"సర్వే జనా సుఖినోభవంతు" అనే పాదం ఎక్కడిది

9,183 views
Skip to first unread message

braahmii braahmii

unread,
Sep 26, 2007, 11:17:15 AM9/26/07
to sahi...@googlegroups.com
ప్రియ మిత్రులారా,
ఒక మిత్రకార్యం కోసం "సర్వే జనా సుఖినోభవంతు" అనే పాదం ఎక్కడిది, వివరాలు,పూర్తి శ్లోకం తెలుసుకోవలసి వచ్చింది. తెలిసిన వారు  తెలుపవలసిందిగా ప్రార్థన.
కృతజ్ఞతలు
 
బ్రాహ్మీ

mayookhaa

unread,
Sep 27, 2007, 9:31:12 AM9/27/07
to sahityam
ఇది శాంతి మంత్రం లోనిది.....

mayookhaa

unread,
Sep 27, 2007, 9:36:57 AM9/27/07
to sahityam


"స్వస్తి ప్రజాభ్యాం పరిపారలయంతాం
న్యాయేన మార్గేన మహీం,మహీశాం
గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినోభవంతు


సర్వేజనా సుఖినో భవంతు

కాలె వర్షతు పరజన్యా
పృథ్వీ సస్యస్యాలినీ
దేశోయం క్షోభయం రహితా
బ్రాహ్మణా సంతు నిర్భయః
అపుత్రా పుత్రిణసంత్తు,పుత్రిణాసంతు పౌత్రిణా
అధనా ధనా సంతు
జీవంతు సరదాన్శతం
లోకా సమస్తా సుఖినోభవంతు


సర్వేజనా సుఖినో భవంతు "

దోషాలు ఉంటే పెద్దలు సరిద్దిద్దగలరు

carani narayanarao

unread,
Sep 27, 2007, 10:09:58 AM9/27/07
to sahi...@googlegroups.com

[1]"సర్వే జనా సుఖినోభవంతు.".

పూర్వకాలం, అంతా రాసింతరువాత, చివరలో ఈ ఆర్యోక్తిని స్వస్తి వాచనంగా వాడేవారు (అని నేనకోవడం).

[2] సి.పి.బ్రౌన్ గారి ఉదంతం:

(వేమన పద్యాలను సంగ్రహించి, పరిష్కరించిడమే కాకుండా, తెలుగు నిఘంటువు సంకలనం చేసిన) సి.పి.బ్రౌన్ తెలుగు నేర్చుకుంటున్న కొత్తల్లో, పండితులు చివర రాసిన స్వస్తి వాచనంగ "సర్వే జనా సుఖినోభవంతు", చూసి అడిగారట "ఇదేమిటి, సర్వే డిపార్‌ట్‌మెంట్ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు" అని.  

 

[3]"లోకాస్సమస్తా స్సుఖినోభవంతు"

అను  ఉక్తిక్రింద ఇచ్చిన స్వస్తి శ్లోకంలో ఉంది.

"స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!

న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!

గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!"  



----- Original Message ----
From: braahmii braahmii <braa...@gmail.com>
To: sahi...@googlegroups.com
Sent: Wednesday, 26 September, 2007 8:47:15 PM
Subject: [సాహిత్యం] "సర్వే జనా సుఖినోభవంతు" అనే పాదం ఎక్కడిది

ప్రియ మిత్రులారా,
ఒక మిత్రకార్యం కోసం "సర్వే జనా సుఖినోభవంతు" అనే పాదం ఎక్కడిది, వివరాలు,పూర్తి శ్లోకం తెలుసుకోవలసి వచ్చింది. తెలిసిన వారు  తెలుపవలసిందిగా ప్రార్థన.
కృతజ్ఞతలు
 
బ్రాహ్మీ




Meet people who discuss and share your passions. Join them now.

బ్రాహ్మీ

unread,
Sep 27, 2007, 10:54:28 AM9/27/07
to sahi...@googlegroups.com, ammad...@gmail.com, maharshi...@gmail.com
వివరాలు తెలిపినందుకు మయూఖ గారికి కృతజ్ఞతలు.కాని మీరు తెలిపిన మంత్రం నేను కూడా చూశాను. మహీధర జగన్మోహనరావు గారు సంకలనం చేసిన సూక్తి ముక్తావళి లో 368వ పేజీలో ఉంది. కాని అందులో
"లోకా స్సమస్తా స్సుఖినోభవంతు" అని మాత్రమే ఉంది. "సర్వే జనా సుఖినో భవంతు" అని లేదు. మీరు ఇచ్చిన మంత్రంలో మాత్రం రెండు సార్లు "సర్వే జనా సుఖినో భవంతు" అని ఉంది. అందువల్ల మరొక్కసారి నిర్థారణ చెయ్యవలసిందిగా విజ్ఞప్తి.

కృతజ్ఞతలు

 బ్రాహ్మీ

Prasad Charasala

unread,
Sep 27, 2007, 11:16:52 AM9/27/07
to sahi...@googlegroups.com

అలాగే ఈ పూర్తి మంత్రానికి పూర్తి అర్థాన్ని ఎవరైనా చెబుతారా దయచేసి.

