi...@googlegroups.com
ఇదిగో..ఇప్పుడే "కథా రమణీయం" ముళ్ళపూడి కథల సంకలనం తెచ్చుకున్నా లైబ్రరీ నుంచి. రాగానే ఈ మెయిల్ చూస్తున్నా (చేస్తున్నా).
ముళ్ళపూడి గారి శైలి బాగుంటుంది.... నవ్వు తెప్పిస్తుంది, కదిలిస్తుంది కూడానూ.

ఇంతకీ సరిగ్గా 5 నిముషాల క్రితం నా స్నేహితురాలు నేను లైబ్రరీ నుంచి ఈ పుస్తకం తెస్తూ ఉంటే - "ఈయన భాష అంటే నాకు చాలా చిరాకు..." అనుకుంటూ ఏదో చెప్పింది. దీని తో నాకో అనుమానం కలిగింది...మీ ముందు ఉంచుతున్నా:

1.ఫలానా తెలుగు లో రాస్తేనే మంచి తెలుగా?
2. కథలో పాత్ర చరిత్ర బట్టి దానికి ఆ భాష పెట్టొచ్చు కానీ narrator కి మాత్రం slang ఉండకూడదా?
3. Narrator అంటే రచయితే అన్న అభిప్రాయం చాలా మంది లో గమనించాను. ఆ అభిప్రాయం సబబేనంటారా? ఫలానా కథ లో Narrator X slang వాడితే Author భాష కూడా X Slang అవ్వాలా??

మీ అభిప్రాయలు తెలుపండి.

S.
--
---------------------------------------------------
V.B.Sowmya
SIEL,IIIT-Hyderabad
http://search.iiit.ac.in/
my blog:
http://vbsowmya.wordpress.com
----------------------------------------------------

Tummala Sirish Kumar

చదవనివి,
11 ఏప్రి, 2007 6:00:58 AM11-04-07
వరకు sahi...@googlegroups.com
ముళ్ళపూడి సాహితీసర్వస్వం లోని కదంబ రమణీయం-2 పుస్తకంలో కక్కిగారబ్బాయి అనే వ్యాసంలో రమణ తన తల్లి గురించి రాసారు. ఆంధ్రజ్యోతిలోని వ్యాసం దాదాపుగా దాన్నుండి తీసుకున్నదే. అయితే రానారె ఉదహరించిన "ఇద్దరం తినేవాడిని" అనే ఆ గొప్ప ప్రయోగం "ఇద్దరం తినేవాళ్ళం" అని ఉంటుంది, ఆ వ్యాసంలో. బహుశా కంపోజరు ' తప్పును సరి చేసి ఉంటాడు' ఆ పుస్తకం ముందుమాటలో మాత్రం ఎమ్బీయెస్ ప్రసాదు గారు ఈ ప్రయోగాన్ని ఉదహరించారు.

అనువాద రచయిత ఒకాయన టీవీలో చెప్పగా విన్నాను.. రమణ రచనలను ఇతర భాషల్లోకి అనువదించడం కష్టమట. భాషా ప్రయోగాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి ఆయన రచనల్లో. వాటిని అనువదించి రసపోషణ చెయ్యడం కష్టమని చెప్పుకొచ్చారు.
రమారమి, అప్పుతచ్చు లాంటి ప్రయోగాలు ఎన్నెన్నో ఆయన రచనల్లో!

కొత్తపాళీ

చదవనివి,
11 ఏప్రి, 2007 7:39:49 AM11-04-07
వరకు sahityam
తెలుగులో ముళ్ళపూడి లాంటి రచయితలు అరుదు. ఒక పక్క తెలుగు జన జీవితాన్ని
దగ్గరగా తెలిసి ఉండడం, రెండో పక్క సమకాలీన ఆంగ్ల సాహిత్యంలో వస్తున్న
హాస్య వ్యంగ్య రచనల ప్రభావం - ఈ రెండూ కలిసి రమణ రచనకి ఒక ప్రత్యేకతని
తెచ్చి పెట్టాయి. కొన్ని రచనల్లో వుడ్‌హౌస్, జికె ఛెస్టెర్టన్ లాంటి
మహానుభావుల ప్రభావం బలంగా కనిపిస్తుంది. ఐతే కథ నేపధ్యం, కథలోని పాత్రలూ
మనవి, మనవాళ్ళు, మనకి బాగా తెలిసిన వాళ్ళు.

నా మట్టుకి నాకు ఒక సమస్య తోచింది, విశాలాంధ్రవారు ప్రచురించిన రమణ
సాహితీ సర్వవం చదువుతుంటే. చిన్నప్పుడు ఉన్న ఉత్సాహం, ఉద్వేగం పుట్టుకు
రాలా. కొన్ని కథల్ని మినహాయిస్తే ఇంచుమించు అన్నిట్లోనూ ఒకటే పద్ధతి. మూస
అనను కానీ .. కథ అంటూ పెద్దగా ఏమీ జరగదు - విలక్షణమైన పాత్రలతోనూ, రచయిత
చాతుర్యంతోనూ రచన జరిగిపోతూ ఉంటుంది అంతే. అప్పుడు అనిపించింది - రమణ
రచనల్ని అప్పుడోటీ అప్పుడోటీ చదువుకొని నవ్వుకోవాల్సిందే కానీ, ఇలా ఒక్క
బిగిన చదవడం మంచి పద్ధతి కాదని.

