Quote of the Day

5 views
Skip to first unread message

radha krishna kantamneni

unread,
Nov 13, 2013, 5:39:16 PM11/13/13
to sadh...@googlegroups.com

తమో, రజోగుణములను ఆశ్రయించి ప్రవర్తించిన ఆచరణలో ప్రత్యేకత లేక విశేషత ఉంటుంది

సత్వగుణ ఆచరణ సామాన్యముగా ఉంటుంది.
ఆచరణలో విశేషత లేక  సామాన్యముగా ఉండునట్లు చూచుకొండి.

radha krishna kantamneni

unread,
Nov 14, 2013, 5:53:08 PM11/14/13
to sadh...@googlegroups.com
జీవన్ముక్తుడు
ఏది వచ్చినా , ఏది పోయినా

ఏది ఉన్నా , ఏది లేకున్నా

ఏది జరిగినా , ఏది జరుగక పోయినా

ఏది చేసినా , ఏది చెయ్యక పోయినా

తన స్వస్వరూప స్థితి యందు సహజముగా ఉంటాడు. దుఖమును పొందడు

కనుక ముక్తుడైన వానికి ఉన్న స్వేచ్చ ఎవనికి ఉండదు. అతడు చేసి చెయ్యని వాడు. జీవించి జీవించని వాడు

radha krishna kantamneni

unread,
Nov 15, 2013, 6:02:23 PM11/15/13
to sadh...@googlegroups.com

విషయముల యెడల అనురాగము రెండు పద్దతులలో తొలగుతుంది

1. నిష్కామ కర్మ - కర్మ ఫలమును ఆశించ కుండా కర్మ చేయుట

2. అమనస్కము - కర్తయే లేని పద్దతిలో , మనస్సుతో పనిలేకుండా కర్మ చేయుట

ముందు కర్మ ఫలమును ఆశించ కుండా కర్మ చేయుట అలవాడాలి. తరువాత అమనస్కము.

radha krishna kantamneni

unread,
Nov 17, 2013, 5:43:38 PM11/17/13
to sadh...@googlegroups.com
మనలో అహంతో కూడుకొని, అజ్ఞానముతో  కూడుకొని ఎన్ని భావనలైతే ఉన్నాయో అవన్ని దుఃఖమునకు హేతువులే. దుఃఖ అనుభవము నీకు కలుగు చున్నది అంటే దాని వెనుక తప్పక అహము, అజ్ఞానము  ఉంటుంది.ఎవనికైతే దుఃఖము నిశ్శేషముగా పోయినాదో వాడే జీవన్ముక్తుడు

radha krishna kantamneni

unread,
Nov 18, 2013, 6:01:15 PM11/18/13
to sadh...@googlegroups.com

విషయము మీద కాంక్ష ఉంటే రజోగుణము

విషయము మీద కాంక్ష లేకపోతే  సత్వగుణము

విషయము మీద కాంక్ష బలపడిపొతే  తమోగుణము

radha krishna kantamneni

unread,
Nov 19, 2013, 6:25:12 PM11/19/13
to sadh...@googlegroups.com

రాని భవిష్యత్తును ఊహిస్తున్నావు

గతమును జ్ఞాపకముల రూపములో వెంటాడు చున్నావు

విలువైన వర్తమానమును కోల్పోవు చున్నావు

radha krishna kantamneni

unread,
Nov 20, 2013, 5:54:37 PM11/20/13
to sadh...@googlegroups.com

నవవిధ భక్తి మార్గములను ఆచరించుట వలన చిత్తశుద్ది కలుగుతుంది.

విషయముల యెడల అనురాగము తగ్గుతుంది.

విషయముల యెడల అనురాగము వలననే నేను శరీరమును అను భావన బలపడు చున్నది.

radha krishna kantamneni

unread,
Nov 21, 2013, 6:30:20 PM11/21/13
to sadh...@googlegroups.com

నేనుకు ఒక లక్షణము ఉన్నది. అది దేనితో కలిస్తే అదే నేను అయిపోతుంది

విషయములలో చేరితే విషయములే నీవు జ్ఞానములో చేరితే జ్ఞానమే నీవు

radha krishna kantamneni

unread,
Nov 22, 2013, 6:27:36 PM11/22/13
to sadh...@googlegroups.com

బుద్ధి వికాసము కొరకు    మానవ ఉపాధి లభించినది

బుద్ధి వికాసము ఆత్మ విచారణచే పూర్తి అవుతుంది

నేనే అంతటా, అన్నిటా వ్యాపించి ఉన్న సత్, చిత్ , ఆనంద స్వరూపుడను.

ఆత్మను , పరమాత్మను నేనే అన్న జ్ఞానము లభిస్తే మానవ ఉపాధి ప్రయోజనము పూర్తి అయినట్లే

Reply all
Reply to author
Forward
0 new messages