మంచి పుస్తకాల ఇకఃట్టా

23 views
Skip to first unread message

రాకేశ్ Achanta

unread,
Aug 26, 2007, 9:52:25 AM8/26/07
to sahi...@googlegroups.com
మీరు ఇచ్టిన సూచనలన్నీ కలిపి నేను ఒక వర్డ దస్తూరి గా వ్రాసుకున్నాను.

కృతజ్ఞతలు
రాకేశ్వర రావు

త. రా : వర్డ్ లో తెలుగు లో బులెట్స్ మరియు నెంబరింగ్ వచ్చేడట్టు కుదురుతుందా? నాకు హిందీ నెంబర్లు వస్తున్నాయి గాని తెలుగులో రావట్లేదు.
చదవవలసినవి.doc

padma i.

unread,
Aug 26, 2007, 12:47:52 PM8/26/07
to sahityam
correction: దృశ్యాదృశ్యం(చంద్రలత) కథల సంపుటి కాదు, నవలే.

-- Padma I.
8/26/07

రాకేశ్వర రావు ఆచంట

unread,
Aug 27, 2007, 4:47:55 AM8/27/07
to sahityam
కృతజ్ఞతలు

kotta pali

unread,
Aug 27, 2007, 8:18:32 AM8/27/07
to sahi...@googlegroups.com
ఇకట్టా??
 
రాకేశ్వరా - మరికొన్ని సవరింపులు సూచనలు
వడ్డెర చండీదాస్ హిమజ్వాల, అనుక్షణికం, చిలకమర్తి గణపతి కూడా నవలలే
 
నవలల్లో వీటిని కూడా చేర్చు
అతడు అడవిని జయించాడు - కేశవరెడ్డి
నారాయణరావు - అడివి బాపిరాజు
మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి
 
ఆలూరి బైరాగి నూతిలో గొంతుకలు కవిత్వం.
కవిత్వంలో చేర్చవలసినవి
జయప్రభ - చింతల నెమలి (దీని తరవాతవి కొనొద్దు)
ఆకురాలు కాలం - మహెజబీన్
శివారెడ్డి జైత్రయాత్ర
పాపినేని శివశంకర్ - ఏ పుస్తకమైనా
వాడ్రేవు చినవీరభద్రుడు - ఏ పుస్తకమైనా
మోహనప్రసాద్ చితి చింత
శిఖామణి మువ్వల చేతికర్ర
ఇస్మాయిల్ - ఏ పుస్తకమైనా
తమ్మినేని యదుకులభూషణ్ - నిశ్శబ్దంలో నీ నవ్వులు
విన్నకోట రవిశంకర్ - వేసవి వాన
 
సాహితీ సర్వస్వాలకి వేరే విభాగం పెట్టాలేమో.
విశాలాంధ్ర చాలామంది పాత తరం రచయితల రచనా సర్వస్వాల్ని ప్రచురిస్తోంది. అందులో ముఖ్యమైనవి
కొడవటిగంటి కుటుంబరావు
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
వాసిరెడ్డి సీతాదేవి
ముళ్ళపూడి వెంకటరమణ
దేవులపల్లి కృష్ణశాస్త్రి

వీశాలాంధ్ర కాకుండా ఇతర ప్రచురణ కర్తలు ప్రచురించిన సాహితీసర్వస్వాలు
కాళీపట్నం రామారావు కథలు
విశ్వనాథ నవలా సర్వస్వం (ఇప్పుడు ఒకే సెట్టుగా దొరుకుతోంది).
 

 
http://kottapali.blogspot.com
http://vinnakanna.blogspot.com
http://telpoettrans.blogspot.com


----- Original Message ----
From: రాకేశ్ Achanta <rake...@gmail.com>
To: sahi...@googlegroups.com
Sent: Sunday, August 26, 2007 9:52:25 AM
Subject: [సాహిత్యం] మంచి పుస్తకాల ఇకఃట్టా

మీరు ఇచ్టిన సూచనలన్నీ కలిపి నేను ఒక వర్డ దస్తూరి గా వ్రాసుకున్నాను.

కృతజ్ఞతలు
రాకేశ్వర రావు

త. రా : వర్డ్ లో తెలుగు లో బులెట్స్ మరియు నెంబరింగ్ వచ్చేడట్టు కుదురుతుందా? నాకు హిందీ నెంబర్లు వస్తున్నాయి గాని తెలుగులో రావట్లేదు.


Be a better Heartthrob. Get better relationship answers from someone who knows.
Yahoo! Answers - Check it out.

తుమ్మల శిరీష్ కుమార్

unread,
Aug 27, 2007, 10:23:48 AM8/27/07
to sahi...@googlegroups.com
హిందీలో ఇకట్టా అంటే ఒకచో చేర్చడం అని. బహుశా ఆ అర్థంలో వాడారేమో!
-చదువరి
--
http://chaduvari.blogspot.com

రాకేశ్ Achanta

unread,
Aug 28, 2007, 2:49:21 AM8/28/07
to sahi...@googlegroups.com
(హిందీలో ఇకహ్-ట్టా అన్నట్టు పలుకుతారు దానికి తెలుగు తట్టకా అలా వ్రాసా. )

సూచించి కృతజ్ఞతలు
చదవవలసినవి.doc v2.0 చూడగలరు
చదవవలసినవి.doc

నవీన్ గార్ల

unread,
Aug 28, 2007, 8:03:23 AM8/28/07
to sahityam
రాకేశ్ సమయం తీసుకొని, మంచి పుస్తకాల పేర్లన్నీ సంకలనం చేసినందుకు చాలా
సంతోషం.

ఇవన్నీ ఇంటర్నెట్ ద్వారా కొనడం మంచిదా లేకా నేరుగా ఏదైనా అంగడిలోనే
దొరుతుందా? (నేను భారతదేశంలోనే ఉంటాను)

- నవీన్ గార్ల

> చదవవలసినవి.doc
> 100KDownload

రాకేశ్వర రావు ఆచంట

unread,
Aug 28, 2007, 8:39:42 AM8/28/07
to sahityam
మీకు కావలసినవి అంతర్జాలంలో దొరికితే, కొనేసుకొండి.
నేను ఈవాళ విశాలాంధ్ర వెళ్ళి వస్తున్నా. చచ్చి బ్రతికినంత పనైంది.
Reply all
Reply to author
Forward
0 new messages