"మాహారాజూ - యువరాజూ", "కానుక" అనే రెండు కథలు మాత్రం దీనికి మినహాయింపు.
గొప్ప తెలుగు కథల్ని గురించి మాట్లాడిన ఏ సంభాషణలోనైనా ఈ రెండు కథల
ప్రస్తావన ఉంటుంది.

కొ.పా.

On Apr 11, 3:00 pm, "Tummala Sirish Kumar" <sirishtumm...@gmail.com>
wrote:


> ముళ్ళపూడి సాహితీసర్వస్వం లోని కదంబ రమణీయం-2 పుస్తకంలో కక్కిగారబ్బాయి అనే
> వ్యాసంలో రమణ తన తల్లి గురించి రాసారు. ఆంధ్రజ్యోతిలోని వ్యాసం దాదాపుగా
> దాన్నుండి తీసుకున్నదే. అయితే రానారె ఉదహరించిన "ఇద్దరం తినేవాడిని" అనే ఆ
> గొప్ప ప్రయోగం "ఇద్దరం తినేవాళ్ళం" అని ఉంటుంది, ఆ వ్యాసంలో. బహుశా
> కంపోజరు 'తప్పును
> సరి చేసి ఉంటాడు' ఆ పుస్తకం ముందుమాటలో మాత్రం ఎమ్బీయెస్ ప్రసాదు గారు ఈ
> ప్రయోగాన్ని ఉదహరించారు.
>
> అనువాద రచయిత ఒకాయన టీవీలో చెప్పగా విన్నాను.. రమణ రచనలను ఇతర భాషల్లోకి
> అనువదించడం కష్టమట. భాషా ప్రయోగాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి ఆయన రచనల్లో.
> వాటిని అనువదించి రసపోషణ చెయ్యడం కష్టమని చెప్పుకొచ్చారు.
> రమారమి, అప్పుతచ్చు లాంటి ప్రయోగాలు ఎన్నెన్నో ఆయన రచనల్లో!
>

> On 4/11/07, sowmya balakrishna <vbsow...@gmail.com> wrote:
>
>
>
> > ఇదిగో..ఇప్పుడే "కథా రమణీయం" ముళ్ళపూడి కథల సంకలనం తెచ్చుకున్నా లైబ్రరీ
> > నుంచి. రాగానే ఈ మెయిల్ చూస్తున్నా (చేస్తున్నా).
> > ముళ్ళపూడి గారి శైలి బాగుంటుంది.... నవ్వు తెప్పిస్తుంది, కదిలిస్తుంది
> > కూడానూ.
>
> > ఇంతకీ సరిగ్గా 5 నిముషాల క్రితం నా స్నేహితురాలు నేను లైబ్రరీ నుంచి ఈ
> > పుస్తకం తెస్తూ ఉంటే - "ఈయన భాష అంటే నాకు చాలా చిరాకు..." అనుకుంటూ ఏదో
> > చెప్పింది. దీని తో నాకో అనుమానం కలిగింది...మీ ముందు ఉంచుతున్నా:
>
> > 1.ఫలానా తెలుగు లో రాస్తేనే మంచి తెలుగా?
> > 2. కథలో పాత్ర చరిత్ర బట్టి దానికి ఆ భాష పెట్టొచ్చు కానీ narrator కి మాత్రం
> > slang ఉండకూడదా?
> > 3. Narrator అంటే రచయితే అన్న అభిప్రాయం చాలా మంది లో గమనించాను. ఆ అభిప్రాయం
> > సబబేనంటారా? ఫలానా కథ లో Narrator X slang వాడితే Author భాష కూడా X Slang
> > అవ్వాలా??
>
> > మీ అభిప్రాయలు తెలుపండి.
>
> > S.
>

> > On 4/11/07, swathi <swathikum...@gmail.com> wrote:
>
> > > వ్యాసం చదివాను. రమణ గారి స్టైల్లో బావుంది.
>
> > > కళ్ళ దాకా రాలేదు కానీ మనసు మాత్రం చెమర్చింది .. రోజుల తరబడి ఆవకాయన్నం
> > > తో గడపటం, డొక్కు సైకిల్ తో తిప్పలు పడటం, జ్వరం తో కూడా పని చేసే అమ్మా
> > > నాన్నల్ని చూసి బాధపడటం లాంటివన్నీ గుర్తొచ్చి. రమణ గారి అనుభవాలు మనలో
> > > చాలమంది జీవితాల్లో ఎదోక చోట ఉండేవుంటాయి.
>
> > > ఇక ఆయన సాహిత్యం విషయానికొస్తే.
> > > "అవమానం వేసింది" "బామ్మ వెనకేసుకొస్తుంది" లాంటి వన్ని చదివిన వాళ్ళెవరూ
> > > మర్చిపోలేరు.
>
> > > సముద్ర తీరం, నిత్య జీవిత ఋణానంద లహరి, అచ్చ తెలుగు సీతలు, సుబ్బారావు
> > > లూ, అమ్మ ప్రేమలూ ఇవీ మిగతా కధల్లో గుర్తుండి పోయే అంశాలు.
>

