తత్వమేతే కేశవా!?

5 views
Skip to first unread message

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Jun 6, 2007, 4:27:03 PM6/6/07
to sahi...@googlegroups.com
మహాభారతంలో ద్రౌపది ఒకసారి కృష్ణుని అడుగుతుందిట - (బహుశా కర్ణునికూడా భర్తగా పొందాలనే తన కోరికను వెల్లడించే సన్నివేశంలో)
भ्रातरम् पितरम् सुतम् सुंदरम् पुरुषम् दृष्ट्वा |
योनिर्द्रवन्ति नारीणाम् - तत् त्वम् एते केशवा ||
 
అని. 
 
భౌతికము - నైతికము 
ప్రకృతి - వికృతి 
సహజము - సంస్కారము
 
వీటిమధ్య కొట్టుకులాడే మానవమాతృలందరికీ లింగభేదం లేకుండా కలిగే సంఘర్షణకు సందేహరూపం ఈ ప్రశ్న. 
సర్వజ్ఞుడైన తన సోదరుని - తత్ త్వం ఏ తే (దీనిపై నీవేమంటావు, కేశవా!?) అని అడుగుతుంది.
పరమాత్ముని రూపంలో దీనికి వేదవ్యాసుడు సమాధానం ఏమిటో నాకు తెలీదు.
ఎవరికైనా తెలుసా?
 
కల్హార నుండి ఈ క్రింది పంక్తులు చదివితే నాకు పైన చెప్పిన వేదవ్యాసుని శ్లోకం గుర్తుకువచ్చింది.
స్వాతిగారి అనుమతి తీసుకోలేదుకనుక ఆ కవితలోని పంక్తులను పూర్తిగా రాయడం లేదు. లంకె (link) ఇచ్చాను.
 
"జీవించటమే ధ్యేయమైతే,
***********************,
*********************************,
********* విలువలు తెలియవు మరి.

భౌతికమేదైనా..
నైతికమౌనా కాదా అని
********************************.

సౌందర్యమూ, క్షణ******************,
************* ఏమని ఏం లాభం.

సుడి గాలి మాటేమో, ************************************
స్థితప్రజ్ఞత సంగతేమో, ***********************************? "
 
 

Kalhara

unread,
Jun 7, 2007, 9:28:52 AM6/7/07
to sahityam
ఈ విషయం మీద త్రివిక్రం గారి స్పందన ఇక్కడ.
http://puraanaalu.blogspot.com/2007/06/blog-post.html

స్వాతి.

త్రివిక్రమ్

unread,
Jun 7, 2007, 10:08:33 AM6/7/07
to sahi...@googlegroups.com

ఈ విషయం మీద త్రివిక్రం గారి స్పందన ఇక్కడ.
http://puraanaalu.blogspot.com/2007/06/blog-post.html
 
నిజానికి అది రానారె అడిగిన ప్రశ్నకు సమాధానం కాదు. అదంతా ఇక్కడ రాస్తే చర్చ మొదలవకముందే పక్కదారి పడుతుందని ఇక్కడ రాయలేదు. :)


--
త్రివిక్రమ్
"It is not how old you are, but how you are old."

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Jun 7, 2007, 10:46:53 AM6/7/07
to sahi...@googlegroups.com
త్రివిక్రమ్, మీ మాట ఇక్కడ అవసరమైంది. అందుకు మీకు ధన్యవాదాలు.
 
వ్యాసభారతాన్ని నేను చదవలేదు. భారతం అనగానే నలుగురూ నాలుగురకాలుగా నమ్ముతారు, మాట్లాడతారు కదాని "..ట, బహుశా" అన్నాను. అయితే, ఆ శ్లోకం మాత్రం నేను విన్నాను. అందులోని "విషయం"పై విజ్ఞులెవరైనా వ్యాఖ్యానిస్తే తెలుసుకుందామని - అది భారతంలోది అయినా సరే కాకపోయినా సరే.
Reply all
Reply to author
Forward
0 new messages