బుద్ధ భగవానుడు ఒక వనంలో కూర్చొని శిష్యులకు బోధ కావిస్తున్న తరుణంలో, 'ఆమ్రపాలి' అనే వేశ్య అక్కడకు వచ్చినది, కాని ఆమెను బుద్ధుని శిష్యుడు స్వామి దర్శనానికి అనుమతించేందుకు వెనుకాడాడు. అప్పుడు తథాగతుడు ఇట్లు వచించెను. 'వృత్తి యొక్క ఉచ్ఛనీచాలు కర్మ ఆధీనములో ఉంటాయి, అంతఃకరణ ప్రవృత్తి మనిషిని వృత్తికి అతీతుణ్ణి చేస్తుంది'అని ఆ పిదప ఆమెకు బుద్ధని దర్శనం సిద్ధించటం తోపాటు, భిక్ష నొసగే భాగ్యం లభించింది.