శ్రీ గురు గీత

61 views
Skip to first unread message

radha krishna kantamneni

unread,
Nov 19, 2013, 6:32:28 PM11/19/13
to sadh...@googlegroups.com
శ్లోకం:
య ఏవ కార్యరూపేణ కారణేనాపి భాతి చ |
కార్య కారణ నిర్ముక్తః తస్మై శ్రీ గురవే నమః ||...

తాత్పర్యం:
ఎవడు కార్యరూపంగాను (అంటే ఈ జగత్తు రూపంగాను), కారణ రూపం గాను (అంటే మాయా రూపంగాను) ఉన్నట్లు కనిపిస్తున్నా, నిజానికి ఈ కార్యకారణాలకు రెంటికీ అతీతుడో అలాంటి శ్రీగురువుకు నమస్కారము.

radha krishna kantamneni

unread,
Nov 20, 2013, 6:07:07 PM11/20/13
to sadh...@googlegroups.com
శ్లోకం:
జ్ఞాన శక్తి స్వరూపాయ కామితార్థ ప్రదాయినే |
భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః ||...

తాత్పర్యం:
జ్ఞానస్వరూపి, శక్తిస్వరూపి (అందుకనే) కోరిన కోర్కెలన్నీ తీర్చేవాడు, భుక్తి ముక్తి దాత అయిన శ్రీ గురువుకు నమస్కారము.

వివరణ:
ఇక్కడ భుక్తి అంటే కర్మ అని సమన్వయం చేసుకోవాలి. ఆయనకు కార్యము, కారణము, జడము, చైతన్యము, కర్మ, ముక్తి అన్నీ ఒకటే. అలాంటి ఎకరూపుడయిన గురువుకి నమస్కారము.

radha krishna kantamneni

unread,
Nov 21, 2013, 6:49:09 PM11/21/13
to sadh...@googlegroups.com
శ్లోకం:
అనేక జన్మ సంప్రాప్త కర్మకోటి విదాహినే |
జ్ఞానానల ప్రభావేణ తస్మై శ్రీ గురవే నమః ||
...
తాత్పర్యం:
'జ్ఞాన' మనే అగ్ని ప్రభావంచేత శిష్యులకు అనేక జన్మల నుంచి వచ్చిన కోట్లాది కర్మలను దహించి వేసే శ్రీగురువుకు నమస్కారము.

radha krishna kantamneni

unread,
Nov 22, 2013, 6:29:27 PM11/22/13
to sadh...@googlegroups.com
శ్లోకం:
న గురో రధికం తత్త్వం న గురో రధికం తపః |
న గురో రధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః ||...
తాత్పర్యం:
గురువును మించిన తత్త్వం లేదు. తపస్సు లేదు. జ్ఞానం లేదు. అట్టి శ్రీ గురువుకు నమస్కారము.
Reply all
Reply to author
Forward
0 new messages