--ప్రసాద్
http://blog.charasala.com



carani narayanarao

unread,
Sep 27, 2007, 11:55:38 AM9/27/07
to sahi...@googlegroups.com

స్వస్తి శ్లోకం పూర్తి పాఠం:-

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!

న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!

గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యస్యాలినీ!
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!
అపుత్రాః పుత్రిణస్సంత్తు,పుత్రిణస్సంత్తు పౌత్రిణః!
అధనా స్సధనా స్సంతు జీవంతు శరదాం శతం!!
యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే!
వృతనాళౌ సమభవత్ తత్తే భవతు మంగళం!!
ఋతవ స్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చతే!
మంగళాని మహారాహో దిశంతు తవ సర్వదా!!

కాయేన వాచా మనసేంద్రియైర్వా!
బుధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్!!
కరోమి యద్యత్సకలం పరస్మై!
నారాయణా యేతి సమర్పయామి!!

[నిత్యసాధనచంద్రిక, ప్రచురణ:విశ్వహిందూపరిషత్, ఆంధ్రప్రదేశ్]
________________________________________________




Get the freedom to save as many mails as you wish. Click here to know how.

carani narayanarao

unread,
Sep 27, 2007, 1:31:26 PM9/27/07
to sahi...@googlegroups.com

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!

న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!

గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యస్యాలినీ!
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!
____________________________________
word meanings:

స్వస్తి=hail(praise)
ప్రజాభ్యః = all the subjects(people)
పరిపాలయంతాం = king who protects with full vigoru
న్యాయేన = justice
మార్గేణ = on the path of
మహీం =earth
మహీశాః =the kings
గో = cow
బ్రాహ్మణ్యేభ్యః = to brahmin i.e knower of Brahman
శ్శుభ మస్తు = auspicious be
నిత్యం = always
లోకా: = subjects
మస్తా : = all
స్సుఖినో  = happy, contended
భవంతు = be
కాలే = appropriate time
వర్షతు = fall
పర్జన్యః = the rains
పృథివీ =the earth
సస్యస్యాలినీ = full of ripe grain
దేశ: = country
అయం = this
క్షోభః =agitation, disturbances, irritations
రహితః = devoid of
బ్రాహ్మణా: = all the brahmins( learned men)
సంతు = may become
నిర్భయా: = fearless
_________________________________
Purport:-
Praise be to all the kings, who protect all their subjects with full vigour and with full sense of justice.May the cows and Brahmins (learned persons) be always auspicious May all the subjects be always happy.May the rains fall always at the appropriate time so that the fields are full of ripe grain.May this country be always free from agitation and disturbances. may all the Brahmins (learned men) be fearless.
(pushpaanjali, Central Chinmaya Mission, Bombay)
___________________________________________


----- Original Message ----
From: Prasad Charasala <char...@gmail.com>
To: sahi...@googlegroups.com
Sent: Thursday, 27 September, 2007 8:46:52 PM
Subject: [సాహిత్యం] Re: "సర్వే జనా సుఖినోభవంతు" అనే పాదం ఎక్కడిది

అలాగే ఈ పూర్తి మంత్రానికి పూర్తి అర్థాన్ని ఎవరైనా చెబుతారా దయచేసి.

--ప్రసాద్
http://blog.charasala.com



Did you know? You can CHAT without downloading messenger. Click here

కందర్ప కృష్ణ మోహన్

unread,
Sep 27, 2007, 2:09:42 PM9/27/07
to sahi...@googlegroups.com
నారాయణరావు గారూ
మీ ఓపికకి జోహార్లు.. కృతజ్ఞతలు..


--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/
http://abhagyanagaram.blogspot.com/

Prasad Charasala

unread,
Sep 27, 2007, 3:48:25 PM9/27/07
to sahi...@googlegroups.com

నెనర్లు.

--ప్రసాద్
http://blog.charasala.com



--
Prasad
http://blog.charasala.com

mayookhaa

unread,
Sep 27, 2007, 9:35:17 PM9/27/07
to sahityam
నారాయణగారి ఓపికకు జోహార్లు
బ్రాహ్మీ గారు......
నేను శాంతి మంత్రం చెప్పెటప్పుడు "సర్వేజనా సుఖినోభవంతు" అని చెప్పుకోవడం
వల్లా అలా రాసాను

పెద్దలు చెప్పినట్టు "అది లోకా సమస్తా సుఖినోభవంతు " అవ్వవచ్చు

పూర్తి వివరాలు నేను మా గురువుగారిని అడిగి చెప్తాను

బ్రాహ్మీ

unread,
Sep 28, 2007, 12:22:00 AM9/28/07
to sahi...@googlegroups.com
అందరికీ బ్రాహ్మీ నెనర్లు నెనర్లు

బ్రాహ్మీ
 
Reply all
Reply to author
Forward
0 new messages