కొత్తపాళీ

చదవనివి,
11 ఏప్రి, 2007 7:52:07 AM11-04-07
వరకు sahityam
చాలా మంఛి పాయింటు తీశారు సౌమ్యా. కథకుడు (narrator)కీ, కథా రచయిత
(author)కీ తేడా చాలామంది రచయితలే గుర్తించరు, అందుకని పాఠకుల్ని తప్పు
పట్టి ప్రయోజనం లేదేమో.
రమణ వాడే భాష గురించి మీ స్నేహితురాలి విముఖతని కొంతవరకూ అర్థం
చేసుకోగలను. కింద శిరీష్ గారు చెప్పినట్టు రమణ రచనల్లో అలవాటు లేని అంతకు
ముందు చూడని కొత్త భాషాప్రయోగాలు విపరీతంగా ఉంటాయి. అవే కాక, ఒకలాంటి
తెలుగు జీవితానికి సంబంధించిన hidden references బోలెడు ఉంటాయి.
ఇటు కొత్తప్రయోగాల ఆటూపోట్లని తట్టుకుని, అటు ఆ రిఫరెన్సులని కోంతైనా
అర్థం చేసుకుంటే తప్ప రమణ మనకి అర్థం కాడు.
దానికి తోడు ఆయన కథలేవీ తిన్నగా సాగవు. Straightforward realistic story
tellingకి అలవాటు పడిన మన జనాభాకి అవి చాలా కృతకంగానూ, అర్థం కానట్టుగానూ
ఉంటాయి.
కొ.పా.

On Apr 11, 12:03 pm, "sowmya balakrishna" <vbsow...@gmail.com> wrote:
> ఇదిగో..ఇప్పుడే "కథా రమణీయం" ముళ్ళపూడి కథల సంకలనం తెచ్చుకున్నా లైబ్రరీ నుంచి.
> రాగానే ఈ మెయిల్ చూస్తున్నా (చేస్తున్నా).
> ముళ్ళపూడి గారి శైలి బాగుంటుంది.... నవ్వు తెప్పిస్తుంది, కదిలిస్తుంది కూడానూ.
>
> ఇంతకీ సరిగ్గా 5 నిముషాల క్రితం నా స్నేహితురాలు నేను లైబ్రరీ నుంచి ఈ పుస్తకం
> తెస్తూ ఉంటే - "ఈయన భాష అంటే నాకు చాలా చిరాకు..." అనుకుంటూ ఏదో చెప్పింది.
> దీని తో నాకో అనుమానం కలిగింది...మీ ముందు ఉంచుతున్నా:
>
> 1.ఫలానా తెలుగు లో రాస్తేనే మంచి తెలుగా?
> 2. కథలో పాత్ర చరిత్ర బట్టి దానికి ఆ భాష పెట్టొచ్చు కానీ narrator కి మాత్రం
> slang ఉండకూడదా?
> 3. Narrator అంటే రచయితే అన్న అభిప్రాయం చాలా మంది లో గమనించాను. ఆ అభిప్రాయం
> సబబేనంటారా? ఫలానా కథ లో Narrator X slang వాడితే Author భాష కూడా X Slang
> అవ్వాలా??
>
> మీ అభిప్రాయలు తెలుపండి.
>
> S.
>

> On 4/11/07, swathi <swathikum...@gmail.com> wrote:
>
>
>
>
>
> > వ్యాసం చదివాను. రమణ గారి స్టైల్లో బావుంది.
>
> > కళ్ళ దాకా రాలేదు కానీ మనసు మాత్రం చెమర్చింది .. రోజుల తరబడి ఆవకాయన్నం
> > తో గడపటం, డొక్కు సైకిల్ తో తిప్పలు పడటం, జ్వరం తో కూడా పని చేసే అమ్మా
> > నాన్నల్ని చూసి బాధపడటం లాంటివన్నీ గుర్తొచ్చి. రమణ గారి అనుభవాలు మనలో
> > చాలమంది జీవితాల్లో ఎదోక చోట ఉండేవుంటాయి.
>
> > ఇక ఆయన సాహిత్యం విషయానికొస్తే.
> > "అవమానం వేసింది" "బామ్మ వెనకేసుకొస్తుంది" లాంటి వన్ని చదివిన వాళ్ళెవరూ
> > మర్చిపోలేరు.
>
> > సముద్ర తీరం, నిత్య జీవిత ఋణానంద లహరి, అచ్చ తెలుగు సీతలు, సుబ్బారావు
> > లూ, అమ్మ ప్రేమలూ ఇవీ మిగతా కధల్లో గుర్తుండి పోయే అంశాలు.
>

> SIEL,IIIT-Hyderabadhttp://search.iiit.ac.in/

అందరికీ రిప్లయి పంపు
రచయితకు రిప్లయి ఇవ్వు
ఫార్వర్డ్ చేయి
0 కొత్త మెసేజ్‌లు